సుధ - ఎపిసోడ్ 4 | Sudha - Episode 4 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 21, 2023 · 6 MIN

సుధ - ఎపిసోడ్ 4 | Sudha - Episode 4 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sudha Episode 4' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 4' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కధ: రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది సుధ. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచి మార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది. దీప స్నేహితురాలు మాధవి చెల్లెలు సుమ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే దీప, మాధవిలు కాలేజీ నుంచి అక్కడికి వెళ్తారు. సమయానికి హాస్టల్ వాళ్లు హాస్పిటల్ లో చేర్చగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీప ద్వారా విషయం తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చి వాళ్ల ముగ్గురిని తనింటికి తీసుకువచ్చాడు. ఈ వారం కధ చదవండి.. దీప గురించి కంగారు పడుతున్న రాఘవరావు దంపతులకు ఇంట్లోకి వస్తున్న విజయ్‌, దీపలను చూసి మనసు కాస్త ఊరట చెందింది. లోపలికి వచ్చిన విజయ్, దీపలతో కూడా ఉన్న అమ్మాయిలను చూసి ఎవరన్నట్లు కళ్లతోనే ప్రశ్నార్థకంగా చూశారు రాఘవరావు దంపతులు. "అమ్మా! నేను, నా స్నేహితురాలు మాధవి హాస్టల్ లో ఉండి నాతోపాటుగా చదువుకుంటోందని నీకు లోగడ చెప్పాను. గుర్తుందా? ఈమే మాధవి. ఈమె తన చెల్లెలు సుమ" అని వాళ్లిద్దరినీ తల్లికి పరిచయం చేసింది దీప. గుర్తుందని తలూపి నవ్వుతూ వాళ్లని పలకరించి కూర్చోమని సోఫా చూపించి లోపలికి వెళ్లింది రేవతి. ఆవిడ వెనకాలే విజయ్ వెళ్లాడు. "అమ్మా! ఇందాక నేను దీపవద్దకు వెళ్లాను ఎందుకో తెలుసా! సుమ తనకు పరీక్షలలో రాంకు రాలేదని నిద్ర మాత్రలను మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే సమయానికి హాస్టలు వాళ్లు ఆమెని హాస్పిటల్లో చేర్చారుట. అతికష్టం మీద డాక్టర్లు బ్రతికించారుట. నేను హాస్పిటల్ కు వెళ్లే సమయానికి దీప, మాధవిలు సుమతోనే ఉన్నారు. ఆమెకు స్పృహ రాగానే ఆమెకు ధైర్యం చెప్పి డిశ్చార్జి చేసి వాళ్లని మనింటికి తీసుకొచ్చాను. తల్లీతండ్రి లేని వాళ్లను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనింట్లో రెండు రోజులు వాళ్లని ఉంచుకుని కాస్త నయమయ్యాక వాళ్లని హాస్టల్ కు పంపుదామమ్మా " అన్నాడు విజయ్. విజయ్ చెప్పింది విన్న రేవతి చాలా బాధపడుతూ "అయ్యో! ఎంత గండం గడిచింది? ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుమ క్షణికావేశంలో ఈపని చేసుంటుంది. ఈ కాలం పిల్లలందరూ అంతే! ఆవేశం ఎక్కువ - ఆలోచన తక్కువ. అన్నింటికీ తొందరపాటే. రెండు రోజులు ఏంటిరా? నాకు మన దీప ఎంతో వాళ్లు అంతే! నయమయ్యేదాకా ఉండమను. నాలుగు రోజుల పాటు ఇక్కడి నుంచే వాళ్లు దీపతో కాలేజీకి వెళ్తారు. వాళ్లకు నేను చెప్తాలే! నీవు ఈ మంచినీళ్లు తీసుకెళ్లి వాళ్లకివ్వు. అందరికీ నేను టిఫిన్ చేసుకుని తీసుకుని వస్తాను. పాపం ఎప్పుడు తిన్నారో ? ఏమిటో? " అంది రేవతి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2_u9bcUxfqM

Episode metadata supplied by the publisher feed · Published Jun 21, 2023

Embed this episode

NOW PLAYING

సుధ - ఎపిసోడ్ 4 | Sudha - Episode 4 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 6:17

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 21, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!