EPISODE · Jun 10, 2023 · 6 MIN
సుధ - ఎపిసోడ్ 2 | Sudha - Episode 2 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'సుధ - ఎపిసోడ్ 2' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 2' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) విజయ్ క్లాసులో క్రొత్తగా చేరిన ఆరోజు తనకింకా గుర్తుంది. డయాస్ మీదకొచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ చదువంటే తనకు ప్రాణమని చెప్పిన తీరు తనకు నచ్చింది. చూడ చక్కని రూపంతో ఉన్న అతన్ని అప్పుడే నిశితంగా గమనించింది సుధ. తర్వాత క్లాసులో అన్ని సబ్జెక్టులను శ్రధ్ధగా వినడం, తనతో పోటీగా అన్నట్లుగా మంచి మార్కులను తెచ్చుకోవడం చూసి అతనంటే సదభిప్రాయం ఏర్పడింది. కాలేజీలో జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన బోయేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని లెక్చరర్ చెప్పడంతో కొందరు విద్యార్థులు లేచి వివిధ పోటీలలోకి తమ పేర్లను ఆయనకు ఇస్తున్నారు. తను లేచి వక్తృత్వ పోటీలోకి పేరుని ఇచ్చింది. తర్వాత విజయ్ కూడా లేచి తన పేరు ఇచ్చాడు. కొన్నిరోజులకు కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వక్తృత్వ పోటీలలో తను, విజయ్ చక్కగా చెప్పి అందరినీ ఆకర్షించారు. తనకి ప్రధమ, విజయ్ కి ద్వితీయ బహుమతులు లభించగా వాటిని అందుకుంటున్నప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. స్టేజి దిగాక తనను సమీపించి అభినందనలు చెప్పిన అతని సంస్కారానికి ముచ్చటేసింది. తను కూడా అతనిని అభినందించింది. ఇద్దరూ చదువులో ఒకరినొకరు సందేహాలు తెలుసుకోవడంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని నెలల తర్వాత విజయ్ తన గురించి సుధకు వివరించాడు. బాంకులో ఉద్యోగం చేసే విజయ్ తండ్రి రాఘవరావు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన విజయ్ ని కష్టపడి పెంచుతూ కొడుకు భవిష్యత్ కోసం బంధువుల వత్తిడి మీద విజయ్ కి ఐదేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోక తప్పలేదు. 'సవతి తల్లి వస్తే తన బిడ్డని సరిగా పెంచదేమో' అనే అనుమానం మనసులో ఉన్నా దూరపు బంధువులు చూసిన 'రేవతి' అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు రాఘవరావు. రేవతికి అది మొదటి పెళ్లి. ఆమెది బీద కుటుంబం. తండ్రి లేడు. తల్లి సుశీలమ్మే రేవతిని పెంచి పెద్దచేసింది. ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రేవతి పెద్దగా చదువుకోలేదు రెండవ పెళ్లి, కొడుకు ఉన్నా కూడా బాంకు ఉద్యోగి, ఆర్ధిక ఇబ్బందులు లేవని రాఘవరావుని చేసుకుంది. స్వతహాగా రేవతి మంచిదవటంతో కాపురానికి వచ్చినప్పటినుండి భర్తనీ, విజయ్ నీ చక్కగా చూసుకోవడంతో రాఘవరావు మనసు కాస్త స్ధిమితపడింది. విజయ్ కూడా చక్కగా పెరుగుతూ స్కూలులో చక్కగా చదువుతున్నాడు. కాలం సాఫీగా సాగుతోంది. రెండు సం..తర్వాత రేవతి గర్భం దాల్చింది. విజయ్ కి ఒక తోడు దొరకబోతోందని రాఘవరావు చాలా సంతోషించాడు. సుశీలమ్మ కూతురి పురిటికి వచ్చింది. రేవతి కి సుఖప్రసవం జరిగి చక్కటి ఆడపిల్లని కన్నది. ఆపాపకి 'దీప' అని పేరుపెట్టుకుని చక్కగా పెంచుకుంటున్నారు. విజయ్ తనకి చెల్లెలు వచ్చిందని చాలా సంబరపడ్డాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kLiCWK_-5VE
Embed this episode
NOW PLAYING
సుధ - ఎపిసోడ్ 2 | Sudha - Episode 2 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.