EPISODE · May 13, 2023 · 3 MIN
తోడ్పాటు | Thodpatu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తోడ్పాటు రచన: M. భాను (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఇలా నువ్వు వoటచేయటానికి వెళ్తుంటే నాకు ఎoత ఇబ్బంది గా ఉoదో తెలుసా" అన్నాడు శ్రీధర్ తన భార్య మాలతి తో. మాలతి: నాకు మాత్రం ఇష్టమా చెప్పoడి, ఇప్పుడు మనకి డబ్బులు అవసరం చాలా ఉoది. నాకు ఈ పని తప్ప వేరే ఏమీ రాదు. అయినా మనము ఎవరినీ యాచించడం లేదు. కష్టపడి సoపాదిస్తున్నాము. ఎవరు ఏమన్నా బాధ అవసరం లేదు. మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టం. సంపాదించే మామగారు మంచం పట్టారు. ఆడబడుచుకి పెళ్ళి చెయ్యాలి. మీ ఒక్కరివల్లా అయ్యే పనికాదు. పైగా మన పిల్లల చదువులు ఉన్నాయి. అందుకే ఇవేమీ మనసులో పెట్టుకోకుండా మీ ఉద్యోగం మీరు ప్రశాంతంగా చెయ్యoడి. అయినా ఇప్పుడు వంట చెయ్యడం ఒక హోదాగా భావిస్తున్నారు అందరూ, ఇందులో తప్పేమీ లేదు. పైగా నేను వెళ్ళేది వృద్ధ దంపతులకు సహాయం చెయ్యటానికి. పైగా వాళ్లు మన దగ్గర బంధువులు కూడా. వారికి సహాయం చేసినట్లు ఉంటుంది, మనకి కాస్త సంపాదన పెరుగుతుంది. వేరే ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండండి శ్రీధర్ మాట్లాడుతూ “నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంటి పని, నాన్నగారి పని చేస్తూ బయటికి వెళ్లి వంట చేయడం అంటే కాస్త కష్టమేమో ఆలోచించు. పైగా పిల్లలను చూసుకోవాలి. నాది ఒక సమయం సందర్భం లేని ఉద్యోగం. ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి రావాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది మాలతీ!” అన్నాడు. మాలతి: అన్ని విషయాలు ఆలోచించాను, మీరా విషయాల గురించి గాబరా పడకుండా అందరికీ సమయానికి అన్ని ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను అదీకాకుండా నేను వెళ్లే సమయానికే జానకి ఎటూ వస్తుంది, తను చూసుకుంటుంది మిగతా విషయాలు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xB0niE0HKxk
Embed this episode
NOW PLAYING
తోడ్పాటు | Thodpatu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.