వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు' episode artwork

EPISODE · May 3, 2021 · 23 MIN

వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'

from Harshaneeyam

హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు."కథ చెయ్యాల్సిన పని వర్తమానం నించి భవిష్యత్తు గా మారే, పరిణామ క్షణాన్ని (that fleeting moment) , పట్టుకునేందుకు ప్రయత్నించడం. దానికుండే పరికరాలు , similes, metaphors, images, magic realism మొదలైనవి.. అనుకూలమయిన వాటిని ఎన్నుకుని వాడడం లో రచయిత ప్రత్యేకత ప్రతిభ వెల్లడవుతుంది" - శ్రీ. మధురాంతకం నరేంద్ర 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి 'అపరాజిత' అనే కథాసంపుటిలోనిది.ఈ కథ రాసింది, 1964-65 మధ్య కాలంలో. అవి, మధ్యతరగతి కుటుంబాలు , వ్యవసాయాధారిత జీవనాన్ని వదిలేసి, ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలి వెళ్లడం అనే మార్పు మొదలైన రోజులు. కథలో ముఖ్య పాత్రధారి వేణుగోపాల్. అతని 'ఐడెంటిటీ క్రైసిస్' ఈ కథలో ముఖ్యాంశం. అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి. వేణుగోపాల్ ఇబ్బందులు , ఆఫీస్ కు వెళ్ళడానికి బస్సు కోసం క్యూ లో నిలబడ్డప్పుడు మొదలౌతాయి. బస్సుల నిండా జనాలే. రెండు బస్సులు అసలు స్టాప్ లో ఆగకుండా వెళ్లిపోతాయి. మూడో బస్సు ఆగినా అతను ఎక్కేలోపల, బస్సు నిండిపోయి వెళ్ళిపోతుంది. ఈ గోలలో సగం చచ్చి ఆఫీసు కు వెడితే, అక్కడ ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. బాస్ రూంలోకి వెళ్తే , ఆయన మాటల్తో తను ఒక మనిషిని కాదేమో అన్న అనుమానం కలగచేస్తాడు వేణుగోపాల్ కి.సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందర అవసరార్థం ఏదో ఒక షాపు లో అడుగుపెడితే, అక్కడి అనుభవం అతని ఇబ్బందిని తీవ్ర తరం చేస్తుంది.అక్కడ్నించీ ఇంటికి వెళ్లే లోపల , అతనికి సాంత్వన ఎలా లభిస్తుంది అని వివరిస్తూ కథను చక్కగా ముగిస్తారు రచయిత.ఒక సాధారణమైన జీవితం గడిపే మనిషి రోజూ వారీ అనుభవం నించి కథను సృష్టించారు రచయిత. ఈ క్రమంలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగతం అయ్యేలా చేస్తారు.కథలో ముఖ్య పాత్రధారి మానసిక స్థితిని క్రమంగా గట్టిపడే బంకమన్ను తో పోలుస్తారు రచయిత.పాండురంగరావు గారు ఈ కథగురించి మాట్లాడుతూ -"మన నాగరికత విస్తరించిన కొద్దీ వ్య క్తిగా మానవుడు సంకుచించుకు పోతున్నాడు. ఇంకా మన దేశంలో ఈ “మంది” తనం అన్న భూతం నూటికి నూరుపాళ్ళూ విస్తరించలేదు గాని, దాని లక్షణాలు మాత్రం స్పష్టంగా అగుపడుతూనే ఉన్నాయి." అన్నారు. అరవై ఐదు ఏళ్ల క్రితం ఈ కథ రాస్తూ , రాబోయే కాలంలో సమాజంలో వచ్చే మార్పు ను గురించి ముందుగానే సూచించారు పాండురంగరావు గారు. కథ: “తీరప్ప రం రం , తీరప్ప రం రం “అన్న స్వీయ కృతిలోని ఒక్కొక్క చరణాన్నీ ఒక్కో స్థాయిలో పాడుతూ తలదువ్వుకుంటున్నాడు వేణుగోపాలం.