సు ధీర ఎపిసోడ్ 4 | Su Dheera Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 15, 2022 · 13 MIN

సు ధీర ఎపిసోడ్ 4 | Su Dheera Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

సు..ధీర ఎపిసోడ్ 4 రచన :  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… కొత్త సీరియల్ లో నటించడం కోసం ఒప్పుకోమని చెబుతాడు ఏజెంట్ సుదర్శనం. వాళ్ళు భారీ మొత్తం ఇస్తారని కూడా చెబుతాడు. తన అంగీకారం తెలుపుతుంది సు. ధీరకు కాల్ చేసి కాస్సేపు మాట్లాడుతుంది. ఇక చదవండి... సు సూచన మేరకు.. సుదర్శనం వచ్చాడు.. ప్రొడ్యూసర్.. డైరక్టర్ లని వెనుకేసుకొని. సు తన కారు దిగింది. అప్పటికి లంచ్ బ్రేక్ నడుస్తుంది. పరిచయాల పిమ్మట.. డైరక్టర్ టూకీగా ఫ్రేం స్టోరీని చెప్పాడు. "అమ్మాయ్.. మొదట నూరు ఎపిసోడ్ లని అనుకున్నా.. నువ్వు ఒప్పుకొనే సరికి.. డైరక్టర్ మరో వంద పెంచుదాం అంటున్నాడు. నేను అలాగే అనేశాను. థాంక్స్ అమ్మాయ్." చెప్పాడు ప్రొడ్యూసర్. "పైకం విషయం.. నేను నీకు చెప్పింది హండ్రడ్ ఎపిసోడ్ లకే. అవి పెరిగితే నీదీ పెరుగుతోంది." సు తో.. అప్పుడే అన్నాడు సుదర్శనం. "అంతేగా.. తప్పక అదే జరగాలి." అంది సు నవ్వుతూనే. "అయ్యో.. అమ్మాయ్.. కాదా మరి. తప్పక అలానే పేపర్స్ రాయిస్తాను." చెప్పాడు ప్రొడ్యూసర్. "డైలీ సీరియల్ మేడమ్. వచ్చే ఆరు నుండి షూటింగ్ మొదలవుతుంది. బిల్డింగ్స్.. లొకేషన్స్ ఎంపిక ఐపోయాయి. మీ వీలు చెప్పితే రైటర్ ని పంపుతాం. మీకు అతడు పూర్తి స్టోరీ చెప్పుతాడు." చెప్పాడు డైరక్టర్. 'అలాగే' అన్నట్టు తలాడించింది సు. "కథ బాగుంది మేడమ్. మంచి కథ.. పైగా మీరు హిరోయిన్. అలాగే మంచి నోటెడ్ ఛానల్.. అదిరిపోతుంది. నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను." డైరక్టర్  తెగ ఇదైపోతున్నాడు. అంతలోనే.. సు కి షూటింగ్ స్పాట్ నుండి కాల్ వచ్చింది. "నేను షూటింగ్ కి వెళ్లాలి" చెప్పింది సు. "సరే అమ్మాయ్.. ఇది అడ్వాన్స్.." అన్నాడు ప్రొడ్యూసర్.. చెక్ ని ఇస్తూ. "లేదు లేదు. నేను కమిట్ అయ్యాను. అగ్రిమెంట్ టైంలో అన్నీ కానీయండి. నేను చెప్తాను.. ఒకటి రెండు రోజుల్లో రైటర్ ని పంపేలా చూడండి." చెప్పింది సు. "అది కాదు అమ్మాయ్.." అంటున్నాడు ప్రొడ్యూసర్. "కథ విననీయండి." అంది సు. "కథ మాకు నచ్చింది అమ్మాయ్. నీ పోర్షన్ బాగుంటుంది. ఐనా కథ నచ్చకపోతే వాపస్ తీసుకుంటాను. ముందు అడ్వాన్స్ పుచ్చుకో. మాకు ధీమా వస్తుంది." చెప్పాడు ప్రొడ్యూసర్ ఆత్రంగా. సు తల తిప్పి సుదర్శనంని చూస్తుంది. "లేదు. ఈవిడ మాటంటే మాట. ఈవిడే మీ హిరోయిన్." గబుక్కున కలగచేసుకున్నాడు సుదర్శనం. "మీ సీరియల్ హిరోయిన్ ని" టక్కున అంది సు. "అవునవును.. అంతే అంతే." తడబడ్డాడు సుదర్శనం... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/yWneSoPt5As

Episode metadata supplied by the publisher feed · Published Jul 15, 2022

Embed this episode

NOW PLAYING

సు ధీర ఎపిసోడ్ 4 | Su Dheera Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 13:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!