EPISODE · Jan 27, 2023 · 13 MIN
సంపత్ సినిమా కథలు - 9 | Sampath Cinema Kathalu - 9 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 9 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తను ఎలా ట్రాప్ చెయ్యబడ్డది గుర్తుకు చేసుకుంటాడు కిరణ్. లింగస్వామి నమ్మక ద్రోహం చేస్తున్న విషయం కిరణ్ కి చెబుతాడు పోలీస్ ఆఫీసర్ విక్రమ్. ఇక 'సంపత్ సినిమా కథలు’9 వ భాగం చదవండి. తర్వాత తెలిసింది మీ లింగస్వామి అంకులే లారితో మన జీప్ ను డీ కొట్టించాడని. అప్పుడు నాకు దెబ్బలు బాగా తగిలినా ప్రాణాలకు ముప్పు రాలేదు. ఇంకా నీవు మత్తులోనే ఉన్నావు. నీకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా బలమైన షాక్ తో కోమా లోకి వెళ్ళిపోయావు. అప్పుడు లింగస్వామి, అతని కొడుకు ఉదయ్ ఇంకా ఇద్దరు వచ్చి నీవు తీసిన వీడియో సెల్ కోసం ప్యాకెట్లు అన్ని వెతికారు. కాని సెల్ దొరకలేదు. నా పాకెట్స్ కూడ సెల్ కోసం వెతికారు. ఇంకా జీప్ దగ్గర వెతికారు. బాగా దెబ్బలు తగిలినా నేను వాళ్ళను గమనిస్తున్నా. అయిన నాకు నోరు ఎండిపోవడం వలన మాటలు రావడం లేదు. తర్వాత నిన్ను, నన్ను ఒక హాస్పటల్ చేర్చారు. నేను కొద్దిగా కోలుకొన్నాక లింగస్వామి వచ్చి "ఎలా ఉన్నారు సార్." అని అడిగాడు. " మీరు కాల్ చేశాక నా వాళ్లతో వస్తే అప్పుడే మీకు ప్రమాదం జరిగింది. చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. అప్పుడు నేనే మిమ్మల్ని తెచ్చి హాస్పటల్ చేర్చి మీ డిపార్ట్మెంటు వాళ్లకి సమాచారం ఇచ్చాను" అన్నాడు. ‘అలాగా’ అని ‘థాంక్స్’ చెబుతూ, ‘మరి మా పాకెట్స్ ఎందుకు వెతికారు’ గా అడుగుదాం అనుకున్నా. మళ్ళీ ‘ఇప్పుడు వద్దు, నిదానంగా విషయలు కాస్త అర్థం అయ్యాక తెలుసుకుందాం’ అనుకున్నా. ఇంతలో 'ఇంక కాస్త రెస్ట్ తీసుకోండి. మళ్ళీ వస్తా' అని చెప్పి లింగస్వామి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొద్ది సేపు అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని బయటకు వచ్చా. లింగస్వామి నన్ను చూసి 'మీ డిపార్ట్మెంటుతో మాట్లాడినాను. కిరణ్ ను ఊటిలో ఉండే మా హాస్పటల్ కు తీసుకెళ్లుతానని చెప్పాను. వాళ్లు సరే అన్నారు.' అన్నాడు. ‘మరి రాజరావుకి కొడుకు ఆచూకీ దొరికిందని తెలుసా’ అన్నాను. 'కోమాలో ఉన్న కొడుకును చూసి వాళ్ల నాన్న రాజరావు తట్టుకోలేడు. అక్కడ కోమా నుంచి బయటకు వచ్చాక ఆయనకు చెబుదాం. అలాగె మీరు చేసే ఎంక్వరీకి కూడా ఏ ఆటంకం ఉండదు' అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3QJTSGTy7T4
Embed this episode
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 9 | Sampath Cinema Kathalu - 9 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.