తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2 | Tholagina Nili Nidalu episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 31, 2023 · 13 MIN

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2 | Tholagina Nili Nidalu episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Tholagina Nili Nidalu episode 2' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2 చదవండి. సాయంత్రం గాలి, సంధ్యదీపాన్ని వెలిగించినట్లు చంద్రుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. వెన్నెల, ప్రియుడి మీద అలిగివున్నట్లే మబ్బుల చాటునే ఉండిపోయింది. డాబాపై వెల్లకిలా పడుకొని తలక్రిందులుగా చేతులుంచుకుని అలలుగా కదిలిపోతున్న మేఘాలవైపు చూస్తున్నాడు రవిప్రకాశ్‌. నిద్ర పట్టని తుమ్మెద ఒకటి తన గూడు లోంచి బయటకి వచ్చి అతడి మీసకట్టు చూడగానే తనలాగే నిద్రపట్టని తుమ్మెదల బారు ఎక్కడికో ప్రయాణమైందని పరుగు పరుగున వచ్చి సత్యం తెలుసుకోగానే బిత్తరపోయి బిరబిరా ఎగిరిపోయింది. అతని కళ్ళ ముందు ఒక మధుర స్వప్నంలోని మహారాణి ఆమె. కనురెప్పలు వాల్చాలని లేదు. కంటి తెరపై నిలుపుకున్న ఆమె రూపాన్ని తనివితీరా చూసుకుంటున్నాడు. ఆమె వెన్నెల. ఒక ప్రభంజనంలో ధూళి కణంలా కొట్టుకుపోవడమే ప్రేమయితే అతడు తన ఉనికిని ఎప్పుడో కోల్పోయాడు. ఆమె స్మృతుల ప్రభంజనంలో అతడు జ్ఞాపకమై కొట్టుకు పోతున్నాడు. భుజం మీద ఎవరిదోచేయి పడగానే ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. మది కదిలింది. కల చెదిరింది. "ఏమిటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అడుగుతూ అతని ప్రక్కనే కూర్చున్నాడు సుధాకర్‌. "ఏం లేదు. !" అని చెప్పి పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చుకుని సర్దుకున్నాడు. సుధాకర్‌ రెండు చేతులు వెనక్కి ఆన్చి, కాళ్ళు బార్లా చాపుకుంటూ "మా వూరు నచ్చిందా ?" అడిగాడు. "చాలా ! ప్రకృతి అంటే పల్లియలు. పల్లియలంటే ప్రకృతి. ఎక్కడో చదివాను. ఈ పల్లె, పచ్చని పైర్లు, గోదావరి చూశాక ఆ మాటలు అక్షర సత్యాలుగా తోస్తున్నాయి. దినమంతా ఎండలో కష్టపడ్డా చెదరని ఆ రైతు కూలీల చిరునవ్వులు, సాయంత్రం ఇళ్ళకు వెళుతూ స్త్రీలు పాడే పాటలు. వాటికి తోడు మృదంగనాదంలా, పశువుల గిట్టల చప్పుడు. నిజంగా ఈ పల్లె జనాలెంత అదృష్టవంతులు" పరవశంగా కళ్ళు మూసుకుని చెప్పాడు రవిప్రకాశ్‌. “నా కిక్కడే వుండిపోవాలనిపిస్తోంది”. అతడి మాటలకి నవ్వాడు సుధాకర్‌. ఆ నవ్వు చూసి అతని వైపు ప్రశ్నర్థకంగా చూశాడు రవిప్రకాశ్‌. "పల్లెటూరిని చూడటం ఇదే మొదటిసారా?" అడిగాడు సుధాకర్‌. అవునన్నట్టు తలవూపాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/W7LuW_U6ZAA

Episode metadata supplied by the publisher feed · Published Aug 31, 2023

Embed this episode

NOW PLAYING

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2 | Tholagina Nili Nidalu episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 13:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 31, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!