EPISODE · Feb 12, 2023 · 7 MIN
ఊహా లోకం 2 | Uha Lokam 2 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహా లోకం 2 రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అలా ఇంటికి వెళ్లిన ప్రసాద్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ప్రసాద్ అలా పడుకునేసరికి తల్లిదండ్రులు బాగా కంగారు పడి "ఏమై ఉంటుంది "అని దగ్గరికి వెళ్లి అడిగారు. "బాబూ ప్రసాద్.. ఎందుకలా ఉన్నావు? ఏమైంది నాన్నా! బ్యాంకులో ఏమైనా సమస్యలు వచ్చాయా" అని అడిగారు. "ఏమీ లేదమ్మా! కొంచెం తలనొప్పిగా ఉంది. నన్ను కాసేపు పడుకో నివ్వండి " అని చెప్పి కళ్ళు మూసుకొని పడుకున్నారు. అలా రెండు మూడు సంవత్సరాలు బాధపడ్డాడు. తర్వాత ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి తేవడం వల్ల వాళ్లు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం నచ్చడం వల్ల తొందరగానే తాను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి సుఖంగానే ఉన్నాడు. పిల్లలు పుట్టారు. వాళ్ళ చదువులు అవుతున్నాయి. అవన్నీ వందనే చూసుకుంటుంది. అలాగే ప్రసాద్ తల్లిదండ్రులను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది కానీ.. ఆడవాళ్లకు ప్రసవం తర్వాత జరిగిన ప్రాబ్లంస్ వల్ల కొందరిలో ఒళ్ళు రావడం, ఇంకా ఇతరత్రా సమస్యలు రావడం జరుగుతుంది. ఇది తెలియని మగవాళ్ళు భార్య అందంగా లేదు మునుపటిలా.. అని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అలాగే జరిగింది వందన విషయంలో. పాత జ్ఞాపకాలనుండి బయటపడ్డ ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పటిలాగే వందనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంది. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లిపోయాడు ప్రసాద్. భార్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. బ్యాంకుకు వెళ్లిన ప్రసాద్ కి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఇప్పుడు ప్రసాద్ మేనేజర్ కాబట్టి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో తాను ప్రేమించిన సౌందర్య కనబడింది. ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు ప్రసాద్. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది కలా! నిజమా ! అంటూ కళ్ళు నిలుముకుని మరీ చూశాడు. మొహం అంతా సంతోషంతో విప్పారిపోయింది. పలకరిద్దామని గబగబా బయటకు వెళ్ళాడు. కానీ ఆవిడ త్వరగా బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే గేటు వరకు వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఒకింత నిరాశకు లోనైన ప్రసాద్ ఇలా జరిగిందేమిటా అని అనుకున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9qpgIhuYrlM
Embed this episode
NOW PLAYING
ఊహా లోకం 2 | Uha Lokam 2 | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.