EPISODE · Nov 15, 2022 · 8 MIN
సంస్కృతి | Samskruthi | Telugu Short Story | Kiran Jammalamadaka | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంస్కృతి రచన: కిరణ్ జమ్మలమడక పుట్టినరోజు ప్రతిఒక్కరి జీవితంలో గొప్ప క్షణాలలో ఒకటి. ధరణి , శేఖర్ లకు ఒక రెండేళ్ల పాప ‘పావని’. పావని పుట్టినరోజు అనాధాశ్రమం లో జరపాలని ధరణి ఏర్పాట్లు చెయ్యటం మొదలు పెట్టింది. శేఖర్ ఒకరిద్దరు మిత్రులను కూడా ఆహ్వానించాడు. అంతా కలిపి ఒక పదిమంది అయ్యారు. ఆ ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ధరణి కి ఎంతో ఆనందం గా వుంది. ఒక వారం క్రితమే తమకు దగ్గర్లో వున్న ఆశ్రమానికి ఫోన్ చేసి, అక్కడ వార్డెన్ సరస్వతి గారితో మాట్లాడింది. వార్డెన్ కూడా సరే అని అక్కడ పిల్లల వివరాలు చెప్పారు. అప్పటినుంచి నుంచి ధరణి ఆ ఏర్పాటుల్లోనే వుంది. అక్కడ పిల్లలకి కొన్ని బొమ్మలు కొంది. శేఖర్ కేటరింగ్ ఇద్దామన్నా , తనకు తృప్తి గా ఉండదని తానే చేస్తాను అని మొత్తం తానే చెయ్యటానికి పూనుకుంది. రేపటికి ఒక్క భోజనం తప్ప అన్ని రెడీ. తెల్లవారుజామునే లేచి , యేభై మందికి బిర్యానీ చేసి , పాపని తయారు చేసి, భోజనం సమయానికి ఆశ్రమం చేరుకున్నారు. చెప్పినట్టుగానే శేఖర్ మిత్రులు కూడా వచ్చారు రాగానే శేఖర్, ధరణిలను వాళ్ళ మంచి ఆలోచనకు మెచ్చుకున్నారు. అందరూ వెళ్లి వార్డెన్ని కలిసి, కేక్ కటింగ్ చేద్దామని పిలిచారు. వార్డెన్, అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరికి చెప్పి ఏర్పాట్లు చూడమని పురమాయించింది. ధరణి మొదటిసారి, ఫోన్ చేసినప్పటినుండి ఆ వార్డెన్ కొంత ముభావంగానే వుంది. ఆమెకు ఇష్టంలేదా? అన్న అనుమానం ఇప్పుడు మరింత బలపడింది ధరణికి. కానీ ఎవరైనా ఎందుకు వద్దంటారు? పనిగట్టుకొని వొచ్చి పిల్లలకి బొమ్మలు, బిర్యానీ పెడతామంటే? అని తనని తానే సముదాయించుకొని పనిలో పడింది. పిల్లలంతా ఒక చిన్న హల్లో చేరారు. అక్కడ ఒక టేబుల్ పెట్టారు. దాని మీద ధరణి తెచ్చిన దుప్పటి పరిచి, ఒక అడుగున్నర ఎత్తున్న కేక్, దానిమీద ఒక అమ్మాయి బొమ్మ.. చూడడానికి చాలా బావుంది. అది దానిమీద పెట్టగానే, పిల్లలు అంత నోరెళ్ళబెట్టి చూడటం ధరణి గమనించి నవ్వుకుంది సంతోషంగా. పాప చేత కేక్ కటింగ్ కి అన్ని సిద్ధం చేసారు. కానీ వార్డెన్ సరస్వతి ఇంకా రాలేదు. ఆమెని పిలిస్తేకాని రాదనుకుంటా అని ధరణి కొంచెం అసహనంతో ఆమె దగ్గరకు వెళ్లి, పిలుచుకొచ్చింది. ఆమె రావటం, పాప కేక్ కట్ చేయటం, బుడగలు, కాగితపు బాణాసంచ కాల్చడము, శేఖర్, ధరణి పాపని ఆశీర్వదించటం.. శేఖర్ మిత్రులు పాప పైన అక్షింతలు వేసి గిఫ్ట్స్ ఇవ్వటం.. అంతా చక చక జరిగిపోయాయి... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/od6V9GwmNPw
Embed this episode
NOW PLAYING
సంస్కృతి | Samskruthi | Telugu Short Story | Kiran Jammalamadaka | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.