EPISODE · Feb 11, 2023 · 5 MIN
ఊహా లోకం 1 | Uha Lokam 1 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహా లోకం 1 రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఊహా లోకం పెద్ద కథ మొదటి భాగం వంటింట్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ కి ఇచ్చింది వందన. "ఏమండీ కాఫీ" అన్నది. "అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు చిరాగ్గా ప్రసాద్. ఈ మధ్య వందనను చూసి ఊరికే చిరాకు పడుతున్నాడు.. దానికి కారణం లేకపోలేదు, పిల్లలు కొంచెం పెద్దవారై యిన కొద్దీ వందన లావుగా మారిపోయింది. పెళ్లయిన కొత్తలో ఎంతో సన్నగా ఉండేది. మరొక కారణం కూడా ఉంది ప్రసాద్ చిరాకుకి.. ఒకప్పుడు ప్రసాద్ ప్రేమించిన అమ్మాయి ఎంతో అందంగా ఉండేది. ‘ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే ఇలా పిప్పళ్ళ బస్తాల మారిపోయేది కాదు’ అని ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉన్నాడు. వందన బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. పిల్లలను నిద్రలేపి వారిని స్కూలు పంపడానికి బాక్సులు రెడీ చేస్తుంది. ఆరోజు ప్రసాదుకు సెలవు కావడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు. ఉద్యోగం చేస్తాడు. క్లర్క్ గా మొదలైన ఉద్యోగం ఇప్పుడు మేనేజర్ వరకు వెళ్ళింది. చక్కని ప్రతిభతో తన వృత్తిని నిర్వర్తిస్తున్నాడు ప్రసాద్. వందన కూడా ఉన్నంతలో సరిపెట్టుకొని కాపురాన్ని అందంగానే తీర్చిదిద్దుకుంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించి మంచి పేరునే తీసుకొని వచ్చింది. మొదట్లో ప్రసాద్ ఆమెతో బాగానే ఉండేవాడు. తను ప్రేమించిన అమ్మాయి అప్పుడప్పుడు గుర్తు వచ్చినా వందన వ్యక్తిత్వాన్ని నచ్చి ప్రేమగానే చూసుకునేవాడు. కానీ ఆమె చాలా లావు అయిందని కారణంతో ఈమధ్య కొంచెం చిరాకు పడుతూ మధ్య మధ్యలో తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నాడు. అంతకుమించి అతనికి కూడా ఏ వ్యసనాలు లేవు. ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయాడు ప్రసాద్. తన బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి తరచుగా బ్యాంకుకు వచ్చేది. ఆ అమ్మాయి ఏదో కంపెనీలో ఉద్యోగం చేసేది. దాని తాలూకు ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకుకు ఎక్కువగా వచ్చేది. ఒకరోజు క్యాజువల్ గా పని చేసుకుంటున్నాడు. తన కౌంటర్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి.. "ఎక్స్క్యూజ్మీ సార్ కాస్త ఈ అమౌంట్ చెక్ చేస్తారా" అని అడిగింది. తలెత్తి చూసిన ప్రసాద్ ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేక పోయాడు. సంస్కారం అడ్డొచ్చి తలదించుకున్నాడు కానీ వివరాలు చెప్పాలనే నెపంతో ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఆమెకు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి ఇంకా కొన్ని ఇవ్వకుండా కాసేపు వెయిట్ చేయించాడు, అమ్మాయిని ఎక్కువసేపు చూడొచ్చనే కారణంతో. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/-g4YiY5EUfc
Embed this episode
NOW PLAYING
ఊహా లోకం 1 | Uha Lokam 1 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.