సు ధీర ఎపిసోడ్ 11 | Su Dheera Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 5, 2022 · 13 MIN

సు ధీర ఎపిసోడ్ 11 | Su Dheera Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 11 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ఫోన్ చేసి ధీరని రమ్మంటుంది సు. సు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెబుతాడు ధీర. ఇక చదవండి... చెప్పుతున్న ధీరకి టక్కున అడ్డై.. "నీది..  వయస్సుకు మించిన మెచ్యూరిటీ. ఐ లైక్ ఇట్." చెప్పేసింది సు. "అదేమి కాదు.. నీ మీది నా అభిప్రాయం నన్ను స్టేబుల్ పరుస్తుంది." చెప్పాడు ధీర. "టీ టైం.." అంటూ లేచింది సు. ఫ్రిజ్ లోని రెండు నారింజల్ని తీసింది.  వాటి రసాలతో జ్యూస్ చేసి.. రెండు గ్లాసుల్లో సర్దింది. వాటిని ఒక ప్లేట్ లో పెట్టింది. కప్ బోర్డ్ లోంచి బిస్కెట్ల ప్యాకెట్టు తీసి.. నాలుగేసి బిస్కెట్లు చొప్పున ఆ ప్లేట్ లో సర్దింది. ధీర చెంతకి వచ్చింది సు. తన చేతిలోని ప్లేట్ ని టీపాయ్ మీద పెట్టింది. "తీసుకో" అంది సు. తను నాలుగు బిస్కెట్లును తీసుకుంది. ధీర రెండు బిస్కెట్లు తీసుకున్నాడు. "నీది కంప్యూటర్స్ లో డిగ్రీయా." అడిగింది సు. "బిటెక్ లో." చెప్పాడు ధీర. చిన్నగా నవ్వింది సు. "నీ కుటుంబం ఏమిటి." అడిగింది సు. "యాక్చువల్ గా.. నాది రాజమండ్రి. జాబ్ వలన హైదరాబాద్ వచ్చాను. నాతో పాటు అమ్మా నాన్నలని తీసుకొచ్చేశాను. నేను ఒక్కడ్నే వాళ్ల సంతానం." చెప్పుతున్నాడు ధీర. "బిస్కెట్స్ తింటూ మాట్లాడు." నవ్వింది సు. "అమ్మ నాన్నల తరుపు వారంతా రాజమండ్రి చుట్టు పక్కల ఉన్నారు. నాన్న బట్టలు వ్యాపారం చేసేవారు. అతనిది అంతంత బిజినెస్.. నేనే మానిపించేశాను. రెండు అద్దెలు ఎందుకు.. దూరాలు ఎందుకు.. నా వద్ద హాయిగా ఉండ మన్నాను." చెప్పుతున్నాడు ధీర బిస్కెట్లు తింటూ. ఒక జ్యూస్ గ్లాసు తీసుకుంది సు. "రాజమండ్రిలో మాకే ఆస్తులు లేవు. నేను ఇక్కడ.. ఇప్పుడు మేము ఉంటున్న ప్లాట్ ని.. బ్యాంక్ ఇచ్చిన అప్పుతో కొనుక్కున్నాను. ఇంత కంటే నా గురించి మరేమీ లేదు." చెప్పాడు ధీర. ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టింది సు. ధీర జ్యూస్ ఉన్న గ్లాస్ ని తీసుకున్నాడు. అతడు జ్యూస్ తాగే వరకు ఆగింది సు. ధీర ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టేక.. "నేను.. నీ వాళ్లకి తెలుసా.. ఐ మీన్.. నా ప్రొగ్రామ్స్.. నీ పేరెంట్స్ చూస్తుంటారా." అడిగింది సు. "వాళ్ల కాలక్షేపమే టివి.. నీవీ చూస్తుంటారు." చెప్పాడు ధీర. ఆగి.. చిన్నగా నవ్వుతూ.. "నా గురించి ఏమనుకుంటారు." అడిగింది సు. "అంత పర్టిక్యూలర్ గా.. నీ గురించి.. వాళ్ల నుండి.. నేనేమీ ఆలకించ లేదు.. బట్.. నీ ప్రొగ్రామ్స్ ఐతే చూస్తుంటారు." చెప్పాడు ధీర. ఆ వెంటనే.. "ఈ మధ్య నీ కొత్త సీరియల్ చూస్తున్నారు.. వాళ్లు చూస్తుండడం నేను చూశాను." చెప్పాడు ధీర. నవ్వేసింది సు. తర్వాత.. "మరి.. నేను.. నీకు తెలుసు అని.. వాళ్లకి తెలుసా." అడిగేసింది సు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7Nq8VI7n2bY

Episode metadata supplied by the publisher feed · Published Sep 5, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 11 | Su Dheera Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 13:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 5, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!