సరదాగా సందడి కోసం | Saradaga Sandadi Kosam | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · May 24, 2023 · 9 MIN

సరదాగా సందడి కోసం | Saradaga Sandadi Kosam | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Saradaga Sandadi Kosam' - New Telugu Story Written By Pandranki Subramani 'సరదాగా సందడి కోసం' తెలుగు కథ రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇప్పటి ఆందోళనకర పరిస్థితి యెలాంటిదో యెలా విస్తరిస్తుందో అందరికీ అవగతమే. నా బడిరోజుల్లో నేను చదివిన అపరాధ పరిశోధక నవల్సులో ఒక పదం తరచుగా కనబడేది- లాకప్. ఇప్పడు అదే రీతిన వినిపించే పదం- లాకవుట్. సామాజిక వాతావరణం యెంత జటిలంగా తయార యిందంటే; మనిషి తోటి మనిషిని మానవ రూపంలో చూడడం మానుకుంటున్నాడు. అల్లంత దూరం నుంచి పరికిస్తూనే కరోనా వైరస్ గానో మరొక కొత్తరకపు వైరస్ గానో తల పోస్తున్నాడు. కరోనాను కట్టెదుట చూస్తున్నట్లే బెరుకు బెరుకుగా చూస్తున్నాడు. ముఖ కవచాన్ని తరచుగా సర్దుకుంటున్నాడు. బిర్ర బిగించుకుంటున్నాడు. రోడ్డుపైన కనిపిస్తే చాలు నడచిపోతూన్న మనిషిని గుర్రుగా అదోలా కళ్ళు మిటకరిస్తూ దగ్గరకు వస్తున్నాడు రక్షక భటుడు. ఇటువంటి క్లిష్ట సమయంలో యిరుగ పొరుగు ప్రయాణాలకు దూరమయి యింట్లోనుంచి బైటకు కాలుపెట్టలేని స్థితికి లోనయిన ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి పరిస్థితి యెలా ఉంటుంది? ఊహించడానికే కంపరం కలుగుతుంది కదూ! వెన్నెముకలో చలి పుడ్తుంది కదూ! ఇంటా బైటా వైరస్ కి మొదటి టార్గట్ అరవై యెళ్ళు పైబడ్డ విశ్రాంత జీవులే-- విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగిగా దాదాపు నా పరిస్థతి కూడా అంతే-- అధ్యయనంలో మునిగి తేలడం యెంతటి ఆసక్తి గల అంశమైతే మాత్రం, రోజంతా పుస్తకం చేతబట్టుకుని కూర్చోలేము కదా! బిరబిర వ్రాస్తూ ఉండలేము కదా! అందులో వార్తా పత్రికల ప్రచురణలు కూడా కరువాయె-- అటువంటి స్తబ్ధ వాతావరణంలో ఆ రోజు అందరిలాగే నేను కూడా యథాలాపంగా టీవీని ఆన్ చేసాను. ఉలిక్కిపడుతూ కళ్ళు మిటకరించాను, రివటలాంటి ఇద్దరమ్మాయిలు గెంతులు వేస్తున్నా రు. ఆడుతూ పాడుతూ చీరచెంగుల్ని ఉండలు చుట్టుకుంటూ గుట్టలపైకి యెక్కేస్తున్నారు. పూల చెట్ల పొదల్లోకి యెవరూ దూరలేని సందుల్లోకి దూకేస్తున్నారు. ఇద్దరూ చేతులు పైకెత్తి ఉద్వేగపూరితంగా పాడుతూ ఆకాశాన్ని దగ్గరకు రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అసలీ అమ్మాయిలిద్దరూ మానవ లోకానికి చెందినవారేనా! లేక టీవీ చానెల్ వాళ్ళు పొరపాటున ఎప్పటిదో ప్రాత కార్యక్రమాన్ని తిరిగదోడి చూపిస్తున్నారా, ఇప్పటి కాలమాన ఉద్రిక్త పరిస్థితుల్ని అలవోకగా విస్మరించి! చూసినవారు నవ్విపోదురు గాక—కాదు! అటువంటిదేమీ జరగ లేదు. యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయిలిద్దరూ పూర్తి స్పృహతోనే ఉత్సాహాన్ని పుణికి పుచ్చుకునే చెంగు చెంగున నాట్యమాడుతున్నారు. టీ వీ చానెల్ వాళ్ళు కావాలనే ఆ కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఇదెలా తెలుసుకున్నానంటే— చిట్ట చివరన ఒక వ్యాఖ్యానాన్ని చేసారు యాంకర్లు—కొద్ది సేపు కరోనాను మరచి సరదాగా ఉందామని-- అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఉన్నపాటున గతంలోకి వెళ్ళిపోయాను. నా జీవితంలోనూ సరదాగా సంతోషంగా గడిపిన సంఘటనులు ఉన్నాయి కదా-- ఎప్పుడూ మార్కు లిస్టులా వస్తూన్న కరోనా కేసుల గురించే, వేసుకోబోబ బూస్టర్ డోసుల గురించే పదే పదే తలపోస్తూ ఉండేకన్నా నా కెదురైన ఒకటి రెండు నవ్వు పుట్టించే ఉదంతాలను తోటివారితో పంచుకోవచ్చు కదా! మనసుని అటునుంచి యిటు మళ్ళించ వచ్చు కదా! కథల రాయుడిగా ఇది నా కనీస సామాజిక కర్తవ్యం కాదూ! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/g-yQsHPwNm0

Episode metadata supplied by the publisher feed · Published May 24, 2023

Embed this episode

NOW PLAYING

సరదాగా సందడి కోసం | Saradaga Sandadi Kosam | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 9:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 24, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!