సుధ - ఎపిసోడ్ 3 | Sudha - Episode 3 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 15, 2023 · 5 MIN

సుధ - ఎపిసోడ్ 3 | Sudha - Episode 3 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sudha Episode 3' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 3' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుధ కాలేజి నుంచి వస్తుంటే విజయ్ కలిశాడు. ఇద్దరూ నడుస్తూ కాసేపు రాబోయే పరీక్షలు, వాటికి ఎలా సన్నధ్ధం కావాలో మాట్లాడుకున్నారు. ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. విజయ్ ఇంటికి వెళ్లేటప్పటికి రాఘవరావుగారు వరండాలో హడావిడిగా తిరుగుతూ కన్పించారు. ఆయన ముఖం చాలా ఆందోళనగా ఉంది. విజయ్ ఆయన దగ్గరగా వెళ్లి "ఏంటి నాన్నా! అలా ఉన్నారు? ఏమైంది?" అని అడిగాడు. ఆయన చెప్పేలోగానే విజయ్ రాకను గమనించిన రేవతి లోపలినుంచి హడావుడిగా వస్తూ "బాబూ! విజయ్! దీప ఇంకా ఇంటికి రాలేదు. కాలేజీ నుంచి ఫోన్ చేసి తన స్నేహితురాలు మాధవి వద్దకు వెళుతున్నాను. అని చాలా కంగారుగా చెప్పింది. మాధవి హాస్టల్ లో ఉంటోందని దీప లోగడ ఒకసారి మాటల్లో చెప్పింది. అక్కడేం జరిగిందో? ఏమిటో? తను ఫోన్ చేసి చెప్పి కూడా చాలా సేపయింది. నాకు చాలా కంగారుగా ఉంది " అంది రేవతి. అది విన్న విజయ్ ఆమెకు దగ్గరగా వెళ్లి "ఏం భయం లేదమ్మా! చెల్లాయికి ఏమీ కాదు. పరీక్షలు జరుగుతున్నాయి కదా! కాసేపు తన స్నేహితురాలితో వాళ్ల హాస్టలుకు వెళ్లిందేమో! నేను దీపకు ఫోన్ చేసి తెలుసుకుంటా. నీవు ధైర్యంగా ఉండు. " అన్నాడు విజయ్. వెంటనే దీపకు ఫోన్ చేసి ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయి అది బయటకు కనిపించకుండా " నీవక్కడే ఉండు. నేనిప్పుడే వస్తున్నాను. నీవు ఉన్న చోటు అడ్రసు చెప్పు. " అన్నాడు విజయ్. దీప చెప్పగానే అతను ఫోన్ పెట్టేశాడు. జరిగిందేంటో తెలియక విజయ్ వేపు చూస్తున్న తల్లితండ్రులకు "ఏంలేదు. దీప క్షేమంగా మాధవి వద్ద ఉంది. నేను వెళ్లి దీపను తీసుకుని వస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. " అని వెంటనే బయలుదేరి దీప చెప్పిన గవర్నమెంట్ హాస్పిటలుకు వెళ్లాడు విజయ్. అక్కడికి వెళ్లేటప్పటికి పోలీసులు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్లో దీప చెప్పిన రూమ్ నెంబరుకు వెళ్లగానే కంగారుగా దీప ఎదురొచ్చింది. ఆ వెనకే మాధవి కూడా వచ్చింది. వాళ్లతో పాటే ఇంకాస్త ముందుకు వెళితే బెడ్ మీద ఒక బాలిక కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. దీప ఆమెని చూపిస్తూ "అన్నయ్యా! ఈమె నీకు తెలియదు కదా! ఈమె సుమ. మాధవి చెల్లెలు. కాలేజీ నుంచి మేము రావడం కాస్త ఆలశ్యమైనా, హాస్టల్ వాళ్లు సమయానికి తనని హాస్పిటల్ లో చేర్చకపోయుంటే తనీపాటికి శాశ్వతంగా ఈలోకాన్ని వీడి ఉండేది. మైగాడ్! ఎంత గండం తప్పింది?" అంది దీప. విజయ్ సుమ వంక చూశాడు. కళ్లు మూసుకొని పడుకున్నా ఆమె ముఖంలో ఏదో ఆందోళన, బాధ కనపడుతోంది. వెంటనే మాధవి వంక చూశాడు. బాధతో ఏడ్చినట్లుగా తన కళ్లు చాలా ఉబ్బి ఉన్నాయి. ఇంక తనను అడిగి బాధపెట్టడం ఇష్టం లేక "దీపా! ఏం జరిగిందో చెప్పు" అన్నాడు విజయ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kt1_ajYB8-s

Episode metadata supplied by the publisher feed · Published Jun 15, 2023

Embed this episode

NOW PLAYING

సుధ - ఎపిసోడ్ 3 | Sudha - Episode 3 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 5:48

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 15, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!