సత్యం - చంద్ర  కన్నెగంటి గారి రచన episode artwork

EPISODE · Oct 31, 2020 · 15 MIN

సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన

from Harshaneeyam

హర్షణీయానికి స్వాగతం.ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది.గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు.తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , బాధ్యతలు నిర్వహించారు.గత మూడు దశాబ్దాలుగా వారి రాసిన కథలు, ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి."రచయితగా నేనేమీ పాఠకుడికంటే నైతికంగానూ , బౌద్ధికంగానూ ఉన్నతస్థాయిలో లేను " అని నమ్రత తో చెప్పే చంద్ర గారు, ఉత్తమమైన కథా వస్తువులను ఎంచుకుంటూ , పాఠకులను ఆలోంచింపజేసే చాలా మంచి రచనలను చేస్తూ వస్తున్నారు.కథను హర్షణీయం ద్వారా అందించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీ చంద్ర గారికి కృతజ్ఞతలు.సత్యం:ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్య మయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్ లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు. దానికితోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్ గొడవ.ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసు కుని ఉన్నట్లు తెలిసిపోయింది. రణగొణ ధ్వనులు చేసే టీవీ కట్టేసి ఉంది. పుస్తకం ముందేసుకుని కళ్ళు తుడుచుకుంటూ కూచుని ఉన్నాడు బాబు. పాప బిక్కచిక్కిన మొహంతో వాడివే పే చూస్తూ ఉంది ఆడటం మానేసి.“ఏమిటీ ఏమయింది?” ఆమెని అడిగాడు దగ్గరకొచ్చి కాళ్ళకు చుట్టుకున్న పాపను ఎత్తుకుని ముద్దాడుతూనే.“పోయినవారం వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావలసింది, ఇంకా రాలేదు. ఏదిరా అంటే వాడి టీచర్ ఇవ్వలేదంటాడు.”“ఇవ్వలేదేమోలే! అప్పుడప్పుడూ ఆలస్యమవుతుంది కదా!”“ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టనిపిస్తుంది!”“మర్చిపోయాడేమో వాడి బ్యాగ్ లో వెతక్కపోయావా?” “వెతికాను. లేదు!”“నేనేమీ అబద్ధం చెప్పటం లేదు.” వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు.“నువ్వు ఏడవటం ఆపు ముందు. పోనీ సోమవారం వాడి టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా!”“వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు. మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా? అయినా సోమవారం దాకా ఎందుకు. ఇప్పుడే వాడి నోటితోటే నిజం చెప్పించాలి.”“వాడు అట్లా అబద్దమెందుకాడుతాడు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చని పిస్తూంది నాకయితే!” ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినపడకుండా.“ఏమో ఏం తెలుసు? మనం నమ్మేం కనక అన్నీ నిజాలే. అయినా వాడి సంగతి నాకు తెలుసు. మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి, లేకపోతే నాకు వదిలేయండి.”ఎర్రటి కళ్ళూ, పసిబుగ్గల మీద కన్నీటి చారికలూ, మధ్య మధ్య చొక్కా చేతు లతో తుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబద్దమాడుతున్నట్టు అనిపించడం లేదు. అట్లాగని అమెకి నచ్చచెప్పనూ లేడు.పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఓ వొప్పందం. వాడు రక్షించమన్నట్టు తనవేపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. అయినా తల్లినుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్దిచెప్పుకుంటూ పాపను తీసుకుని బెడ్ రూమ్ లోకి నడిచాడు.మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు గొడవ వేరేగా ఉండేది. వాడి ఖర్మ కాలి అన్నిట్లోకీ వాడికి సైన్స్ లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడూ. ఇక వాడిని కూచోబెట్టి ముందు కోపంగానూ, చివరికి అనునయంగానూ వాడికి నూరిపోసేది సైన్సులో తొంభయి అయిదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో. తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్.రాత్రిళ్ళు వాడి దగ్గరే కూచుని కదలకుండా, కదలనీయకుండా చదివించేది.చాలాసార్లు చెప్పాడామెకి. వాడినట్లా భయ పెట్టటం వల్లా, దండించటం వల్లా ఉపయోగమేమీ ఉండదనీ. వాడికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడికే పాఠం అర్థంకాలేదో, ఏ జవాబులు రాయటంలో తప్పులు చేశాడో కనుక్కుని వాడికి సాయం చేయాలనీ.పాపను కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూచోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పేమీ లేదు. వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడుచు కుంటూ ఉన్నాడు. ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది.“ముందా ఏడుపు ఆపి హోమ్ వర్క్ చేయి!" వాడిని కసిరాడు. వాడు బదులేమీ చెప్పలేదు.“ఇంతకీ వాడు తిన్నాడా?” ఆమెతో పాటు తింటూ అడిగాడు. “తిన్నాడు,” పొడిగా చెప్పింది, అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు. అతనూ మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు. ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరకొచ్చి కూచున్నాడు.“ఏరా నీకు నాన్నా పులి కథ చెప్పాను గుర్తుందా?" వాడు తల నిలువుగా వూగించాడు ఎత్తి చూడకుండానే.“నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావనుకో ఇక నీ మాట ఎవరూ నమ్మరు ఆ కథలోలాగా!”“నేను నిజమే చెబుతున్నా. అయినా మీరు నమ్మటం లేదు నన్ను!” ఏడుపు కాస్త ఎక్కువ చేసి అంటున్నాడు.“ముందు ఆ ఏడుపు ఆపు! నిన్నేమీ తిట్టలేదూ తన్నలేదూ ఇప్పుడు. మమ్మీ ఎటూ మండే మీ టీచర్ తో మాట్లాడుతుంది. నిజం ఎటూ తెలిసిపోతుంది. నువ్విప్పుడు చెప్పేది అబద్ధమని తెలిసిందనుకో, ఇక ఎప్పుడయినా నువ్వు చెప్పేది మేమెట్లా నమ్ముతాము? నువ్వు చెప్పేదేదీ మేం నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నీకు?” వాడు చెబుతున్నది నిజమే అయితే బాగుంటుందనిపిస్తుందతనికి. ఇద్దరి మధ్య సంబంధంలో నమ్మకం పోవటంకంటే దారుణమయినదేముంటుంది?“నేను అబద్ధమేమీ ఆడటం లేదు!”అతనికి ఒక పక్క జాలేస్తూంది. తమ పదేళ్ళ కొడుకు ఇంత పట్టుతో అబద్ధం చెప్పగలడా? ఒక మూల సందేహం. అనవసరంగా వేధిస్తున్నారా తామిద్దరూ వాణ్ణి ? వాడు నిజమే చెపుతున్న పక్షంలో వాడు క్షమిస్తాడా ఇక తమని?ఆమె వచ్చి అందుకుంది. “అది ఇంకో అబద్దం. