EPISODE · Feb 1, 2023 · 11 MIN
స్వామీజీ మందు | Swamiji Mandu | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్వామీజీ మందు రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమండీ వదినగారూ.. ఎలా ఉన్నారు? ఒకసారి ఇటు వస్తారా” అన్నారు పక్కింటి పిన్ని గారు ఆమె గోడ వెనక నుంచి. “ఆ, వస్తున్నా వదిన గారూ!” అంటూ చేయి తుడుచు కుని సీతమ్మగారు “ఆ చెప్పండి వదిన గారు.. విశేషాలు ఏమిటి” అంది. “విశేషాలు ఏమున్నాయ్ వదిన గారూ! మీ అన్నయ్య గారు ఒక పని చేస్తారా.. పొద్దున్నే లేచి బజార్ వెళ్తే ఆయన ఫ్రెండ్ ఒకతను కనిపించి స్వామీజీ కనిపించాడు. తాను హిమాలయాల నుంచి హైదరాబాదు నడచి వచ్చాడుటా.. ఎందుకంటే కరోనా కి మంచి మందు పచ్చి కాకరకాయ కరకరా నమిలి మింగాలిట అని సెలవిచ్చాడు. దానితో ఈ పిచ్చ జనమంతా బజార్ వెళ్లి బుట్టలు బుట్టలు కాకరకాయలు కొనేశారు. ఈయనకి ఒక్క కాకరకాయ కూడా మిగలలేదు. దాంతో ఇంటికి వచ్చి ఒకటే చిందులు. ‘ఎలాగైనా సరే ఈ రోజు రెండు పచ్చి కాకర కాయలు నమలాలిసిందే.. లేదంటే నాకు కరోనా వచ్చేటట్లు ఉంది. అసలే నా ముందు వాడు తుమ్ములు తుమ్మాడు’ అని ఒకటే గొడవ పెడుతున్నారు. ఇంట్లో చూస్తే ఒక్క కాకరకాయ కూడా లేదు సీతమ్మ తల్లి.. మీ మీ ఇంట్లో రెండు కాకరకాయలు ఉంటే ఇస్తే ఆయన్ని శాంతింప చేస్తాను.” అన్నారు పక్కింటి పిన్ని గారు. “అలాగే వదినగారూ! ఈ విషయం మా ఆయన దాకా వచ్చినట్టు లేదు. కాకరకాయ కేమి భాగ్యo.. యిప్పుడే తెస్తాను వుండండి” అని సీతమ్మ గారు లోపలికి నడిచింది. తన శ్రీవారు లేచినట్లులేదు అనుకుంటూ ఫ్రీజ్ తీస్తోవుంటే ‘కర్ కర్ కర్’ అని చప్పుడు వచ్చింది. అప్పుడే ప్రిజ్ పాడైంది ఏమిటి అనుకుంటూ కూరల బాస్కెట్లో వున్న కాకరకాయలు బయటికి తీసి ఫ్రిజ్ తలుపు వేస్తోవుంటే మళ్ళీ ‘కర్ కర్’ చప్పుడు వస్తోంది. వున్న కాయలలో మంచివి ఒక పదికాయలు తీసి టేబుల్ మీద పెట్టి, మిగిలిన కాయలు పక్కింటి వదిన గారికి యిచ్చి, లోపలకి వస్తోవుంటే, అప్పుడు కనిపించారు ఆయన చేతిలో రెండు పొడుగు కాకరకాయలు పట్టుకొని, ఒకటి నములుతూ కనిపించారు. ఆయన పేరు రాఘవ రావు. ‘అయ్యో లేవటం అయింది.. నమలడం కూడా మొదలుపెట్టేశారా!’ అనుకున్నాను. “యిటువంటి సలహాలు మీ దగ్గరికి ముందే వస్తాయని తెలుసు. కర్ కర్ అని వినిపిస్తే ప్రిజ్ ప్రాబ్లెమ్ అనుకున్నాను. ఆ కర కర మీరా” అంటుండగానే, రాఘవరావు ఒక్కసారిగా బళ్ళు మంటూ వామిటింగ్ చేసుకున్నాడు . Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KxZ_xC80UjE
Embed this episode
NOW PLAYING
స్వామీజీ మందు | Swamiji Mandu | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.