EPISODE · Sep 21, 2022 · 21 MIN
ఉత్తమ శిష్యః | Utthama Sishyaha | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉత్తమ శిష్యః రచన: అల్లు సాయిరాం ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం ప్రార్ధన ముగిసింది. విద్యార్థులు వారివారి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది ఆఫీస్ రూమ్ కి వెళ్లి, టైంటేబుల్ ప్రకారం వారివారి నియామక తరగతి గదులకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రెండేళ్లలో రిటైర్మెంట్ అవ్వబోతున్న తెలుగు మాస్టారు జనార్ధనరావు ఎప్పటిలాగే ఆఫీసురూం వెనుకున్న చెట్టుకింద నిల్చుని, నోట్లోంచి గాల్లోకి పొగ గింగిరాలు వదులుతున్నాడు. స్వతహాగా జనార్దనరావు మాష్టారు చాలా బాగా పాఠాలు నేర్పించేవారు. ఉపాధ్యాయుడిగా ముప్పై యేళ్ల అనుభవం వలనో, లేక స్కూల్లో అందరి కంటే తాను సినీయర్ అవ్వడం వలనో, లేక స్కూల్ హెడ్మాస్టర్ చిన్నంనాయుడు మాష్టారు తన బంధువు కావడం వలనో, రానురాను జనార్ధనరావు మాష్టారిలో నిర్లక్ష్య ధోరణి అక్కడక్కడ కనిపిస్తుంది. ఆనోటాఈనోటా వినిపిస్తుంది. ఆయన విద్యాబోధనశైలిపై విద్యార్థులకి, ఆయన వ్యవహారశైలిపై తోటిఉపాధ్యాయులకి అసంతృప్తిగా ఉన్నా, వారిలో వారు గుసగుసలాడుకోవడం తప్ప, బయటకు ఎవరూ చెప్పరు! చెప్పలేరు! హెడ్మాస్టారు చిన్నంనాయుడు మాష్టారు కూడా జనార్ధనరావు మాష్టారి సినీయారిటీని గౌరవించి, సందర్భానుసారంగా సలహాలు, సంపద్రింపులు చేస్తుంటారు. కాబట్టి, జనార్ధనరావు మాష్టారు తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు. మొదటి పీరియడ్ గంట మ్రోగి, పదినిమిషాలు అవుతుంది. అందరూ ఉపాధ్యాయులు చకచకా ఆయా తరగతిగదులకు చేరుకుని విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు. "గుడ్ మార్నింగ్ సార్! మీదే సార్ ఫస్ట్ పీరియడ్!" అని అంటూ జనార్ధనరావు మాష్టారి దగ్గరికి వచ్చాడు తొమ్మిదోతరగతి లీడర్ నరేష్. "ఊఁ తెలుసురా! ఆఁ హాఫ్ఇయర్లీ పరీక్షపేపర్లు దిద్దమని చెప్పానే! దిద్దడం అయిపోయిందా?" అని జనార్ధనరావు మాష్టారు అడిగితే "ఆఁ అన్ని పేపర్లు దిద్దేశాను సార్!" అని చనువుగా చెప్పాడు నరేష్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Ur85_OJOvnY
Embed this episode
NOW PLAYING
ఉత్తమ శిష్యః | Utthama Sishyaha | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.