EPISODE · Nov 21, 2022 · 16 MIN
ఊపనా ఊయల | Upana Uyala | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊపనా ఊయల రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ "రంగా !!..." "ఏం అమ్మా !!...". "నిన్న మామయ్య వచ్చి వెళ్లాడు. ..." తల్లి శాంతి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు రంగ… తన తండ్రి శ్యామ్... తన వయస్సు పది సంవత్సరాలుగా వున్నపుడే మరణించాడు. కారణం విషజ్వరం. అప్పటినుండి... మామయ్య గోపాల్.. తనను, చెల్లెలు సుధను అమ్మ శాంతిని... ఎంతో అభిమానంతో సాయం చేస్తూ తనకు, చెల్లెలికి నాన్న లేని లోటును తెలినీయకుండా... పెంచి... చదివించి పెద్ద చేశారు. 'మామయ్య నాకు చెల్లికి తండ్రిలాంటి వారు. వారి ఋణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను... వారి మనస్సులోని కోర్కెను తీర్చలేక పోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో !...' అనుకొన్నాడు రంగ… "అమ్మా !. మామయ్య ఏం చెప్పాడమ్మా ?...!!" "నిన్ను ఒకసారి వాడిని కలమవన్నాడు నాన్నా!..." "విషయం ఇదని ఏమీ చెప్పలేదా ?..." "లేదు..." కొన్ని క్షణాల తర్వాత... "ఎపుడు వెళతావు ?..." అడిగింది శాంతి. "ఫ్రష్ అయి వెళతానమ్మా !..." రంగా రెస్టు రూమ్ లోకి వెళ్లాడు. సుధ కాలేజీనుండి వచ్చింది. వాకిట్లో వున్న రంగా బూట్లను చూచి... "అమ్మా !... అన్నయ్య వచ్చాడా ?..." " ఆ... శనివారం కదా... వచ్చాడమ్మా !...". "ఆ... నాకు సబ్జెక్టులో కొన్ని సందేహాలు వున్నాయి... అడిగి... తెలుసుకుంటాను...." చిరునవ్వుతో తన గదిలోకి వెళ్లిపోయింది సుధ… రంగా ఫ్రష్ అయి హాల్లోకి వచ్చాడు. "అమ్మా !..." వంటింట్లోవున్న శాంతి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చి... గ్లాసును రంగకు అందించింది. "నాన్నా !... మామయ్యగారి ఇంటికి వెళుతున్నావా ?....." కాఫీ త్రాగుతూ... "అవునమ్మా..." చెప్పాడు రంగా. సుధ తన గదినుండి బయటికి వచ్చింది. "అన్నయ్యా !... మామయ్యా వాళ్ల ఇంటికి నేనూ రానా?" అడిగింది. రంగా క్షణం సేపు సుధ ముఖంలోకి చూచి... తల్లి ముఖంలోకి చూచాడు. ఆ చూపుల్లో సుధ తనతో రావడం ఇష్టం లేదన్న భావన.. స్పష్టంగా సుధకు, శాంతికి అర్థం అయింది. "నీవు ఇప్పుడు వద్దులేవే... వాణ్ణి వెళ్లిరానీ! మనం తర్వాత వెళదాం..." అనునయంగా కూతురుకు చెప్పింది శాంతి. "సరే అమ్మా.." తల ఆడించి సుధ తన గదిలోనికి వెళ్లిపోయింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iIrry5txsIo
Embed this episode
NOW PLAYING
ఊపనా ఊయల | Upana Uyala | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.