EPISODE · Nov 8, 2022 · 13 MIN
ఉషోదయం | Ushodayam | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉషోదయం రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ "ఒరేయ్ చింటూ… లేవరా బారెడు పొద్దుక్కిపోయింది, త్వరగా లేచి స్కూల్‌కు తయారవ్వండి”, కొడుకు దుప్పటి లాగేస్తూ అంది ఉష. "అబ్బా.. అమ్మా! నన్నిప్పుడే లేపకు. ముందు అక్కను లేపు. అది గంటసేపు బాత్రూంలోనుండి రానేరాదు. అది వచ్చాక నన్నులేపు, "అంటూ దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నాడు. నిజమేలే ఇద్దరిని ఒకేసారి లేపితే అదివెళ్ళి బాత్రూంలో కూర్చుందంటే ఓ పట్టానరాదు. వీడు అరుస్తుంటాడు ఎంతసేపు అని. రెండు బాత్రూంలున్నా ఒకటి అత్తయ్య రూంలో ఉంటుంది. అందులోకి వెళ్ళండిరా అంటే ఎవరూ వెళ్ళరు. పెద్దావిడ కదా! ఎప్పుడు అర్జంటు అంటుందో తెలియదు. వీళ్ళేమో లోపలకు వెళ్ళారంటే అరచి గీ పెట్టినరారు. "చిన్నీ… స్కూల్‌కు టైం అవుతుంది. లేచి త్వరగా తయారవు, ఆటో వచ్చి ఇంటిముందు హారన్ కొడుతున్నా తెమలరు, రోజు మీరిద్దరు లేటు చేస్తున్నారని ఆటో అతను గొడవపడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలా చెప్పు, "కూతురిని లేపి కూర్చోబెట్టింది. "అమ్మా అప్పుడే తెల్లారిందా… ఇంకా నిద్రవస్తుంది కాసేపు పడుకుంటాను మా అమ్మవు కదా, "అంది బతిమాలుతూ. "చాలు చాలు నీ వేషాలు కానీ… హోం వర్క్ చాలా ఉంది అన్నావు. తొందరగా లేపితే చేసుకుంటా అన్నావు కదా! లే.. లేచి త్వరగా స్నానం కానిచ్చుకొనిరా, "రెక్కపుచ్చుకుని మంచం మీదనుండి కిందకు దింపింది చిన్నిని. హోం వర్క్ గుర్తుచెయ్యగానే పరుగెత్తినట్టే వెళ్ళిపోయింది బాత్రూంలోకి. చిన్ని హడావుడి చూసి నవ్వుకుంది ఉష. లేడికి లేచిందే పరుగు అనుకుంది. కూతురు కొడుకు లేచి తయారై వచ్చేసరికి స్కూల్ టైం అయింది. "ఓరేయ్ పిల్లలు రండిరా… ఆటో వచ్చేస్తుంది, "కేకవేస్తూనే పిల్లలకు టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకుని వచ్చి ఇద్దరికి పెట్టసాగింది. "ఏమిటే ఉషా… నువ్వు మరీ పాడుచేస్తున్నావు పిల్లలను, వాళ్ళు ఇంకా నీ కళ్ళకు పాలు తాగే పసిపిల్లనుకుంటున్నావు, కాస్తా వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడం నేర్పించవే, "అంది ఉష అత్తగారు సుశీలమ్మ పిల్లలను కోపంగా చూస్తూ. "అదేంటత్తయ్యా అలా అంటారు… వాళ్ళు చిన్నపిల్లలే కదా! పాపం వాళ్ళకు ఎంతింత హోమ్ వర్క్ లు ఇస్తున్నారో చూసారా? అయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటునే ఉన్నారు, స్కూల్‌కు టైం అయిపోతుందని తినిపిస్తున్నాను అంతే కదత్తయ్యా, "అంది. "ఏమో తల్లి … మా కాలంలో ఈ వయసు వచ్చేసరికి అన్ని పనులు నేర్చుకునేవాళ్ళం, కాస్తా మంచిచెడు పనిపాట వాళ్ళకు వచ్చేలా చూడు , ప్రతీది నువ్వే చేస్తున్నావు వాళ్ళకు అలానే అలవాటు అవుతుంది , ఏదో పెద్దదాన్ని చూస్తూ ఊరుకోలేను నీ మంచికోసమే చెబుతున్నా, "అంటూ గొణుగుతూ లోపలకు వెళ్ళిపోయింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WkCGq4nXGTA
Embed this episode
NOW PLAYING
ఉషోదయం | Ushodayam | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.