తల్లి ఐనా | Thalli Ainaa | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 11, 2023 · 10 MIN

తల్లి ఐనా | Thalli Ainaa | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తల్లి ఐనా.. రచన: బివిడి ప్రసాదరావు  (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "తీర్ధ యాత్రలకు తీసుకెళ్లు రా. చచ్చేలోగా కొన్ని దైవ దర్శనాలైనా కానిచ్చుకోనీయరా."  అనసూయమ్మ మళ్లీ కదిపింది. కొడుకు రాంలింగం మళ్లీ అవస్థయ్యాడు. "తీసుకు వెళ్తాలే." మామూలుగా అనేసాడు ఎప్పటిలాగే. "నువ్వు అచ్ఛం మీ నాన్న మచ్చే. ఆయన ఉన్న రోజుల్లో తెగ అడిగే దాన్ని ఒక మారైనా తీసుకు వెళ్లమని. అదిగో ఇదిగో అనే వారే తప్పా.. నా మాట కానిచ్చేవారు కాదు. నువ్వు అంతే లేరా. చచ్చేంత వరకు నేను ఇలానే మగ్గి పోవాలా." నొచ్చుకుంటుంది అనసూయమ్మ. రాంలింగం ఏమీ మాట్లాడ లేదు. చుట్టూ చూస్తూ ఉండి పోయాడు. ఇక్కడికి ఉదయమే వచ్చాడు. "ఈ మధ్య ఊరిలో చాలా మంది యాత్రలకు చక్కగా పోతున్నారు. తిరిగి ఎంచక్కా వచ్చేస్తున్నారు. నాకే తెగింపు రాకుంటుంది." అనసూయమ్మ మాట్లాడుతూనే ఉంది. రాంలింగం ఆ సీరియస్ ను పల్చపర్చాలని మాట మార్చాడు.. "నువ్వా అక్కడికి రావు. నీ కోడలా ఇక్కడికి రాదు. నేనే అటు ఇటు తిరగాలి.. నలగాలి. ఛఛ." అనేసాడు తెగ దిగులుగా. కొడుకు బేజారుకు.. అనసూయమ్మ ఉసూరుమంది. "సర్లే. ఎప్పటికి ప్రాప్తమో. ఏదైనా రాసి పెట్టుకు పుట్టాలి." అనేసింది. అనసూయమ్మకు ప్రస్తుతం ఆరవై యేళ్లు. పదహారో యేటనే తనకు పెళ్లయ్యింది. అప్పటికి భర్త శివరాం వ్యవసాయ కూలి. కష్టించి.. శ్రమకు తగ్గ ఫలితం చివరికి సాధించాడు శివరాం. ఉంటున్న ఊరి చివరన  ఎకరం భూమిని కూడ తీసుకున్నాడు. ఊరిలో రెండు గదుల సొంత ఇంటిని కట్టు కున్నాడు. శివరాం పొలంకి, ఇంటికి యజమాని అయ్యే సరికి.. ఇరవై యేళ్ల కొడుకు రాంలింగం అందుకు వచ్చేడు. రాంలింగం డిగ్రీ చదివాడు. బ్యాంక్ పరీక్షల్లో పాసై.. పట్నంలోని ఓ బ్యాంక్ ఉద్యోగి అయ్యాడు. ఉద్యోగంలో చేరిన యేడాది కాక మునుపే.. తల్లిదండ్రులతో.. "మీరు నాతో వచ్చేయండి. ఇంకేం కష్టపడ వద్దు." అన్నాడు. "లేదురా. మా చిన్ననాటి నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ ఊరును వదులుకోలేం రా." అనేసారు ఇద్దరూ ఏక గొంతులా. "సరే. మీ ఇష్టం కానీయండి." అనేసాడు రాంలింగం. తర్వాత.. మరో యేడాది గడిచే లోపలే.. తమ బంధువు మూలంగా.. ఓ సంబంధం కలిసి రావడంతో.. రాంలింగంకు పెళ్లి చేసేసారు శివరాం దంపతులు. కొత్త కాపురంతో రాంలింగం పట్నంలో హుషారయ్యి ఉన్నాడు. ఆ కాల గమనంలో.. పాము కాటుతో శివరాం చనిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/nOwQMiL-5MQ

Episode metadata supplied by the publisher feed · Published Feb 11, 2023

Embed this episode

NOW PLAYING

తల్లి ఐనా | Thalli Ainaa | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 10:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!