EPISODE · Apr 3, 2023 · 14 MIN
తండ్రికి తగిన తనయ | Thandriki Thagina Thanaya | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తండ్రికి తగిన తనయ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏయ్! సుగుణా! ఆఫీసుకు టైమవుతోంది. బ్రేక్ఫాస్ట్ రెడీనా?" ఆఫీసుకు రెడీ అవుతూ అడిగాడు గోపాల్. " రెడీ. రండి." అంది సుగుణ.గోపాల్ డైనింగ్ హాల్లోకి రాగానే భర్తకు పెట్టి, తనూ తీసుకుంది సుగుణ. బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి హడావుడిగా ఆఫీసుకు వెళ్లాడు గోపాల్. ఆ తర్వాత మిగిలిన పనిని పూర్తి చేసి తమ ఊరిలో ఉన్న తల్లితండ్రులకు ఫోన్ చేసి వాళ్లతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుగుణ. తరచూ వాళ్లకు ఫోన్ చేసి వాళ్ల యోగక్షేమాలను తెలుసుకోవడం సుగుణకు పరిపాటే. వాళ్లతో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే తన తల్లి తండ్రులు, తన ఊరిని గురించిన ఆలోచనలతో గత స్మృతులలోకి వెళ్లింది సుగుణ.వెంకటాపురం గ్రామంలో రామయ్య తన భార్య జానకమ్మ, ఏకైక కూతురు సుగుణతో పెద్దలిచ్చిన విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ఉన్న ఎకరం పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తూ తనకున్నంతలో ఏలోటూ లేకుండా సుగుణను పెంచి పెద్దచేశారు రామయ్య గారు. ఆయన ఆ ఊరి ప్రెసిడెంటు కూడా కనుక ఊరి పెద్దగా ఉంటూ ఎవరికి ఏసాయం కావాల్సొచ్చినా లేదనకుండా చేసేవారు. అందరికీ ఆయనంటే చాలా గౌరవము, అభిమానము. పురాతనంగా ఉన్న ఆ ఊరి శివాలయాన్ని చుట్టుప్రక్కల గ్రామప్రజల నుంచి చందాలు ప్రోగుచేసి, తమ ఊరి వాళ్ల చేత కూడా చందాలు వేయించి, మిగిలింది తను వేసి దగ్గరుండి ఆలయపునరుధ్ధరణ చేశారు రామయ్య గారు. ఆయనమీద గౌరవంతో ఆ ఊరి ప్రజలు ఆయన్నే ఆలయ ట్రస్టీగా నియమించుకుని ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయ పూజారిని నియమించుకుని తన ఇంటిలో ఒక భాగాన్ని ఆదంపతులకు నివాసానికి ఉచితంగా ఇచ్చారు రామయ్య గారు. సుగుణ కూడా తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మెలుగుతూ కష్టపడి చదివి మంచి మార్కులతో పదవతరగతి పాసయింది. ఆ ఊరి స్కూలులో అంతవరకే చదువు ఉన్నందున ఇంటరు చదువు కోసం ప్రక్క ఊరిలోని కాలేజీలో సుగుణను చేర్చారు రామయ్య గారు. కాలేజీకి ప్రతిరోజూ సుగుణ తన తోటి స్నేహితురాళ్లతో కలిసి నడిచి వెళ్లేది. తమ గ్రామం 'అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతోందా?' అన్నట్లుగా ఎంత సుందరంగా, కనువిందు చేస్తూ ఉంటుందో? తమ ఊరిని దాటి ప్రక్క ఊరి కాలేజీకి వెళ్లాలంటే చుట్టుప్రక్కల అంతా చెట్టు చేమలు, దూరంగా ఎత్తైన కొండలను చూసుకుంటూ మధ్యలో గలగల పారే పెద్దకాలువ, దాని చుట్టూ ఆకు పచ్చనితివాచీ పరిచినట్టు కళకళలాడే మాగాణి పంటలు. ఆ కాలువ నుంచే ఆ పంటలకు నీరు అందేది. బల్లకట్టు ఎక్కి ఆ కాలువ దాటితే గాని కాలేజీకి, ఇతర గ్రామాలకు వెళ్లలేరు. బల్లకట్టుని నడిపేవాడికి నెలకు కొంత ధాన్యం ఇచ్చి ఆ కాలువను దాటి చుట్టుపక్కల గ్రామాల్లో తమ పనులను పూర్తిచేసుకుని తమగ్రామం వెంకటాపురం చేరుకొనేవారు ఆ ఊరి ప్రజలు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5laDtmpd-RM
Embed this episode
Ready to play
తండ్రికి తగిన తనయ | Thandriki Thagina Thanaya | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.