తడిసిన నేల - అనిల్ episode artwork

EPISODE · Jul 1, 2021 · 25 MIN

తడిసిన నేల - అనిల్

from Harshaneeyam

తడిసిన నేల:ముందు ఉన్న&nbsp; సీట్లు , &nbsp; ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో&nbsp; వెనకనించీ&nbsp; ముందుకెళ్తున్నాడు రెడ్డి.లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో,&nbsp; నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న&nbsp; వాన చినుకులు&nbsp; హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది.&nbsp;డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”?“ వానలు గదా …. రోడ్డుగూడా, బాగా దెబ్బతినుంది. ఓ మూడుగంటలు వేస్కో.“ అన్నాడు డ్రైవర్ , తల తిప్పకుండా.&nbsp;&nbsp;వెనక్కి సీటు దగ్గరకొచ్చి&nbsp; చూస్తే,&nbsp; చిరంజీవి గాడు అంగుళం స్థలం కూడా మిగల్చకుండా&nbsp; సీట్&nbsp; అంతా ఆక్రమించి జోగుతున్నాడు.&nbsp;&nbsp;మెల్లగా భుజం మీద తట్టాడు.&nbsp;&nbsp;సగం కళ్ళు తెరిచి పక్కకు జరుగుతూ&nbsp; అడిగాడు చిరంజీవి &nbsp; -&nbsp; “దగ్గరికొచ్చామా ’’ ?“ఇంకా మూడుగంటలంటున్నాడు&nbsp; డ్రైవరు”“ బాగా లేటు అయ్యేట్టుంది.”&nbsp;&nbsp;“చూద్దాం“&nbsp;“మరీ లేటయితే, రిక్షాలూ అవీ వుంటాయంటావా”&nbsp;“ అదే ఆలోచిస్తున్నాను. ఈ టైములో ఇల్లు వెతకడం కూడా కొంచెం కష్టమే ”“వెతకడమేంది ,అడ్రస్ మన దగ్గర&nbsp; లేదా “ అన్నాడు కళ్ళు&nbsp; తెరిచి, పెద్దవిచేస్తూ&nbsp; చిరంజీవి.&nbsp;“అంటే ,&nbsp; ఏదో సాయినగర్ అని చెప్పినట్టు గుర్తు &nbsp; ““ ఇప్పుడెలా?&nbsp; ఇరుక్కుపోతామేమో ?”“ కందుకూరు మరీ పెద్ద వూరేమీ కాదు . చూద్దాం.&nbsp; ”&nbsp;“వానేమో ఆగట్లేదు.&nbsp; తుఫానో ఏందో ,&nbsp; అన్నీ&nbsp; చూసుకుని బయల్దేరాల్సింది. “ అటూ ఇటూ ఇబ్బందిగా కదుల్తూ అన్నాడు చిరంజీవి.&nbsp;“ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా ?”&nbsp;“అవును ““ ఈ టైములో&nbsp; వెనక్కెళ్ళడం తేలికా &nbsp; , ముందుకెళ్ళడమా “ఏవీ మాట్లాడలేదు&nbsp; చిరంజీవి.&nbsp;రెడ్డి&nbsp; కిటికీలోంచి బయటికి&nbsp; చూస్తూ అనుకున్నాడు. “ వీడెప్పుడూ ఇంతే. టెన్షన్తో పక్కవాణ్ణి చంపేస్తాడు.