'షరా' - గోపీచంద్ గారి రచన episode artwork

EPISODE · Aug 14, 2021 · 11 MIN

'షరా' - గోపీచంద్ గారి రచన

from Harshaneeyam

‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsbఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్వరితోనూ పరిచయం లేదు. నేను ఎన్నడూ ఆ లంకలో అడుగుపెట్టి కూడా ఎరగను.మా ఊరు బెజవాడ దగ్గరదే అయినా నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచీ మద్రాసులోనే వుంటున్నాను. ఈ ప్రాంతాలకు రాలేదు. ఇటీవల వొచ్చిన గాలివానకు పంటలన్నీ పాడైనయ్యని తెలుసుకొని పొలాలు చూచుకు వెళ్ళదామని వొచ్చాను. గాలివానవల్ల నిజంగా అపారమైన నష్టం కలిగింది. నేను ఎరిగినతర్వాత ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. కవులు వాళ్ళు తమ గింజలుకూడా రావని గోలపెడుతున్నారు. నేను ఏమి చెయ్యగలను! మళ్ళీ మద్రాసు వెళ్తామని బయలుదేరి, ఎలాగూ వచ్చాంగదా అని బెజవాడలో వున్న నా మిత్రుణ్ణి వొకణ్ణి చూచిపోదామని బెజవాడలో దిగాను. అతను గాలివానకు నష్టపడిన వారికి సహాయంచేసే ప్రయత్నంలో వుండి “రేపు వెళ్ళొచ్చులే” అంటే-ఆనాటికి ఆగిపోయాను.ఆ సాయంత్రం బెజవాడ లంకలో నష్టపడ్డ బీద జనానికి వాసాలూ, తాటాకులూ పంచిపెడుతూ నన్ను కూడా రమ్మంటే నేనూ వెళ్ళాను. శరణార్థుల్లో కనుపించాడు ఆ మనిషి. ఆ మనిషి నన్ను చూచి కొంచెం బెరుకుపడ్డట్టు కూడా అనిపించింది నాకు. నిజంగా ఆ మనిషిని నేను ఎక్కడో చూశాను. అందులో సందేహం లేదు. కాని ఏ సందర్భంలో చూశానో ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రాలేదు.మేము పని పూర్తి చేసుకొని యింటికి వస్తుంటే ఒక రైతు మా వెంట వొచ్చాడు. అతనివల్ల ఆ మనిషి కోటిరెడ్డి మామ అని తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కోటిరెడ్డిని నేను ఎరుగుదును. అతనూ మద్రాసులోనే ఉంటున్నాడు. అతని మామను కూడా నేను ఎరుగుదును. ఒకసారి అతని అత్తవారి ఇంటి దగ్గర ఉండగా అతన్ని చూద్దామని వెళ్ళాను. అప్పుడే ఈయన్ని చూశాను. కాని గుర్తుపట్టకపోవటం నాతప్పు కాదు. మనిషి చాలా మారిపోయాడు.నేను ఏట్లాగూ మద్రాసు వెళుతున్నాను గనక అల్లుడికేమైనా కబురు చెబు, మర్నాడు ప్రొద్దున్నే లేచి కోటిరెడ్డి మామను చూద్దామని లంకకి ప్రయాణ ఆ లంకలో వుంటున్నదంతా అలగా జనం. నాకు తెలిసినంతవరకు కోటిరెడ్డి వున్నవాడే. కాని ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. స్వగ్రామంలో ను వాకిలి వొదులుకొని ఇక్కడ ఎందుకు కాపరం పెట్టాడో కూడా నాకు