EPISODE · Dec 29, 2022 · 12 MIN
సంపత్ సినిమా కథలు - 5 | Sampath Cinema Kathalu - 5 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 5 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నర్సింహ తన అనుచరులతో నారాయణ, పిచ్చి అవతారం దాక్కొన్న రూం దగ్గరకి రావడం చూస్తూ అక్కడికి కిరణ్ వచ్చాడు. నారాయణను, పిచ్చి అవతారాన్ని నరసింహకు కనపడకుండా అడ్డుగా ఒక దుప్పటి పెట్టి, వాళ్ళను నారాయణకు కనపడకుండా కాంపౌండ్ వెనక గేట్ దగ్గరకు వెళ్ళమన్నాడు. నారాయణ ఏమీ ఆలోచించకుండా కిరణ్ చెప్పినట్టు చేశాడు. తర్వాత కిరణ్ కాంపౌండ్ వెనక గేట్ దగ్గర ఉన్న నారాయణ, పిచ్చి అవతారం దగ్గర కెళ్ళి ముందు "నేను చెప్పినట్టు చెయ్యి" అంటూ నారాయణ చెవిలో ఏదో చెప్పాడు. "సరే " అంటూ ‘ఆరే అవతారం.. పద.. ’ అంటూ అక్కడే ఒక చోట ఉన్న రూములో వాడిని ఉంచి కుర్చీలో కూర్చొపెట్టి, అక్కడ ఉన్న తాడుతో చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డ పెట్టి బయటకు వచ్చి ఆ రూము డోర్కు ఉన్న గొళ్ళెం పెట్టాడు. తర్వాత అవతారం ఎంత అరచినా నోట్లో గుడ్డ ఉండటం వలన అరుపు బయటకు వినిపించలేదు. నారాయణ అక్కడ ఉన్న కిరణ్ దగ్గరకు వచ్చి " నీవు చెప్పినట్లు చేశా" అన్నాడు. "రేపు పిచ్చి అవతారం గాడిని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర.. అంటే మీ గెస్ట్ హౌస్ లో ఉంచుదాం. అంతవరకు వాడు చావకుండ తిండి ఏర్పాట్లు చూడు. తర్వాత కొన్ని రోజుల తరువాత వెండితెర మీద అసలు సినిమా చూపిస్తా " అన్నాడు కిరణ్. "అలాగే బాబు. " ఉల్లాసంగా అన్నాడు నారాయణ. నరసింహ తన అనుచరులతో రూములోకి వచ్చి ఎంత వెతికినా నారాయణా, పిచ్చి అవతారం కనపడలేదు. రూములో నుంచి బయటకు వచ్చిన నరసింహ, అతని అనుచరులు అక్కడే ఉన్న రంగ, భీమలను చూసి "ఆ ఇద్దరు ఆ రూములో లేరు కదా" అన్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 5 | Sampath Cinema Kathalu - 5 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.