&nbsp; అసలక్కడ మూర్తి&nbsp; ఎలా వున్నాడో&nbsp; ఏందో ”రామిరెడ్డి , చిరంజీవి , ఇద్దరూ చిన్నపట్నించీ ఒంగోల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. రామిరెడ్డి వాళ్ళది పెద్ద వ్యవసాయ కుటుంబం. ఉలవపాడు ఆ చుట్టుపక్కల&nbsp; మావిడి తోటలున్నాయి &nbsp; వాళ్ళకి . చిరంజీవి నాన్నగారు&nbsp; ఎల్ ఐ సీ&nbsp; లో సీనియర్ పొసిషన్ లో&nbsp; పనిచేస్తారు. ఒకడే సంతానం. చిరంజీవి, రెడ్డి , మూర్తితో పాటూ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో వున్నారు.&nbsp; కంబైన్డ్ స్టడీలూ, కాలేజీ ఎగ్గొట్టడాలూ ముగ్గురూ కలిసే చేస్తారు.&nbsp; అదే కాలేజీలో చదువుతున్న, వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో కల్సి చిరంజీవి ఒక రూంలో ఉంటే, వెనక పోర్షన్లో వుండే ఇంకో రూంలో రెడ్డి , మూర్తి వుంటారు.&nbsp;&nbsp;పొద్దున్న&nbsp; బాగా వొళ్ళు నెప్పులని&nbsp; చెప్పి, &nbsp; కాలేజీ కి&nbsp; రాలేదు&nbsp; మూర్తి . సాయంత్రం వచ్చేటప్పటికి&nbsp; రూము తాళం వేసుంది.&nbsp; ఇంటిగలాయనకి కీ ఇచ్చి వెళ్ళాడు, ఊరెళ్తున్నా అని చెప్పి. &nbsp; రూమ్ లోకొచ్చి&nbsp; మెళ్ళో వేసుకున్న ఐ డీ కార్డు టేబుల్ మీద పడేస్తూంటే, ఒక చిన్న&nbsp; కాయితం ముక్క&nbsp; పెట్టుంది .&nbsp;“నాన్న పోయారు. టెలిగ్రామ్ వొచ్చింది. బయల్దేరుతున్నా, ఉన్న డబ్బులు ఛార్జీలకు మాత్రం సరిపోతాయి.”మూర్తికి, రామిరెడ్డి చిరంజీవిలతో తప్ప&nbsp; వేరే&nbsp; ఎవరితో పెద్ద పరిచయాల్లేవు.&nbsp; చదువు తప్ప ఏదీ పట్టదు అతనికి.&nbsp; చిన్నప్పుడే వాళ్ళమ్మ పోయారు . ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉన్నట్టుంది. ఏ నెలా టైం కి అందవు, వచ్చే మనీఆర్డర్లు.&nbsp;&nbsp;పర్సులో వున్న మూడు, వంద నోట్లు చూసుకుంటూ&nbsp; అనుకున్నాడు,&nbsp; కొంచెం తొందరగా&nbsp; బయదేరితే, రాత్రి పది కల్లా కందుకూరు&nbsp; చేరొచ్చు.&nbsp;తలుపు తోసుకుంటూ&nbsp; ‘టీకి పోదాం’ అంటూ చిరంజీవి వొచ్చి &nbsp; “మూర్తి గాడేడీ?&nbsp; క్లాసుక్కూడా రాలేదు” అనడిగాడు.&nbsp;విషయం చెప్తే , “ అయ్యో, నేనూ వచ్చేవాణ్ణి గానీ,&nbsp; రేపు ఏటీడీ లాబులో రికార్డు సబ్మిట్ చెయ్యాలి. ” అన్నాడు&nbsp;“ అదంత కొంపలు మునిగే విషయం కాదు గానీ, అసలు విషయం చెప్పు” అని చిరంజీవి మొహంలోకి చూస్తూ అడిగాడు రెడ్డి .&nbsp;“అంటే…&nbsp; నాకు అలాటి చొట్లకెళ్ళడం కంఫర్టబుల్ గా ఉండదు. మా తాతయ్య పొయ్యినప్పుడుకూడా ఎక్కువ సేపు అక్కడ ఉండలేక పోయాను. ” ఎటో చూస్తూ చెప్పాడు చిరంజీవి.&nbsp;“అది సరే. డబ్బులేవన్నా ఉన్నాయా, మూర్తి గాడికి&nbsp; అవసరం పడొచ్చు.”