EPISODE · Apr 5, 2023 · 10 MIN
తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రు పప్ప | Turrupappa Turrupappa Ehehe Turrupappa | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రు పప్ప రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖరచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ ఊరు పేరు మహారాజ గోపాలపురం. బాగా డబ్బు ఉన్న చాలామంది ఆ ఊర్లో ఉన్నారు. పచ్చని వరిచేలు, ప్రతి ఇంటి దొడ్డి ప్రాంతంలో పాలు సమృద్ధిగా ఇచ్చే ఆవులు, గేదెలు, ఊరంతా కళకళ లాడే పూలమొక్కలు. ఎక్కడపడితే అక్కడ ఏపుగా పెరిగే ఆకుకూరలు, కూరగాయల చెట్లు, రకరకాల పాదులు, ఊరంతా కొబ్బరి చెట్లు, చాలా దేవాలయాలు అందులో పూజలతో, హోమాలతో అలరారు తుంటుంది ఆ ఊరు. ఆ ఊరిలో సత్యనారాయణ స్వామి గుడి పక్కగా ఆంజనేయ స్వామి గుడి వెనుక సాయిబాబా గుడి ప్రక్కన ఉన్న పెద్ద మండువా లోగిలి ఇల్లు వసుంధరమ్మగారిది. ఆమె ఆజానుబాహురాలు. తెల్లని శరీర ఛాయా గుండ్రని కళ్ళు ఉంగరాల జుట్టు. చూడడానికి దేవతామూర్తి విగ్రహంలా కనిపిస్తుంది. ఆమెకు 80 ఏళ్ల వయసులో 90 ఏళ్ల ఆమె భర్త చక్ర మహీధరరావు కాలచక్రంలో కలిసిపోయాడు. ఆమె అక్కలు, చెల్లెళ్లు అన్నలు తమ్ములు, చిన్నాన్నలు పెదనాన్నలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు. కూతుర్లు ఎవరూ కలగని ఆమె ఒక్కగా నొక్క కొడుకు విజయబాబుని అల్లారుముద్దుగా చూసుకునేది. విజయబాబు తన ఆస్తిపాస్తులు పుట్టబోయే తన కొడుకుకు మనవాళ్లు కు కూడా సరిపోయేటన్ని ఉన్నవి అని తెలిసినప్పటికీ..ఉద్యోగం చేయాలి అన్న ఉత్సా హంతో ఢిల్లీలో ఉద్యోగం చేయాలి అన్న మోజుతో అది సంపాదించి అక్కడ చేస్తున్నాడు గత 6 సంవత్సరాల నుండి. ఇక్కడ పాడి పంటల పొలాల వ్యవహారాలు ఇంకా ఇంటికి సంబంధించిన మిగిలిన వ్యవహారాలు అన్ని 30 సంవత్సరాల నుంచి నమ్మినబంటుగా ఉన్న ఆంజనే యులు చూస్తున్నాడు. విజయబాబు అతి కష్టం మీద సంవత్సరానికి ఒక్క సారి వచ్చి రెండే రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుం టాడు అలా గత ఆరు సంవత్సరాల నుండి జరుగు తుంది. అతని వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితమే దగ్గర సంబంధం అమ్మా యితో పెళ్లి కూడా అయ్యింది. ఒక అబ్బాయి పుట్టాడు. నాలుగో సంవత్సరం కాన్వెంట్లో చేర్చే వయసు. అయితే విజయబాబు ఎప్పుడు తల్లిని చూడడానికి వచ్చిన భార్యను బిడ్డను తీసుకొనిరాడు. ***ఒక్కగా నొక్క కొడుకు విజయబాబు తనను చూడ డానికి వచ్చి ఇది రెండవ రోజు. సాయంత్రం తిరుగు ప్రయాణమై వెళ్ళబోతున్నకన్న కొడుకుకి పిండివంట తయారు చేస్తుంది వసుం ధరమ్మ. ఆమెకు వెనుకగా వచ్చి నిలబడ్డాడు ఆంజ నేయులు. ''అబ్బాయి విజయబాబు గారు వచ్చి రెండు రోజులు అయ్యింది. ఈ రెండు రోజులలో మిమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని నోరార పిలిచినట్టు నేను చూడలేదు మీకు బాధగా లేదా తల్లి'' అంటూ అడిగాడు.. అక్కడ ఉన్న వెండి సామాను తుడుస్తూ. ''ఆంజనేయులు అవన్నీ నీకెందుకురా పని చూసుకో” అంది ఆమె కొంచెం నర్మగర్భంగా. ''అదికాదమ్మా ఏడాదికి ఓ తూరి వస్తారు. ఉన్న రెండు రోజులలో ఒక్కసారయినా మిమ్మల్ని అమ్మ అని అంటారేమోనని ఆశగా నేను చూస్తుంటాను. నా ఆశ తీరడం లేదు. ప్రొద్దుట నుండి సందేళ దాకా రెండు మూడు మాటలు అతి బలవంతంగా మాట్లాడతారు. ఆ సెల్ ఫోన్ లోనే మిగిలిన టైం అంతా ఉంటారు. నాకు చాలా బాధగా ఉంది మీరు ఎలా తట్టుకుంటున్నా రమ్మా.'' అంటూ మళ్లీ అడిగాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/-s5psfG9ITA
Embed this episode
NOW PLAYING
తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రు పప్ప | Turrupappa Turrupappa Ehehe Turrupappa | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.