తరగని నిధి | Tharagani Nidhi | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 26, 2022 · 10 MIN

తరగని నిధి | Tharagani Nidhi | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తరగని నిధి రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఈశాన్యం వైపు పొడిచింది. నాలుగు వందల ఎనభై గజాలు... అద్భుతమైన స్థలం. మీరు 'ఊ!' అనండి రామకృష్ణ గారూ. కింద బ్రహ్మాoడమైన షాపింగ్ కాంప్లెక్స్, పైన విశాలంగా రెండు ఫ్లోర్లు నివాసానికీ... చక్కని ప్లాన్ గీసి ఇస్తాను. నాలుగు రోజుల్లో ఈ పాత ఇంటిని పడగొట్టి, పునాదులు తీయించే పనిలో ఉంటాను" ఇంజనీరు చెబుతున్న మాటలు నాకెందుకో అంతగా రుచించలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాను. "కిష్ణయ్య బాబూ! ఊర్లోకొచ్చారని తెలిసి, చేను ఊడ్పులు ఆపి ఇలాగొచ్చీసినాను. ఏం బాబూ... ఇల్లు పడగొట్టేత్తారంట కదా!? ఆళ్ళూ ఈళ్ళూ సెప్పుకుంటన్నారు. నిజవేంటో తెలుసుకుందారని పరిగెట్టుకొచ్చీసినాను" నేను వచ్చానని తెలిసి, చేలో పని వదిలేసి, సైకిల్ మీద వచ్చిన వెంకన్న, సైకిల్ వెనక క్యారేజీ స్టాండ్ కి తగిలించిన చిన్న సంచిలోంచి, థమ్స్ అప్ బాటిల్ మూత తీసి చేతికందిస్తూ అడిగాడు. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. ఆ ఇల్లు పరబ్రహ్మం గారు వారసత్వంగా నాకు ఇచ్చినది. ఆ తరం మనుషులతోపాటే ఇల్లూ మూగబోయింది. శిథిలమైపోతున్న మట్టి ఇటుక గోడల్లో, నిక్షిప్తమైన ఎన్నో జ్ఞాపకాలు నా మనసులో గందరగోళంగా తిరుగుతున్నాయి. అరవై అయిదేళ్ల నాడు... రామేశ్వరం యాత్రలకు వెళ్లిన పరబ్రహ్మం, వెంకట శేషమ్మ దంపతులు,  అక్కడ వారికి ఆతిధ్యం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారి మూడో సంతానమైన నన్ను దత్తత తీసుకున్నారు. తల్లిలేని బిడ్డల్ని పెంచడానికి సతమతమవుతున్న సుబ్రమణ్యం గారికి నచ్చచెప్పి, బిడ్డని వృద్ధిలోకి తెస్తామని హామీనిచ్చి, తమతోపాటు తెచ్చి, తమ ఇంటి బిడ్డగా ఎంతో గారాబంగా పెంచుకున్నారు. వేదపండితుడైన పరబ్రహ్మం గారి అస్థిపై దాయాదుల కన్ను ఉండేది. సంతానం లేని పరబ్రహ్మం గారు,  నన్ను తెచ్చి పెంచుకోవడం ఊర్లో చాలామందికి మింగుడుపడలేదు. కొందరు మొహం మీద చెప్పినా, కొందరు చాటుగా చెవులు కొరుక్కునేవారు. ఇవేమీ పరబ్రహ్మం గారు పట్టించుకోలేదు. నాకు అయిదేళ్ల వయసు రాగానే రెండు ఊళ్ల అవతల వున్న  కాన్వెంటు స్కూల్లో చేర్పించి, రోజూ జట్కా బండిలో స్కూలుకి పంపేవారు. తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టిన నాతోపాటూ, వెంకన్న కూడా ఊర్లో విషయాలు చెబుతూ లోపలకి  వచ్చాడు. మండువా లోగిలిలో  ఓ పక్కగా నాపరాళ్ల గచ్చుపై ముద్రించి ఉన్న అష్టా చెమ్మా గడులు చూడగానే, అమ్మ తన తోటి ఇల్లాళ్ళతో కలిసి కూచుని, గవ్వలు విసురుతూ పందెం వెయ్యడం గుర్తొచ్చింది. భోజనం పూర్తిచేసి, నిద్ర రాకుండా ఉండేందుకు అమ్మ  ఇలా కాలక్షేపంగా ఆడేది. పెరట్లో అవిస చెట్టుమీదకి పాకించిన తమలపాకు తీగ నుంచి, లేత తమలపాకులు కోసి, కుండలో దాచివుంచిన గుల్లసున్నం ముద్దతీసి వేలితో ఆకులపై రాసి, వక్కా, కవిరి, పచ్చకర్పూరం, గులాబీ రేకల చూర్ణం, తేనె కలిపి అమ్మ చుట్టియిచ్చే తాంబూలం అంటే నాన్నకి చాలా ఇష్టం. నోట్లో ఆకుల రసం ఊరుతుంటే, బుగ్గలో తాంబూలం కొరికి పట్టి ఉంచి, విసనకఱ్ఱతో విసురుకుంటూ, పడక్కుర్చీలో కునుకు తీసేవారు నాన్న. అమ్మ చేతి గాజుల గలగలలూ, గవ్వల సడీ కలిసి లయబద్ధంగా ఉండదేమో హాయిగా నిద్రలోకి జారుకునేవారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BSPkrB-3R1Y

Episode metadata supplied by the publisher feed · Published Dec 26, 2022

Embed this episode

NOW PLAYING

తరగని నిధి | Tharagani Nidhi | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

0:00 10:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!