EPISODE · Aug 30, 2023 · 17 MIN
స్టేటస్ కో | Status Quo | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్టేటస్ కో రచన : మల్లవరపు సీతారాం కుమార్ "నాన్నా! మనకు నెల్లూరుకు పక్కన అల్లీపురం గ్రామంలో తాతగారు రాసిచ్చిన ఇల్లు ఉందన్నావు కదా!" అడిగాడు మా పెద్దబ్బాయి సుధీర్. అతను హైదరాబాద్ లో మా దగ్గరే ఉంటూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. "అవును సుధీర్! అయన వీలునామాలో నాకు రాసిచ్చాడు. ఆ ఊరికి అయన అంత్యక్రియలు, కర్మకాండలకు వెళ్లడమే.. అప్పుడు తాళం వేసుకుని వచ్చేశాను. పదేళ్లయింది. మళ్ళీ అటువైపు వెళ్ళడానికి కుదర్లేదు. ఆ తరువాత ఆ ఇంటి గురించి పట్టించుకోలేదు" అన్నాను నేను. "ఒకసారి వెళ్దాం నాన్నా. ఆ ఇల్లు ఎలా ఉందో.. చూడాలనుంది" అన్నాడు రెండో అబ్బాయి కళ్యాణ్. వాడు బి టెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గతుక్కుమన్నాను. కొంపదీసి వీళ్లకు ఆ ఇంటి విషయంగా గొడవలు జరిగినట్లు తెలిసిందా..? అనుమానంగా నా శ్రీమతి వైపు చూశాను. తను వారికేమీ చెప్పలేదన్నట్లు సైగ చేసిందామె. 'హమ్మయ్య! వాళ్ళు యధాలాపంగా అడిగారన్న మాట. ఏదో చెప్పి దాటవేయ్యాలి' అనుకున్నాను. "మీకేనా.. నాక్కూడా ఎన్ని రోజుల్నించో అక్కడికి వెళ్లి, అవసరమైన మరమ్మత్తులు చేయించాలని ఉంది. ఆ ఇల్లు మా నాన్నగారి జ్ఞాపకం కదా! ఈ రెండు నెలలూ బిజీ గా ఉంటాను. తరువాత అందరం కలిసి వెడదాం " అన్నాను వెంటనే. నా వంక ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీమతి. బహుశా నేను అబద్ధమాడుతూ ఉండగా ఆమె చూడడం అదే మొదటిసారేమో… Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/m6nOYG3NKP8
Embed this episode
NOW PLAYING
స్టేటస్ కో | Status Quo | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.