తెలియదు. కోటి కూడా ఈ విషయం నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు. అక్కడ వున్నవన్నీ చిన్న చిన్న హరి గుడి సెలే. ఆ గుడిసెల్లో వొక గుడిసెలో కాపరం వుంటున్నాడు కోటిరెడ్డి మామ. నేను వెళ్ళేటప్పటికి ఆస్థలంలోనే వున్న మరికొన్ని గుడిసెల్ని బాగుచేయిస్తున్నాడు. నన్ను చూచి కొంచెం తబ్బిబ్బుపడ్డాడు. ఇంటిలోకి వెళ్ళి నేను కూర్చోగలందులకు ఒక కుక్కిమంచం తెచ్చాడు. అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత హీనస్థితికి ఎందుకు వొచ్చాడా అని ఆలోచించ బుద్ధి ఐంది. మాటల్లోకి దింపాను. అతను ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబులు చెప్పాడు. తన అల్లుడి సంగతి అడిగాడు. బాగానే వున్నాడని చెప్పాను. నేను అదీ, ఇదీ అడిగాగాని సరైన జవాబులు చెప్పలేదు. చివరికి; “నేను మద్రాసు వెళ్తున్నాను మీ అల్లుడికి ఏమైనా కబుర్లు చెపుతారా?” అని అడిగాను.“ఇట్లా వుంటున్నామని చెప్పండి” అన్నాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని మిత్రుని ఇంటికి బయలుదేరాను. దారిలో ముందురోజు కలిసిన రైతు కలిశాడు. అతన్ని అడిగాను. కోటిరెడ్డి మామనుగురించి.“ఆయన ఆస్తి ఎందుకు పోయింది?” అని అడిగాను. “ఆస్తి పోవటం ఏమిటండోయ్!” అన్నాడు ఆ రైతు. “ఆస్తిపోకపోతే ఈ గుడిసెలో వుండవలసిన అవుసరం ఏమొచ్చిందీ?” అన్నాను.“అదా అండి… అట్లా అడగండి” అన్నాడు రైతు. అని ఈ విధంగా చెప్పాడు; “ఏమండోయ్ నాదీ ఆయనది వొక ఊరే… తెలుసా అండి… నాకాయన సంగతి బాగా తెలుసు… ఆస్తిపోయి రాలేదు….”“మరెందు కొచ్చాడు?”“సంపాదించటానికి వొచ్చాడు. అక్కడ ఇల్లూ, పొలం అమ్ముకొని వడ్డీకిచ్చి ఈ లంకలో స్థలాలు చౌగ్గా వున్నాయనీ, తొందరలో ధరలు పెరుగుతాయని తెలుసుకొని, ఇక్కడ స్థలం కొన్నాడు… రేపీ స్థలం అమ్ముతాడు… ఇంకొకచోట కొంటాడు… ఆయన కేమండీ… చూశారూ… ఈ స్థలం కొన్నాడా… కొని ఊరికేవుంటి యేమొస్తుందని నాలుగు గుడిసెలు వేయించి అద్దెకిస్తున్నాడు… కాని గాలివాన వొచ్చింరోజే గమ్మత్తంటే గమ్మత్తు…” అని నవ్వటం మొదలు పెట్టాడు.కారణం తెలియకపోయినా, అతను నవ్వుతుంటే నాకూ నవ్వు వొచ్చింది. “ఏం జరిగిందేమిటి?” అని అడిగాను.“అంతకు ముందు మూడు రోజులనుంచీ గాలివాన కొడుతూ వుంది. ఆ రోజు ఎక్కువైంది. లంకలో వుంటానికి వీల్లేక అంతా ఊళ్ళోకి వెళ్ళారు తలదాచుకోటానికి. ఈయన్ని రమ్మంటే రాడే “ఈ ఇళ్ళు నన్ను కాపాడినై… కష్టకాలంలో వాటిని విడిచిపెట్టి రాను” అంటూ కూర్చున్నాడు… ఆయన భార్య కూడా ఆయనకు తగ్గదే దొరికింది. “వొచ్చిన గాలి వాన పోక వుంటుందా… వెళ్ళటం రావటం… ఇదంతా ఎందుకు?” అంటూ కూర్చుంది. …. వొచ్చిన గాలివాన ఎట్టాగూ పోతుందట!” మళ్ళీ నవ్వటం మొదలు పెట్టాడు.