EPISODE · Jul 14, 2023 · 11 MIN
తనివి తీరలేదే | Thanivi thiralede | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thanivi thiralede' - New Telugu Story Written By D V D Prasad 'తనివి తీరలేదే' తెలుగు కథ రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆఫీసు నుండి వచ్చి రాగానే హాల్లో సోఫాలో కూర్చుంటూ, "శిరీషా!" అని హుషారుగా పిలిచాడు భార్గవ్. ఆనందంతో అతని మొహం వెలిగిపోతూ ఉండటం గమనించింది శిరీష. వేడి వేడి కాఫీ తీసుకొచ్చి భార్గవ్కి అందించి అతని పక్కనే సోఫాలో కూర్చొని ఏమిటన్నట్లు చూసింది. "మొత్తానికి ఎలాగో మా బాస్ని ఒప్పించి సెలవు సంపాదించా! మన హానీమూన్ చాలా సరదాగా సెలెబ్రేట్ చేసుకుందాం. సిమ్లా, కులూ, మనాలీ ఈ వేసవిలో చూడ చక్కని ప్రదేశాలు. చాలా చల్లగా ఉంటుంది అక్కడ. కొన్ని చోట్ల మంచు కూడా కురుస్తుంది! మంచులో తడుస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. సరదాగా ఓ వారం రోజులు అక్కడ గడపవచ్చు. ఢిల్లీ వరకూ ఫ్లైట్ టికెట్లూ, అక్కణ్ణుంచి టాక్సీ, రూములూ మొత్తం అన్నీ బుక్ చేసేసాను. ఈ ఆదివారమే బయలుదేరుతున్నాం. బట్టలు అన్నీ సర్దు! అక్కడ మన హనీమూన్ చాలా రోమాంటిక్గా గడుపుదాం కలకాలం గుర్తుండిపోయేలా! తనివి తీరని తీయని అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు. అవి మన జీవితాంతం నెమరు వేసుకోవడానికి ఉపయోగపడతాయి." అన్నాడు భార్గవ్ చిలిపిగా ఆమె చెక్కిలి మీటుతూ. అతని చేయి స్పర్శ తగలగానే ఆమె చెక్కిలి గులాబి వర్ణం దాల్చింది. సిగ్గుపడుతూ, "ఇప్పుడా! మన పెళ్ళై చాలా రోజులైంది కదండి, ఇప్పుడు హానీమూనా! ఎవరైనా నవ్వరూ?" అంది. "సెలవు దొరకడానికి సమయం పట్టింది మరి! 'బెటెర్ లేట్ దెన్ నెవెర్’ అన్నారు కదా. మరేం ఆలోచనలు పెట్టుకోక. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోయి కేవలం మన హానీమూన్ పైనే దృష్టి పెట్టాలి సుమా! ఆ తియ్యని అనుభూతులు మనసులో పదిలపరచుకోవాలి!" కొంటెగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు భార్గవ్. ప్రయాణానికి ఒక రోజు ముందు నుండే సెలవు పెట్టాడు భార్గవ్. ఆ రోజంతా తిరిగి జర్నీలో కావలసిన వస్తువులు అన్నీ కొనుక్కున్నారు. ఢిల్లీ వరకూ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుండి ముందే ఏర్పాటు చేసుకున్న టాక్సీ ఎక్కారు ఇద్దరూ. దారిలో మంచి హోటల్ కనిపిస్తే లంచ్ చేసి తిరిగి ప్రయాణ మయ్యారు. సిమ్లా చేరేసరికి అర్ధరాత్రైంది. టాక్సీ దిగేసరికి చలికి ఇద్దరూ గడగడ వణికిపోయారు స్వెట్టర్లు వేసుకున్నప్పటికీ. "అమ్మో! మే నెలలో కూడా ఇంత చల్లగా ఉంటుందా!" ఆశ్చర్యపోయింది శిరీష. "అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది! ఎండాకాలంలో కూడా శీతాకాలం అనుభూతులు పొందవచ్చు. శీతాకాలం అయితే అంతా మంచుతో కప్పబడి ఉంటుంది, మనం అడుగు పెట్టలేం." అన్నాడు భార్గవ్. ఇద్దరూ చలికి వణుకుతూ లాడ్జిలోకి ప్రవేశించారు. రిసెప్షన్ కౌంటర్లో భార్గవ్ రూము రిజర్వు అయిన సంగతి చెప్పి తమ గది తాళాలు తీసుకున్నాడు. బాయ్ కారులోంచి వారి సామాన్లు తీసుకొని వాళ్ళ గదిలో పెట్టాడు. “చాలా చల్లగా ఉందండి!" అంది శిరీష తమకు కేటాయించిన గదిలోకి ప్రవేశించగానే. "చల్లగా ఉంటుందనేగా ఇక్కడికి వచ్చింది! మనమిద్దరమూ ఏకాంతంగా ఇక్కడుండగా చలిగిలీ అంతా ఎగిరిపోక ఏమి చేస్తుంది!" అన్నాడు భార్గవ్ ఆమె వైపు చూసి నవ్వుతూ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/97GOM4mkMwk
Embed this episode
NOW PLAYING
తనివి తీరలేదే | Thanivi thiralede | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.