EPISODE · Jan 12, 2023 · 18 MIN
తరాలు - అంతరాలు | Tharalu Antharalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తరాలు - అంతరాలు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టైంపీస్ ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి.. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది.. కళ్లు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది.. అయ్యబాబోయ్ ఆవిడగారు ఏం దండకం చదువుతుందోననుకుంటూ లేచి గదినుండి బయటకు వచ్చింది.. వంటింట్లోనుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి.. అవి దేవుడికి అనుకుంటే పొరపాటే.. ' ఏం నిద్రలో తల్లీ మాయదారి నిద్రలు'.. బారెడు పొద్దెక్కేదాకా గది తలుపులు బిగించుకుని పడుకోవడం మా ఇంటావంటాలేదు.. మేమూ చేసాం సంసారాలు.. ఇలానా? హవ్వ ! పేరుమాత్రం మహాలక్ష్మి, అన్నీ దరిద్రపు పనులే.. మా కాలంలో ఇలాగే ఉన్నామా? అత్తగారంటే హడలి చచ్చేవాళ్లం.. ఏ ఝాము రాత్రికో నిద్రలేచి ఇల్లూ వాకిలీ ఊడ్చీ, అలికి కళ్లాపుజల్లి ముగ్గులు పెట్టాకే తెల్లవారేది.. ఇదిగో చూస్తున్నాను కదా, పొద్దెక్కేవరకు గది తలుపులు బిడాయించి పడుకోడం సంసారుల కొంపేనా ఇది.. ఇలా సాగిపోతూనే ఉంది శేషమాంబ వాక్ప్రవాహం. తను రోజూ అత్తగారు లేవకుండానే తెల్లవారు ఝామున నాలుగు గంటలకే నిద్రలేచి ఇంటిపనులు చేసుకుంటుంది.. అసలు తను ఆలస్యంగా నిద్రలేవడానికి నిన్న రాత్రి ఈవిడేకదా కారణం.. రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్లి పదకొండుగంటలకు తిరిగి వచ్చింది.. ఆవిడ వచ్చేదాకా మెలుకువగా ఉండాలి.. ఒకసారి ఇలాగే నిద్రపట్టేసి మెలుకువ రాలేదు.. అత్తగారు దబ దబా తలుపుకొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావుడిగా తలుపుతీసేసరికి ఆవిడ తనవైపే గుడ్లురిమి చూస్తూ ' అప్పుడే మొగుడు పక్కలోకి చేరిపోయావా, పిలవగానే రాలేదంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది.. నిన్న రాత్రీ అంతే.. అత్తగారు గుడినుండి వచ్చాకా ఆవిడకు ఫలహారం అందించి ఆవిడ తినేవరకు వేచివుండి, అన్నీ సర్దుకుని నిద్రపోయేసరికి పన్నెండు అయిపోయింది.. పొద్దుటే మెలుకువ రాలేదు.. ఒక్కరోజు ఆలస్యంగా నిద్రలేచినందుకు ఇంత రాధ్దాంతమా, ఏం ఘోరం చేసానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతోంది. శేషమాంబకి నోటిదురుసుతనం ఎక్కువ.. దానికితోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవడం, భర్త సోదరులు ఆస్తిపంపకాలు చేయడంతో ఆవిడకు బాగానే ఆస్తి రావడంతో ఒకరకమైన అహంకారం దాష్ణీకం బాగా అలవడ్డాయి.. మహాలక్ష్మి చాలా పెద్దకుటుంబంలో పుట్టింది.. శేషమాంబకి ఒక్కడే కొడుకని కుర్రాడు బుధ్దిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేసారు.. మహాలక్ష్మి చామనచాయలో ఉన్నా మంచి కళగల ముఖం..పైగా పనీపాటా చాలా చక్కగా చేస్తుంది.. పదిమందికి వంట చాలా సునాయాసంగా చేసేస్తుంది.. ఎంతో ఓర్పుగా వినయంగా ఉంటుంది.. అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడంపోయి రాచీరంపాన్న పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/CgtFyMvR_mk
Embed this episode
NOW PLAYING
తరాలు - అంతరాలు | Tharalu Antharalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.