“చివరికి ఏమైంది?” అని అడిగాను.“ఏమవుతుంది? వాళ్ళు రానంటే మాత్రం మేము ఊరుకుంటామా? వాళ్ళ సంగతి దేవుడెరుగు వాళ్ళకొక చంటి బిడ్డ వుంది. ఆ చంటి బిడ్డ జోరున తడుస్తుంటే ఎట్లా చూస్తూ వూరుకోవటం… బలవంతంగా తీసుకువెళ్ళాం… అదుగో చూడండి ఆ కట్టెల అడితీ… అది దాటి రానంటాడే… తన ఇళ్ళకు వీలైనంత దగ్గర్లో వుండాలని ఆశ! ఆ రాత్రి ఆ కట్టెల అడితీలో పెట్టాం… మమ్మల్ని నానా మాటలూ అంటూ కూర్చున్నాడు… ఆయన అల్లుడి తరపు బంధువులు వూళ్లో వున్నారు. వాళ్ళు వొచ్చి తమ యింటికి రమ్మని పిలిచారు. ఉహు, ఎంత చెప్పినా వినడు… పైగా “మీరు ఆనాడు అట్లా చేశారు. ఈనాడు యిట్ల చేశారు. నా సంగతి మీకు పట్టిందా, ఈ కష్టంలో నన్ను చూసి నవ్వాలని వచ్చారు” అని మండిపడి పంపించాడు. ఎట్లాగో తెల్లవారేదాకా ప్రాణాలు బిగబట్టుకు కూర్చుని తెల్లవారి మళ్ళీ భార్యా సమేతంగా లంక ప్రవేశించాడు. అప్పటికి గాలివాన కొంచం తగ్గిందిగానీ యింకా యెవ్వరూ బయటకు రావటం లేదు. పాపం పడిపోయిన ఇళ్ళని చూడలేకపోయాడు. వాటిని మళ్ళీ మామూలు ఆకారంలో చూస్తేగాని వుండలేక పోయాడు. భార్యనీ, చంటి పిల్లనీ పడని మొండి గోడలకు నాలుగు ఆకులు కప్పి, దాని క్రింద పెట్టి ఇళ్ళు నిలబెట్టటానికి పూనుకున్నాడు…” ఈ విధంగా ఆ రైతు చెప్పి చెప్పి, “పాపం అతనికి ఇప్పుడు ఒక్కటే దిగులు” అని పెదవి విరిచాడు.“ఏమిటది?” అని అడిగాడు.“ఏముంది, పాపం! మొదట్లో తాను వుంటానికి వొక గుడిసె వేయించాడు. అద్దెలవాళ్ల పోరుపడలేక ఆ గుడిసెలో సగం అయిదు రూపాయలకు అద్దెకిచ్చి మిగిలిన సగంలో తాను వుండేవాడు. అప్పటికీ అద్దెలవాళ్ళ పోరు తగ్గలేదు. అందుకని ఆ సగంకూడా అద్దెకిచ్చి పంచలో వుండేవాడు. ఆ పంచకూడా అద్దెకివ్వాల్సి వొచ్చింది. అందుకని మరొక గుడిసె వేయాల్సి వొచ్చింది. కాని ఆ గుడిసె పనీ ఇంతే అయింది. ఎన్ని గుడిసెలు వేయించినా తాను కొంత స్థలం ఆక్రమించుకోవాల్సి రావటం, అంతమేరా అద్దె డబ్బులు దండగలు జరుగుతూ వుంది… ఈ సమస్య ఎట్లా తీరుతుందా అని అతను రాత్రింబగళ్ళూ దిగులు పడుతూ వుంటాడు” అని చెప్పి పెద్ద పెట్టున నవ్వాడు.నాకూ నవ్వు వొచ్చింది. ఆ రైతు చెపుతున్న పద్ధతి నాకు నవ్వు తెప్పించింది. కాని లోపల కోటిరెడ్డి మామ ఎందుకు మారాడా అని ఆందోళన కలగకపోలేదు. మొదట్లో నేను చూచినప్పుడు అతను చాలా మర్యాదస్తుడుగా కనిపించాడు. వూళ్ళో గౌరవంగా వుండేవాడు. తాను తినేవాడు, ఇతరులకు పెట్టేవాడు. మర్యాదకు ప్రాకులాడే మనిషనే అనుకున్నాను నేను. ఇంతగా ఎందుకు మారాడో!