&nbsp;“ ఒక రెండు వందలు వున్నాయి. అన్న నడిగితే, ఇంకో మూడు నాలుగొందల దొరకొచ్చు. ” అని చెప్పి వెళ్లిన&nbsp; చిరంజీవి,&nbsp; ఓ పదిహేను నిమిషాలలో , ఓ చిన్న బాగు భుజానేస్కుని వచ్చాడు.&nbsp;“బ్యాగ్&nbsp; ఎందుకేసుకొచ్చావు”&nbsp;“అన్నకు విషయం చెప్తే&nbsp; “ఇట్లాంటప్పుడే, మనుషుల అవసరం, బయల్దేరి వెళ్ళు ” అన్నాడు.”&nbsp;భోజనం అయ్యిందనిపించి,&nbsp; ఆదరా బాదరాగా బయల్దేరారిద్దరూ. కుండపోత వర్షం. గూడూరు లో బస్సు ఎక్కేటప్పటికి &nbsp; బాగా లేట్ అయిపొయింది.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;*****&nbsp;పైనుంచి&nbsp; పరుచుకున్న &nbsp; వాన తెర&nbsp; లోంచి బస్సు తీరిగ్గా ముందుకు వెళ్తోంది.&nbsp;&nbsp;రెడ్డి అన్నాడు - “వీడెప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాట్టం గానీ , వాళ్ళనించీ లెటర్లు రావడం గానీ చూడలేదు. ఏదన్నా అలాంటి విషయం వొచ్చినా పొడి పొడి మాటలే . వాళ్ళ&nbsp; అక్క కూడా కందుకూర్లో లేదనుకుంటా. “&nbsp; అన్నాడు &nbsp; ….&nbsp; “&nbsp;“ ఎవరో&nbsp; ఒకరు వచ్చి వుండరంటావా ఈపాటికి ”“నాకు అయితే డౌటే. అసలు ఈ వర్షం చూస్తూంటే, చాలా టైం పట్టేటట్లుంది.”“ఏదో ఒక టైం కి చేరుకుంటే ఓకే. మధ్యలో వాగులూ అవీ …. “ అంటూ మధ్యలో ఆపేసాడు, రెడ్డి మొహం చూసి చిరంజీవి.&nbsp;బస్సు చిన్నగా , ఇంకో మూడు గంటల తర్వాత కందుకూరు చేరింది. అప్పటికి సెకండ్ షో కూడా అయిపోయిందేమో ,&nbsp; ఊరి మొదట్లో&nbsp; వుండే సినిమాహాల్లో కూడా, లైట్లు ఆర్పేసి వున్నాయి.&nbsp; అక్కడక్కడా&nbsp; ఆరుతూ వెలిగే, స్ట్రీట్ లైట్ల స్తంభాలు తప్ప రోడ్డంతా&nbsp; ఖాళీ. బస్సు స్టాండ్ లోకి ఎంటర్ అవుతుంటే, ఎంట్రన్స్ లో పోలీస్ జీపు ఒకటి ఆగుంది. దాని పక్కన ఇద్దరు కానిస్టేబుళ్లు నిలబడి,&nbsp; జీపులో వున్న మనిషితో ఏదో మాట్లాడుతున్నారు. వర్షం మటుకు సన్నగా పడ్తూనే వుంది.&nbsp;&nbsp;బస్సు దిగి, కింద కాలు పెట్టంగానే, చిరంజీవి అన్నాడు, “ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా దొరుకుతుందంటావా ఈ టైములో … ?”బస్సు స్టాండ్లో&nbsp; షాపులన్నీ&nbsp; మూసున్నాయి, ఒక బంకు తప్ప .&nbsp;“నువ్వేమన్నా తింటావా ? “అడిగాడు చిరంజీవి.&nbsp;“నాకు ఆకలిగా లేదు, నీకేం కావాలో తీస్కో “అన్నాడు రెడ్డి, భుజాన వుండే బ్యాగ్ ని కిందపెట్టి, చుట్టూ చూస్తూ.&nbsp;చిరంజీవి&nbsp; అరటి పళ్ళు బేరం చేసింతర్వాత, బంక్ అతన్ని , రెడ్డి&nbsp; అడిగాడు.