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడుతూనే ఉండాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తేకపోవటం ఒక తప్పు. ఇవ్వలేదని అబద్దం రెండో తప్పు. అబద్దమాడలేదని చెప్పటం మూడో తప్పు. నీకు ఒక తప్పుకయితే ఒక పనిష్మెంటే కదా? ఇన్ని తప్పులు చేసి మరికాసిని తన్నులు తినడం హాయిగా ఉంటుందా నీకు?”మరీ పోలీస్ స్టేషన్లో నేరస్థుడిని ఇంటరాగేట్ చేస్తున్నట్టనిపించి పక్కకి వెళ్ళాడు అతను.“సరే, నిన్నేమీ అనను. తిట్లూలేవు, దెబ్బలూలేవు. ఏ పనిష్మెంటూలేదు ఇప్పటి కిప్పుడు నిజం చెప్తా. మళ్ళీ మండే మీ టీచర్ని కనుక్కున్నాక నేనేం చేస్తానో నాకే తెలియదు.” వాడి వంకే చూస్తూ నెమ్మదిగా చెప్పింది.ఏం సమాధానం లేదు. “ఏం చేయనందికదరా ఇప్పటికయినా నిజం చెప్పు!" వెక్కటం ఆగింది. “అది... దార్లో పోయింది...” “పోయిందా... నిజం చెప్పు. ఏం చేయనన్నాగా! నాకు మొత్తం నిజం కావాలి!” “పడేశాను... దార్లో.” “ఎందుకు?” ఏం మాట్లాడలేదు.“ఎందులోనన్నా తక్కువ మార్కులు వచ్చాయా?” “సైన్సులో,” తల దించుకునే చెపుతున్నాడు. “ఎన్ని వచ్చాయి?” “డెభ్బయి రెండు.”బాబు చెంప ఛెళ్ మంది. ఒక క్షణం బిత్తరపోయి ఏడుపు ఆపేశాడు. మరుక్షణం బిగ్గరగా ఏడుపు అందుకున్నాడు. చేయి పట్టి గుంజి వీపు మీద రెండు దెబ్బలు చరిచింది. ఈలోపల అతను తేరుకుని ఆమెని ఆపాడు. వాడి ఏడుపు చూసి పాప కూడా ఏడుపు అందుకుంది.“వెధవ! గాడిద! అంత అబద్ధమాడతావా? ఎక్కడ నేర్చావివన్నీ? అప్పట్నుంచీ అడుగుతుంటే నోటమ్మట నిజం రాదా? ఇంత అబద్దాలకోరువు ఎట్లా అయ్యావురా?” అరుస్తూ ఆవేశంతో రొప్పుతుందామె.అతనికి నమ్మబుద్ది కాలేదు. ఏదో భార్య చెపుతుందని సందేహించాడు తప్ప, ఆమెదే పొరబాటని తెలిస్తే ఆమెను చీవాట్లు పెట్టటానికి సిద్ధమయే ఉన్నాడు. ఎంతో బుద్ధిమంతుడనీ, అమాయకుడనీ తాము అనుకునే కొడుకు ఇంత ఇదిగా అబద్దమెట్ల ఆడగలిగాడు? బాధా, అంతలోనే కోపమూ.“ఛీ! నీకు బుద్ధిలేదురా! అంత ఇదిగా నేనడిగినప్పుడయినా నిజం చెప్పొచ్చు గదా? ఇక నిన్ను జన్మలో నమ్మగలమా?” అంతకంటే ఏం తిట్టాలో కూడా తెలియ లేదతనికి.వాళ్ళమ్మే ఇంకో రెండు తగిలించింది. అతడూ ఈసారి అడ్డు వెళ్ళలేదు. వాడు ఏడుపు ఇంకా పెద్దది చేశాడు. “ముందా ఏడుపు ఆపు! ఆపుతావా... ఆ ఏడుపు ఆపుతావా లేదా?” అంటూ ఇంకొకటి వేసింది. “అసలు సైన్సులో డెభ్బయి రెండు రావడమేమిట్రా?” అని ఇంకొకటి.వాడు ఏడుస్తూనే, “కొట్టనన్నావు.... ఏం చేయనన్నావు....” అంటున్నాడు పెద్దగా. అప్పటికే బుగ్గమీద నాలుగు వేళ్ళు పొంగాయి.“కొట్టక ముద్దు పెట్టుకుంటారేం మరి నువు చేసిన నిర్వాకానికి?”“అబద్ధమాడావు... నువ్వూ అబద్ధమాడావు...” ఏడుపూ మాటలూ కలగలిశాయి.“మామూలుగా అడిగితే చెప్పావా నువ్వు? ఇంకా నోరెత్తావంటే మండిపోతుంది నాకు. పో, నీ గదిలోకి పో!” అరిచిందామె.“నేను పడుకోబెడతాలే,” అంటూ ఏడుస్తున్న పాపని ఆమెకి అందించి వాణ్ణి లాక్కెళ్ళాడు.వాడి పక్కనే పడుకుని వాడు ఏడుపు తగ్గాక మొదలు పెట్టాడు. “అసలు నువ్వేం చేశావో అర్థమయిందా నీకు? అబద్దమెందుకాడావు? అబద్దాలాడకూడదని ఎన్నిసార్లు చెప్పాము? అబద్ధమాడితే కళ్ళు పోతాయని చెప్పలేదూ?”వాడు కొంచెం తేరుకున్నాడు. “అదేం నిజం కాదు. నాకు కళ్ళేం  పోలేదు.”నవ్వొచ్చినా పైకి నవ్వలేదు. “ఇంత తెలివయినవాడివి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటిలా ఇంటికి తీసుకుని వస్తే ఈ రాద్ధాంతమంతా ఉండేది కాదు కదా!”