EPISODE · Jun 1, 2023 · 14 MIN
తప్పు చేశాను | Thappu Chesanu | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thappu Chesanu' New Telugu Story Written By A. Annapurna 'తప్పు చేశాను' తెలుగు కథ రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తప్పుదారిలో పడ్డ యువకులు ఆత్మహత్య జోలికి పోకుండా జీవితంలో సెటిల్ అయినట్లు చూపారు రచయిత్రి ఏ అన్నపూర్ణగారు. యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే కథ ఇది. ''మా డాడీ, ‘ఈసారి పరీక్షలు ఎలాగైనా పాసవ్వాలి.. లేకపోతె సౌథ్ ఆఫ్రికాలో ఉన్న మీ మామ దగ్గిరకు పంపిస్తాను’ అని వార్ణింగ్ ఇచ్చాడు. బుక్కు తెరిస్తే ఒక్క అక్షరం బుర్రకి ఎక్కడంలేదు.. ఏదైనా ఉపాయం చెప్పు నాగరాజూ!" అన్నాడు మధుకర్, క్లాస్ మేట్ నాగరాజుతో. ''పంపితే వెళ్ళు.. ఇంచక్కగా ఎంటర్టైన్మెంట్! అక్కడ బ్లాక్ బేబీలు ఎలా వుంటారో చూడచ్చు..!" అన్నాడు మరో క్లాస్ మేట్ ఉపేంద్ర. ''అమ్మోవ్.. అంత ఛాన్స్ లేదు. మామ కూతురే వుంది చింపాంజీ. దానికి నేనంటే లవ్వు. నన్ను అమాంతం కొరుక్కు తినేస్తుంది. దానిపేరు జాంబవతి. ''అన్నాడు మధు. ''అదేంటి? జాంబవతి పేరు ఈ కాలం ఎవరు పెట్టుకుంటారు?” ఆశ్చర్యంగా అన్నాడు.. కాలేజీ ప్రిన్సుపాల్ కొడుకు వికాస్. ''మీకు అర్ధం కాలేదు. మా మామ సౌత్ ఆఫ్రికా లేడీ.. మిలీనియర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ప్రెటీ డాటర్ అసలు పేరు జుంబారే! జాంబవతి.. దానికి నేను పెట్టిన పేరులే.. ''. అన్నాడు మధు. ''సో మనకు మూడేళ్ళుగా ఒక్క సబ్జక్ట్లో పాస్ మార్కులు రాలేదు. ఇక ఫైనల్లో ఏమి వొరగబెడతాం. ? కనుక నాకు ఈజీగా పాస్ అయ్యే అయిడియా వచ్చింది. దాన్ని అమలు చేస్తాను. కానీ సాలా కరుచవుద్ది.." అన్నాడు నాగరాజు బీర్ సేవిస్తూ. ''అదేంటో చెప్పు రాజు. మనీ కేముంది.. సెకండ్లో తెస్తాం..” అన్నారు మధు, ఉపేంద్ర. వికాస్ మాటాడలేదు. ''మీ డాడ్ బిజినెస్ మాన్ కనుక సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ పెట్టడానికి నువ్వు ఇంజినీరింగ్ పాస్ అవ్వాలని కండిషన్ పెట్టేడు.. మాకు అలాంటి కండిషన్లు లేవుకాని.. పెళ్ళికి కట్నాలు రావని చదివిస్తున్నారు. '' అన్నారు ఉపేంద్ర, వికాస్. ''అదేమరి. ఏదోలా పాస్ అవ్వాలి కనుక తలో పాతిక లక్షలు ఇస్తే కొశ్చన్ పేపర్లు తెస్తాను.. అదీ సంగతి. ''అన్నాడు నాగ్. ''ఎలా తెస్తావ్ ? ఆశ్చర్యంగా అడిగాడు ఉపేంద్ర. ''అదంతా సీక్రెట్. చెప్పకూడదు. నేను చెప్పినట్టు చేస్తే పాస్ గేరంటీ. '' ''ఆ పని ఏదో ముందే చేస్తే బాగుండేది కదా.. మమ్మి డాడీల సాధింపు తప్పేది. '' ''ఆ ఎందుకు రిస్క్? మూడేళ్లు ఫెయిల్ అయినా కాలేజీకి రానిచ్చారుకదా. ఇక ఫైనల్ ఇయర్ తప్పదు మరి. '' ''మరి పట్టుబడితే?” సందేహించాడు వికాస్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/tp4hAbiu2ZI
Embed this episode
NOW PLAYING
తప్పు చేశాను | Thappu Chesanu | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.