&nbsp; “సాయినగర్ కి రిక్షా మీద&nbsp; ఎంత అవుతుంది.”?చాకుతో పళ్ళు కోసిస్తున్న మనిషి ఆగిపోయి “వూరికి కొత్తా” అని అడిగాడు.&nbsp; సమాధానం చెప్పబోయే లోపల, అన్నాడు&nbsp; “ ఈ రోజు రాత్రి ఎమ్మెల్యే మనిషిని ఒకాయన్ని, ఎక్స్ పార్టీ వాళ్ళు చంపేశారు. 144 సెక్షన్ పెట్టారు. రిక్షాలు దొరకడం కష్టం ”&nbsp;చిరంజీవి&nbsp; పర్సులోంచి డబ్బులు తీస్తున్నవాడల్లా ఒక్క సారి ఆగి, రెడ్డి&nbsp; వైపు చూసి అన్నాడు,&nbsp; “ బయటికెళ్లి రిస్కు చెయ్యడం ఎందుకు . పొద్దుటిదాకా బస్టాండ్లో ఉందాం. “పట్టించుకోకుండా&nbsp; రెడ్డి&nbsp; అడిగాడు&nbsp; బంక్&nbsp; అతన్ని&nbsp; “ఇక్కణ్ణుంచి నడిస్తే ఎంతసేపు&nbsp; సాయి నగర్&nbsp; “?“నడుచుకోని వెళ్లాలంటే, పదిహేను నిమిషాలు ,&nbsp; సాయి నగర్లో ఎక్కడికి? ““ఈ టైంలో&nbsp; వర్షంలో నడుచుకుంటూనా, అదిగూడా ఇల్లెక్కడో తెలీకుండా.” అని సణిగాడు చిరంజీవి.&nbsp;సమాధానం చెప్పేలోపలే, రెడ్డి భుజం ఎవరో తట్టారు . వెనక్కి తిరిగి చూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు.&nbsp;“ఎక్కణ్ణించి వొస్తున్నారు”వూరు, కాలేజీ పేరు చెప్పాడు రెడ్డి&nbsp; .&nbsp;“ ఐడీ చూపించు&nbsp; “బ్యాగులో చేయ్యిపెట్టబోతూ ఆగి చిరంజీవిని&nbsp; అడిగాడు రెడ్డి,&nbsp; “నీది ఉందా, నేను పెట్టుకోలేదు”అడ్డంగా తలూపాడు చిరంజీవి .&nbsp;“పదండి, బయట గేట్ దగ్గర సి ఐ గారున్నారు.”“లేదు సర్, మా ఫ్రెండు వాళ్ళ ఫాదర్ పోతే, తొందర్లో …”&nbsp;స్వరం హెచ్చించి అన్నాడు కానిస్టేబుల్, “సీ ఐ గారి దగ్గరి కన్నానా”ఒకరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నడవడం మొదలు పెట్టారు , తల మీద కర్చీఫులు వేసి . చిరంజీవి మొహం ఎర్రబడి పొయ్యింది. నడవలేక నడుస్తున్నాడు. బస్స్టాండ్ గేట్ బయట దాకా తీసుకెళ్లి ఆగమన్నట్టు సైగ చేసాడు కానిస్టేబుల్.&nbsp; తానొక్కడే నడుచుకుంటూ రోడ్డుకు అవతలి వైపున్న&nbsp; జీపు దాకా వెళ్ళాడు. ఒకనిమిషం జీపులో ఉండే, సి.ఐ తో మాట్లాడి రమ్మన్నట్టు సైగ చేసాడు.&nbsp;<p...

Episode metadata supplied by the publisher feed · Published Jul 1, 2021

Embed this episode

NOW PLAYING

తడిసిన నేల - అనిల్

0:00 25:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 25 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on July 1, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!