EPISODE · Nov 19, 2022 · 16 MIN
తీన్ దేవియా | Theen Devia | Telugu short Story | Ch CS Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తీన్ దేవియా... రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "బ్రహ్మన్నా! నమస్కారం!" నవ్వుతూ వరండాలో ప్రవేశించాడు. బలరామశాస్త్రి... "రారా బలరామా!... రా..." బ్రహ్మన్నగారి ఆహ్వానం... బ్రహ్మన్న ... ఎదురుగా వున్న కుర్చీని చూపుతూ.... "కూర్చో బలరామ!..." చిరునవ్వుతో చెప్పాడు.. ఆ ఇరువురూ.. ఇరుగు పొరుగు వారు.. మంచి స్నేహం... బ్రహ్మన్నగారికి ముగ్గురు కుమార్తెలు... లలిత.. పద్మిని... రాగిణి.. లలిత లాయర్... పద్మిని డాక్టర్... రాగిణి పాలీస్ ఇనస్పెక్టర్. రాగిణి వయస్సు ఇరవైమూడు, పద్మిని వయస్సు ఇరవై ఐదు.. లలిత వయస్సు ఇరవై ఏడు... ముగ్గురికీ వివాహం కాలేదు. బ్రహ్మన్నగారికి వున్న సమస్య కుమార్తెల వివాహం కాకపోవడమే... "బావా!..." "చెప్పు బలరాం! " "ఇది నేను మాములుగా ఐదేళ్లనుంచి పాడే పాత పాటే..." "పాడు... వింటాను... " స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్పాడు బ్రహ్మన్న.... "బావా!... నీవు నిజంగా చాలా గ్రేట్.., ముఖంలో ఎలాంటి బాధ లేకుండా ఎంత ఆనందంగా నవ్వుతున్నావయ్యా!.. నీకు నీవే సాటి...." "ఈ పాత పొగడ్త నాకు వద్దు. వియషాన్ని చెప్పు!.." "తప్పుగా అనుకోకూడదు సుమా!...". "నీవు ఒప్పు చెబితే నేను తప్పుగా ఎలా అనుకొంటాను?..." బలరామశాస్త్రి తల వేలాడేశాడు.... ఆలోచనలో పడ్డాడు. 'విషయాన్ని బ్రహ్మన్నకు చెబితే ఎలా దాన్ని స్వీరిస్తాడు... ఏది ఏమైనా... నేను వారి శ్రేయోభిలాషిని... చూచినదాన్ని చూచినట్లుగానే వారికి చెప్పడం నా ధర్మం... బ్రహ్మన్న బలరామశాస్త్రి ముఖంలోకి చూచాడు... "ఏమిటి బావా!... దీర్ఘాలోచన!.... బలరామశాస్త్రి తొట్రుపాటుతో.... "చెబుతున్నా!..." "ఆ... చెప్పు బావా!...". “మన... రాగిణి... ఈరోజు మఫ్టీలో వెళ్లిందా!" "అవును..." "నేను చూచాను..." "చూచివుండవచ్చు... ఆ పైన!" "రాగిణి ప్రక్కన ఓ అబ్బాయి.." "వీరాంజనేయులు..." బలరామశాస్త్రి పూర్తిచేయక ముందే నవ్వుతూ చెప్పినాడు బ్రహ్మ... "నీకు తెలుసా!..." "ఆ... అమ్మాయి చెప్పింది...". "ఏం చెప్పింది?..." “అతను తనని పెండ్లి చేసుకొంటానని చెప్పినట్లు చెప్పింది..." "అంటే!..." "లవ్ !.." నవ్వాడు బ్రహ్మన్న... "బావా!" "అడుగు..." "రాగిణి నిర్ణయం... నీకు సమ్మతమేనా?..." "ఆ... ఆయన పోలీస్ ఈమె పోలీస్.. చూచేదానికి ఈడు జోడు బాగున్నారు. పైన ఆయన మన కులస్థుడే..." "అంటే... నీవు ఒకే చేశావన్న మాట...". Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/-BmhSbqNNQk
Embed this episode
NOW PLAYING
తీన్ దేవియా | Theen Devia | Telugu short Story | Ch CS Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.