Sri Bhramarambika Ashtakam in Telugu | శ్రీ భ్రమరాంబిక అష్టకం | Popular Telugu Devi Stotras | Spiritual episode artwork

EPISODE · Oct 5, 2023 · 4 MIN

Sri Bhramarambika Ashtakam in Telugu | శ్రీ భ్రమరాంబిక అష్టకం | Popular Telugu Devi Stotras | Spiritual

from Vagartha · host Vagartha

Sri Bhramarambika Ashtakam in Telugu | శ్రీ భ్రమరాంబిక అష్టకం | Popular Telugu Devi Stotras | Spiritual Sri Bhramarambika Ashtakam lyrics in Telugu రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా || కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయావా జిలుగు కుంకుమ కాంతిరేకుల శ్రీ గిరి భ్రమరాంబిక || అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ పొంగుచును వరహాల కొంకణ పుణ్యరాభూముల యందునన్ రంగుగా కర్ణాట రాట మరాఠ దేశములందునన్ శృంగినీ దేశముల వెలసిన శ్రీ గిరి భ్రమరాంబిక || అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబిక || ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణీ అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ శీఘ్రమేకని వరములిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా || నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా || సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా || ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున పల్లవించును నీప్రభావము బ్రహ్మలోకము నందున తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబికా || IN ENGLISH Ravi sudhaakara vahni lochana ratna kundala bhooshiNi pravimalambuga mammunelina bhaktha jana chintamaNi avani janulaku kongu bangaaraina daiva shikhaamaNi shivuni pattapuraNi guNamaNi Sri giri Bhramaraambika || kaliyugambuna maanavulakunu kalpataruvai yundagaa velayu srigiri shikharamanduna vibhavamai vilasillava aalasimpaka bhaktha varulaku ashta sampada leeyava jilugu kumkuma kanthi rekula sri giri Bhramaraambika || anga vanga kalinga kaashmirandhra deshamulandunan ponguchunu varahala konkana bhoomula yandunan ranguga karnata magadha maraata deshamulandunan shrunkhalaa deshamuna velasina sri giri Bhramaraambika || akshayambuga kaashi lopala annapoorna bhavaanivai sakshi ganapathi kanna tallivi sadguNaavathi shaambhavi moksamosagedu kanakadurgavu moolakaaraNa shakthivi shiksha jetuvu ghora bhavamula sri giri Bhramaraambika || ugralochana vara vadhoomaNi toppugalgina bhaamini vigrahambula kella ghanamai velayu shobhanaa kaariNi agrapeetamunandu velasina aagamaartha vichaariNi Sheegramanekani varamu lithuvu sri giri Bhramaraambika || Nigama gochara neela kundali nirmalangi niranjani migula chakkani pushpa komali meena netra dayaanidhi jagathilona prasidhi kekkina chandramukhi seemanthini chigurutaakula vanti pedavula sri giri Bhramaraambika || Somashekhara palla vaaridhi sundarimaNi dheemaNi komalangi krupaa payonidhi kutila kuntala yogini naa manambuna paayakundama nagakuleshuni nandini seemalona prasiddi kekkina sri giri Bhramaraambika || Bhootha naathuni vaama bhaagamu ponduga chekontivi khyathiganu sri sailamuna vikhyathiga nelakontivi paatakambula paaradroluchu bhakthulanu chekontivaa shwethagiripai nundi velasina sri giri Bhramaraambika || ella velasina needu bhaavamu vishnu lokamu nanduna pallavunchunu nee prabhaavamu brahma lokamu nanduna tellamuga kailaasa mandunamoodu lokamu landuna chellunamma triloka vaasini sri giri Bhramaraambika || Taruni Sri giri mallikaarjuna daiva raayala bhaamini karuNatho mammelu yeppudu kalpa vrukshamu bhamgini varusatho nee yashtakambunu vrasi chadivina vaariki sirulaniccheda vella kaalamu sri giri Bhramaraambika||

Episode metadata supplied by the publisher feed · Published Oct 5, 2023

Embed this episode

Ready to play

Sri Bhramarambika Ashtakam in Telugu | శ్రీ భ్రమరాంబిక అష్టకం | Popular Telugu Devi Stotras | Spiritual

0:00 4:25

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Vagartha?

This episode is 4 minutes long.

When was this Vagartha episode published?

This episode was published on October 5, 2023.

Can I download this Vagartha episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!