EPISODE · Jan 18, 2023 · 16 MIN
సంపత్ సినిమా కథలు - 8 | Sampath Cinema Kathalu - 8 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 8 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో కావ్య తన కూతురన్న నిజం చెబుతుంది శివమ్మ. దాంతో కిరణ్, కావ్యల ప్రేమకు అడ్డు తొలగుతుంది. మెరుపు టివి ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి విక్రమ్, కిరణ్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపెడతాడు. ఇక 'సంపత్ సినిమా కథలు’ ఎనిమిదవ భాగం చదవండి. షాలిని మీద నమ్మకంతో ఆమె కార్లో బయలు దేరాడు కిరణ్. అలా షాలినితో పాటు కార్లో వెళుతున్న మధ్యలో వినయ్ చెల్లెలు తనకు ఎలా ఫ్రెండ్స్ అయినది చెబుతుంది. వింటూనే ఆమె ఇచ్చిన చాక్లెట్ తిన్న తరువాత కిరణ్ కు ఏమైందో తెలియదు. లేచి చూసేసరికి ఒక పాడుబడిన ఒక బంగ్లాలో ఒక రూము లో ఉన్నాడు. అప్పుడు తాను తిన్నది మత్తు చాక్లెట్ అని, మోసపోయి వచ్చానని తెలుసుకున్న కిరణ్ మత్తు నుండీ నిద్ర లేచేసరికి చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. నెమ్మదిగా లేచి ఆ రూంలో నుండీ బయటకి వచ్చి చూస్తే ఒక పెద్ద హలూ, కొంతమంది యువతీ యువకులు మత్తులో మునిగి తేలుతున్నారు. అప్పుడు కిరణ్ కి అర్థం అయ్యింది. ఎవరో తెలిసిన వారే నన్ను కిడ్నాప్ చేసి ఈ డ్రగ్స్ మాఫియా ఉచ్చులో నెట్టాలని చేస్తున్నారు అని. తెలివిగా ఇక్కడ నుండి తప్పించు కొని వీళ్ళ గుట్టు రట్టు చేయలని మత్తులో ఉన్న యువతీ యువకులు ఫోటోలు, వీడియో సెల్ ద్వారా తీశాడు. తర్వాత ఇంకో రూమ్ లో కి వచ్చి చూస్తే ఒక పెద్ద మనిషి.. ఫేస్ సరిగా కనపడలేదు.. అతని ముందు ఉన్న ఇద్దరు డ్రగ్స్ సరఫరా గురుంచి వివరిస్తూ ఉన్నారు. అది కూడా వాళ్లు మాట్లాడుతుంటే వీడియో రికార్డు చేశాడు. వాతావరణం సైలెంట్ గా ఉంది కాబట్టి వాళ్లు మాట్లాడే మాటలు సృష్టంగా రికార్డ్ అయ్యాయి. అక్కడ నుంచి ఎలాగైనా తప్పించు కొందామని అనుకొనే లోపల అప్పుడే బయట నుంచి వస్తున్న ఒకడు చూసి గట్టిగా అరచాడు. ఆ అరుపు విని కిరణ్ పారిపోతుంటే చుట్టు నలుగురు వచ్చి పట్టుకొన్నారు. వారినుంచి పెనుగులాడుతూ ఉంటే సెల్ అక్కడ ఉన్న చిన్న గుంతలో పడి పోయింది. ఆ సెల్ కనబకుండా అక్కడ ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ము ఆ గుంత మీదకు నెట్టాడు. తర్వాత షాలిని వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అంతే మత్తులోకి జారిపోయడు. తర్వాత ఇంక అప్పుడే విక్రమ్ తన పోలీస్ బృందంతో ‘రెడీ టూ ఎటాక్’ ఆపరేషనుతో అక్కడ ఎటాక్ చేశాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ds3ggrnrun0
Embed this episode
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 8 | Sampath Cinema Kathalu - 8 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.