ఆ రాత్రి మెయిల్లోనే నేను మద్రాసు జేరుకున్నాను. నా సొంత పనులు చూచుకుంటూ నాలుగు రోజులు కోటిరెడ్డిని కలవలేకపోయాను. అయిదో రోజు సాయంకాలం అతని ఇంటికి వెళ్ళాను. అతను ఇంట్లోనే వున్నాడు. ఏదో రాసుకుంటూ వున్నాడు. కాసేపు అదీ ఇదీ మాట్లాడి అతని మామను చూశాననీ, గాలి వానకు చాలా నష్టపడ్డాడనీ, ప్రస్తుతం బాగానే వున్నాడనీ మాత్రం చెప్పాను. అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా డ్రాయరు తీసి చదవమని వొక కార్డు ఇచ్చాడు. అది అతని మామ కూతురికి వ్రాసిన ఉత్తరం. అందులో ఇల్లా వుంది.“బిడ్డా ! నీవు వ్రాసిన వుత్తరం అందినది. గాలివానవల్ల నష్టపడ్డా, భగవంతుని కృపవల్ల అట్టే నష్టం లేకుండానే తేరుకున్నాము. గాలివాన తగ్గిన మార్నాడే, ఎవ్వరూ ధైర్యం చెయ్యకపోయినా, మీ అమ్మా నేనూ లంక ప్రవేశించి ఇళ్ళు నిలబెట్టాము. మళ్ళీ వొక్కరొక్కరే అద్దెలవాళ్ళు ఇప్పుడిప్పుడే వొస్తున్నారు. ఇళ్ళు మళ్ళీ వేయించినందుకుగాను నెలకి యిది వరక్కంటే వొక రూపాయి ఎక్కువ ఇవ్వాలని మీ అమ్మ అడుగుతూ వుంది. నువ్వు మాత్రం డబ్బు దగ్గర జాగ్రత్తగా వుండు. మీ ఆయన పుస్తకాలకని, వాటికనీ అనవసరంగా డబ్బు తగలవేస్తూ వుంటాడు. నువ్వు గట్టి పట్టుపట్టి డబ్బు ఖర్చు కాకుండా చూడు. ఆయనకు లేకపోయినా, నువ్వయినా నీ పిల్లల సంగతి చూచుకోవాలిగదా?” ఈ విధంగా వ్రాసి షరాలో “చంటి బిడ్డ” జలుబు చేసి మరణించిందని తెలియజేశాడు. నేను ఉత్తరం చదివి కోటిరెడ్డి వంకకు చూశాను. “చూశావా, చంటిబిడ్డ మరణించటం ఆయన కంత స్వల్ప విషయంగా కనిపిస్తూ వుంది. ఆ గాలివానలో ఇటూ అటూ తిప్పి ఉంటారు, డాక్టరుకి కూడా చూపి ఉండరు. తమ ఇళ్ళేమో, వడ్డీ డబ్బులేమో, అద్దెలేమో తప్ప మరింకొకటి వాళ్ళకు పట్టదాయె. పైగా చెప్పినవాళ్ళు పిచ్చివాళ్ళకింద లెక్క. మొదటినుంచీ ఇలా ఉండేవాడు కాదు. కాని పొలం అమ్మి వడ్డీకిచ్చాడు. అప్పటినుంచీ ఇట్లా తయారయ్యాడు. క్రమ క్రమేణా మరీ అన్యాయం అయిపోతున్నాడు” అన్నాడు కోటిరెడ్డి.కథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Aug 14, 2021

Embed this episode

NOW PLAYING

'షరా' - గోపీచంద్ గారి రచన

0:00 11:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 11 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on August 14, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!