EPISODE · Dec 26, 2022 · 4 MIN
టెక్నిక్ | Technique | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) టెక్నిక్ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ! ఈరోజు మా కాంతం కక్కి కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్లాం కదా.." భర్తకు ఏదో చెప్పాలని ఆరాటంగా మొదలు పెట్టింది ఉమ. "అవును వెళ్లారు. నన్ను రమ్మని పిలిస్తే నేను రాలేదు. ఇంతకీ ఏమయింది.. పిల్ల నచ్చిందా.. మీ కాంతం కక్కి కొడుక్కి?" భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే మధ్యలోనే అడిగాడు రాంబాబు. "ఫరవాలేదు. పిల్ల బానే వుంది కానీ మరీ బొత్తిగా ఏమీ లేని వాళ్లండీ. కనీసం కూర్చోడానికి సరి అయిన కుర్చీలు కూడా లేవు. మమ్మల్ని చూసి, పక్కింటికి వెళ్లి కుర్చీలు తెచ్చి వేసి, కూర్చోబెట్టారు." నిష్టూరంగా చెప్పింది ఉమ. "నేను అప్పటికీ మొత్తుకుంటూనే వున్నా, పెళ్లి చూపులకి అంతమంది ఎందుకు వెళుతున్నారు.. పెళ్లి కొడుకు, తల్లి, చెల్లెలు వెళితే చాలు అని. పటాలం అంతా కట్ట గట్టుకుని పోయారు. పాపం వాళ్లెంత ఇబ్బంది పడ్డారో.." బాధ పడ్డాడు రాంబాబు. "వాళ్లు ఏమీ ఇబ్బంది పడిపోలేదు కానీ మీరు ఆట్టే బాధ పడకండి. ఏదో కాస్త టీ నీళ్లు పోసారు కానీ ఎవరికీ స్వీట్ హాటు ఏమీ పెట్టలేదు లెండి. పైగా 'కతికితే అతకదండీ' అని ఒక సామెత కూడా ఉపయోగించారు. ఎంత లేని వాళ్లు అయితే పెళ్లి చూపులకి గుమ్మం లోకి వచ్చిన మగపెళ్లి వారికి ఒక స్వీట్ హాటు పెట్టరుట అండీ" మూతి మూడు వంకర్లు తిప్పుతూ మాట్లాడింది ఉమ. "సరేలే. మీరు ఏమైనా తినడానికి వెళ్లారా ? ఏమిటీ ? ఇంతకీ సంబంధం విషయం ఏమయింది?" "నేను వెళితే ఆ పని సక్సెస్ కాకుండా వుంటుందా ? ఏమనుకుంటున్నారు నా గురించి” పనిలో పని ఉమ తన గొప్ప చెప్పుకోవడం మొదలు పెట్టింది. మా కాంతం కక్కి ఏది అడిగినా కూడా 'మా వల్ల కాదండీ! మేము తూగలేమండీ!' అంటూ దేనికీ ఒప్పుకోలేదు ఆడపెళ్లి వారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్ట పడ్డారని పెళ్లికి ఒప్పుకున్నారు మా కాంతం కక్కి వాళ్లు." "అదేమీ కాదు కానీ ఇప్పటికే మీ కాంతం కక్కి కొడుక్కి చాలా సంబంధాలే చూసారు. కట్నాలు కానుకలు దగ్గర ఎన్ని సంబంధాలు వదిలెయ్య లేదు? ఇప్పటికే ఆ అబ్బాయికి పెళ్లి ఆలస్యం అయిపోతోంది. ఇప్పుడు అబ్బాయి పట్టు పట్టాడని ఏమీ అనలేక కాంప్రమైజ్ అయ్యారు మీ కాంతం కక్కీ వాళ్లు. నాకు తెలియదా..” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Ud9q84aTaeI
Embed this episode
NOW PLAYING
టెక్నిక్ | Technique | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.