EPISODE · Feb 6, 2023 · 10 MIN
Thikka Kudirindi | తిక్క కుదిరింది | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తిక్క కుదిరింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తిక్క కుదిరింది కృష్ణమూర్తి, వాణి పెళ్లి జరిగి నలభై సంవత్సరాలు అయ్యింది. పెళ్లి అయిన అయిదు ఏండ్లు బాగానే వున్నాడు. ఆతరువాత నుంచి ఏమైందో కాని, భార్య మీద ప్రతీ దానికి చిరాకు పడటం, తిట్టడం మొదలుపెట్టాడు. “ఎందుకండి నన్ను ఆలా ఆడిపోసుకుంటారు, వేళ పట్టున అన్నీ వండి పెడుతున్నా నన్నే తిడుతున్నారు. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి” అంది. “నువ్వు నోరుమూసుకుని పడివుంటే, ఏ డాక్టర్ అక్కర్లేదు. ప్రతీ విషయం లోను నేను వున్నానని వస్తావు” అని అవమాన పరిచేవాడు. యింటికి చుట్టాలు వస్తే భయం తో వణికిపోతుంది, భర్త వాళ్ళందరి ముందు అవమానం చేస్తాడేమో అని. కొడుకు, కూతురు కి చెప్పుకుని బాధపడింది. “మా చిన్నప్పుటి నుంచి చూస్తున్నాము నాన్నని. ఆయన నిన్నే కాదు,మమ్మల్ని కూడా ఎంత మాట పడితే అంత మాట అంటాడు. పెళ్లి అయినా కూడా మాకు సలహాలు యిస్తాడు. ఆ విధంగా చేయకపోతే తిట్టడం.. నువ్వు కొన్నాళ్ళు నా దగ్గరికి వచ్చి వుండు అమ్మా, నీ విలువ అప్పుడు తెలుస్తుంది” అన్నాడు కొడుకు. “లాభం లేదురా అబ్బాయి, మీ నాన్నకి రాని వంట లేదు.కావలిసినవి చేసుకుని హాయిగా వుంటాను, నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళు, నాకు భయం లేదని మొదలెట్టారు” అంది. “అలాగే అంటాడు కాని, నువ్వు లేనిదే నాన్న వుండలేడమ్మా, ఒక పది రోజులు నా దగ్గర వుండు” అన్నాడు కొడుకు. “సరే, అలాగే వస్తాలే” అని ఫోన్ కట్ చేసింది. “ఏమిటి నీ కొడుకు తో నా మీద కంప్లైంట్ చేస్తున్నావ్? ఒక పిల్లాడు పుట్టినా, యింతవరకు నాలుగు రూపాయలు దాచుకోవడం తెలియదు” అని చేతి సంచితో బయటకు వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. రోజులన్నీ మనవి కాదు అన్నట్టుగా, ఉదయం లేవగానే బుగ్గ పట్టుకుని మూలుగు తో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కృష్ణమూర్తి. భర్త అడిగే లోపే కాఫీ యివ్వడం మంచిది, లేదంటే మళ్ళీ ఏదోకటి అనకమానడని కాఫీ కప్పు తీసుకుని వచ్చి భర్త చేతికి యిచ్చింది. రాత్రి నుంచి పన్ను నొప్పి, దవడ వాచిపోయింది. నువ్వు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు. మంచి లక్షణం ఒక్కటి లేదు, కాఫీ అక్కరలేదు తీసుకు పో” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RdgygxobTlc
Embed this episode
NOW PLAYING
Thikka Kudirindi | తిక్క కుదిరింది | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.