“మార్కులు తక్కువ వచ్చాయని అమ్మ కొడుతుందని భయమేసింది.”“ఇప్పుడు మాత్రమేమయింది? అసలు ఎక్కడ నేర్చావు ఈ అబద్దాలాడటం? స్కూల్లో పాడుపిల్లల స్నేహాలవీ చేస్తున్నావా?”ఏం మాట్లాడలేదు.“అసలు అమ్మానాన్నల దగ్గర అబద్ధం చెప్పొచ్చా? నీ మంచికోరే కదా మేం తిట్టినా కొట్టినా!”“మీరూ నాతో అబద్ధం చెప్పారు కదా?” ““మేమా? ఎప్పుడురా?” “అప్పుడు నా బర్త్ డేకి స్పైడర్ మాన్ గేం కొని పెడతానని ప్రామిస్ చేసి కొనివ్వలేదు.”“అన్ని డబ్బులు పోసి అది కొనటం దండగని చెపితే నువ్వు వినవుగదా మరి?”“అయినా అబద్ధమేగా! మమ్మీ ఏమో నాకు స్కూల్లో గెస్ లో థర్డ్ ప్రయిజు వస్తే ఫస్ట్ వచ్చానని అందరికీ చెప్పింది.”అతనేం మాట్లాడలేకపోయాడు.“మొన్నేమో ఆ అంకుల్ ఫోన్ చేస్తే మీరు ఇంట్లో ఉన్నా లేరని చెప్పమంది మమ్మీ. అదీ అబద్దమేగా!”అదృష్టవశాత్తూ వాళ్ళమ్మ వచ్చింది, “నేను పడుకోబెడతాలే వీణ్ణి,” అంటూ.బాబుని నిద్రపుచ్చి వచ్చి పడుకుంటూ అంది, “వీడిట్లా తయారయాడేమిటి? పెద్ద అబద్దాలకోరవుతాడేమోనని భయంగా ఉంది. మన పెంపకంలో లోపమం టారా?”“అంతప్పుడు నువ్వేమీ అబద్దాలు ఆడలేదా?” “ఆడే ఉంటాను. మా అమ్మ ఏమనేది కాదుగానీ మా నాన్న చావబాదేవాడు.”“నాకయితే గిల్టీగా ఉంది. మనం తప్పు చేస్తూ, వాణ్ణి అదే తప్పు చేయొద్దని ఎట్లా చెప్పగలం, దండించగలం? ఎక్కడో చివుక్కుమంటూ ఉంటుంది మనకు, నైతికంగా ఆ హక్కు ఉందా అని!”“అదేమిటి మనమేమన్నా అబద్ధాలాడుతున్నామా ఏమిటి ఇప్పుడు?”“మనకి మనమాడే అబద్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి. ఎందుకూ, వాణ్ణి ఇందాక కొట్టనని చెప్పి నమ్మించి నిజం చెప్పాక కొట్టావా లేదా?”“అది వాడి మంచికే కదా! వాడి వ్యక్తిత్వానికి సంబంధించి భవిష్యత్తులో వాడికి దీనివల్ల జరిగేది మేలే కదా! మనమాడే అబద్దాలు ఎవరికీ కీడు చేయనంతవరకూ తప్పేముందందులో?”“అబద్ధమన్న తర్వాత ఏదైనా అబద్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”“ప్రాణాపాయ స్థితిలో ఆడే అబద్ధమూ, ఇంకొకరిని మోసంచేసి దోచుకునే అబద్ధమూ ఒకటేనా?”“రెంటికీ మధ్య గీత ఎవరు గీస్తారు. ఇవి మంచి అబద్దాలూ, ఇవి చెడ్డ అబద్ధాలూ అని. నువు రెజ్యూమ్ లో లేని ఎక్స్ పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపా యించావు.దానిమూలాన న్యాయంగా ఇంకెవరికో రావలసిన ఉద్యోగం రాలేదు. ఇప్పుడది మంచి అబద్ధమేనా?”“అంటే మీరు చెప్పేదేమిటి? వాడికి అబద్దాలాడొద్దని చెప్పటం తప్పంటారా? ఇక తల్లిదండ్రులంతా పిల్లలికి మంచిచెడ్డలు నేర్పడం మానేసి వాళ్ళ మానానికి వాళ్ళని వొదిలేయాలా? వెనకటికి ఆ దొంగ ఎవడో తల్లి చెవి కొరికి తోటకూర నాడే తన్నకపోతివి కదమ్మా అన్న కథ గుర్తులేదా?”“వాడెదురుగా మనం అబద్దాలాడుతూ ఉంటాము. వాడికి...

NOW PLAYING

సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన

0:00 15:56

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 15 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on October 31, 2020.

What is this episode about?

హర్షణీయానికి స్వాగతం.ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది.గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి,...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!