టీ కప్పులో పెను తుఫాను | Tea Cup Lo Penu Thufan | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · May 18, 2023 · 10 MIN

టీ కప్పులో పెను తుఫాను | Tea Cup Lo Penu Thufan | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  టీ కప్పులో పెను తుఫాను రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బ్రతుకుబాటలో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను ఎదుర్కున్నప్పుడు— ఎదుర్కుంటున్నప్పుడు కొందరు- కొందరేమిటి చాలా మంది షాక్ తగిలిందంటారు. దిమ్మ తిరిగి పోయిందంటారు. ఇదొక మాటకందని మౌనం వంటిదే. ఇందులో నకారాత్మక భావ ప్రభంజనం ఉంటుందనేది తెలుస్తూనే ఉంది. ఇంకొందరేమో— ఊహకందని రీతిన అతీతమైన ఆనందం పాలపొంగులా పొంగి పొర్లినప్పుడు — మాటల పొందికను సయయానికి సమకూర్చుకోకుండా“నమ్మలేకపోయాను— నిలువెత్తు విద్యుత్ షాక్ తగిలిందనుకో! ”అంటుంటారు. నిజానికి ఇందులో సకారాత్మక భావన ఉంది. కాని పొసగని పదాల మాటున ఆ ఉదాత్త భావప్రక టన మరుగున పడిపోతుంది. ఈ రెండు భావస్రవంతుల్నీ శ్రావణి ఒకేదశన జలపాతపు ఉధృతి మల్లే ఎదుర్కుంది;చెరువు గట్టున పూలమొగ్గలు తెంచుకుంటూ మనో రాగాల ఆలాపనలతో మైమరచి ఏరుకుంటూ వెళ్తున్నదల్లా అదాటున గట్టునుండి కాలుజారి లోతైన నీళ్లలో పడ్డట్లు-- అనుకోనిది అనుకోని విధంగా ఎదురవడమేగా మానవ జీవన ప్రయాణంలో అణగి ఉన్న అండపిండ బ్రహ్మాండ జీవన గణితం— దూరదృష్టి గల మహాపురుషులే కాక— మహర్షులు సహితం ఇంతవరకూ ఛేదించలేని చిదంబర రహస్యం! జుత్తుచిక్కు తీసుకుంటూ ఇంటి వాకిట వరకూ వచ్చిన శ్రావణి అల్లంత దూరాన వస్తూన్న రామలింగేశ్వరరావు ఎవరో వ్యక్తిని వెంటబెట్టుకుని చకచకా నడుస్తూ రావడం చూసి కళ్లింతలు చేసుకుని చూసింది. తన కోసమే వస్తున్నాడు— వివాహపత్రి క అచ్చు వేయడం గురించి, వాటి వివరాలు పొందుపర్చడం కోసం మాట్లాడటానికే వస్తున్నాడు— అతడికి కావలసిన మిత్రుడు ఎవరినో వెంటబెట్టుకుని-- ఆమె మనసు తుళ్ళింతకు లోనైంది. నిర్ణీత సమయానికి ముందే వర్కు టార్గెట్ ముగించిన ఐ. టీ. ఉద్యోగి మూడ్ లా ఉరకలు వేసింది. కాని— ఉత్సా హంతో ఊగిస లాడిన ఆమెకు తరవాత తెలిసింది వాళ్లిద్దరూ వచ్చిన వ్వవహారమే వేరని. వచ్చీరావడంతోనే ఇద్దరూ తనను చూసి కూడా చూడనట్లు తిన్నగా లోపలకు దూసుకువెళ్ళారు ఒంటి పైన నిప్పులు పోసుకున్నట్టు. రామలింగేశ్వరరావయితే-- అరచినంత పని చేసాడు- “ఎక్కడా పెద్ద మనిషి? ఎక్కడా పెద్ద మనిషి? పిలవండి. నేను వెంటనే చూడాలి! “ ఇంటికి కాబోయే అల్లుడు అలా ఆక్రాశంతో గొంతెత్తి పిలవడం చూసిన విమలమ్మ అదరిపోయింది. ”ఏమైంది నాయనా! ఏమైంది?’ ” రామలింగేశ్వరరావు ముఖం చిట్లించాడు. “నేను మీతో మాట్లాడటానికి రాలేదండీ! ఆ పెద్దమనిషితో మాట్లా డి తేల్చుకోవడానికే వచ్చాను“. అప్పుడు రామలింగేశ్వరరావు సహోద్యోగి సుందరం కలుగచేసుకున్నాడు- “మధ్యన మీరెందుకండీ హైరానా పడిపోతారు? మీ వారిని పిలిచి వ్యవహారాన్ని తేల్చుకోవచ్చు కదా!” అప్పుడు గాభరాగా— గడ్డం గీసుకుంటున్న వాడు గీసుకుంటున్నట్టుగా పరుగు వంటి నడకతో అక్కడకి చేరాడు శివానందం- “ఏమైంది అల్లుడూ? ”అంటూ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/71dgRUDH0-s

Episode metadata supplied by the publisher feed · Published May 18, 2023

Embed this episode

NOW PLAYING

టీ కప్పులో పెను తుఫాను | Tea Cup Lo Penu Thufan | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 10:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 18, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!