హఠాత్తుగా పాట ఆపి వంటింట్లోకి పరుగెత్తాడు. “లలితా !" పూజ చేసుకుంటున్న లలిత ఇటు తిరిగింది. “ఇటురా : ఒక నిమిషం.... అర్జెంటు...."'అయిదు నిముషాలయింది. ఆమె వచ్చింది.అతడి కళ్ళల్లోని వెలుగు చూచింది. ఇందాకటి సంగీతం కూడా విన్నది మరి. “ఏవిఁటి” అని అడిగింది నోరు తెరవక నే.“సువార్త. సుందరీ | సువార్త! ఇవాళ నీ నాధుడి చేతికి రెండు వందలా నలభై రూపాయ లొస్తాయి."“ఎక్కడి నుండి !"“మహా ఘనత వహించిన సర్కారు వారినుండి ! వారు మన ఇంక్రిమెంటు ఇవ్వకుండా రెండేళ్ళు నిద్దరోయి, ఈ మధ్య మేలు కున్నారు.""ఓహో!"“అంచేత ఈ సుమూహూర్తాన నేను నీకు ఏదయినా కొని పెట్టదలచుకున్నాను. ఏం కావాలి కోరుకో !" అని గర్వంగా, భక్తుడి ఎదుట ప్రత్యక్షమయిన మహావిష్ణువులా అడిగాడు వేణు. ఆవిధంగా అతడు అడగగలిగిన అవకాశాలు వాళ్ళ జీవితాలలో ఎన్నో రాలేదు.తన భర్తమీద జీవితం చల్లని చూపు చూడలేదని - ఎందరో భార్యల్లాగే లలిత కూడా నమ్మేది.ఇప్పు డతడి చూపులో, మాటలో చిందుతున్న సంతోషం ఆమె గమనించింది. నచ్చిన బొమ్మతో ఆడుకుంటున్న బిడ్డను చూచిన తల్లిలా నిండిపోయింది ఆమె మనసు.““ఊ • కోరుకో ! ఒక జత బంగారు గాజులు • ధర్మవరం పట్టుచీర • మహాబలిపురం యాత్ర - ఏది కావాలో కోరుకో."“నా కేమీ వద్దండీ • చింతా చికాకూ లేకుండా, హాయిగా నవ్వుతున్న మీరే నాకు అన్ని బహుమతులూను.""వ్రత రత్నాకరం చదవడం మానేయి." “నిజంగానే నాకేమీ వద్దు ““అట్లా కాదు.. నేను ఏదో ఒకటి కొన దలచుకున్నాను నీకు." “అయితే మీ ఇష్టం - మీకేది నచ్చితే అది తీసుకురండి."“అదుగో ఆ మాటంటేనే నాకు మండుకొస్తుంది. నిన్నొక మనిషిగా పిలిచి ఏమికావాలని అడుగుతున్నానా ! నీ ఇష్టానిష్టాలు తెలుపకుండా నా ఇష్ట ప్రకారం కొనమంటా వేం ? నీకు మనసు లేదూ!నీ కొక అభిప్రాయం ఉండదూ ? నువ్వొక వ్యక్తివి కావూ ! అన్నీ నాకు వదిలేస్తే ఏమిటని నీ అర్ధం ..... నువ్వు ఒక మనిషివి. నా నీడవు కావు. అది తెలుసుకో." అని గబ గబా బట్టలు మార్చుకో సాగాడు వేణుగోపాలం.“ఏమిటో బాబూ . నాకేమీ తెలియదు." అంటూ వడ్డనకుపక్రమించింది లలిత.భోజనం ముగించి బయటపడి  తొమ్మిదిన్నరకు బస్టాండ్ లో విల్చుని ఉన్నాడు. వేణుగోపాలం,  డెబ్బై తొమ్మిదిమంది గల 'క్యూ'లో డెబ్బయిఆరవ వాడుగా.పది అయింది. మూడు బస్సులు రావడం, వాటిలో రెండు ఆగక పోవడం, ఆగిన ఒకదానికోసం 'క్యూ' చచ్చి బ్రతకడం - అన్నీ జరిగాయి.నాలుగవ బస్సు వచ్చి సగం జనం తగ్గేసరికి పదీ పది అయింది. వేణు ఆఫీసు పదింబావుకు మొదలవుతుంది.ఆఫీసుకు వెళ్ళి చెక్కు అందుకుని బ్యాంకికి పంపాలి. ఆ వేళ శనివారం. పన్నెండు దాటితే బ్యాంకు వాళ్ళు డబ్బులివ్వరు. ఇవాళ ఆ డబ్బు లందకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. నిప్పులమీద నిల్చున్న వాడిలా చిందులు తొక్కాడు వేణుగోపాలం. తన ప్రక్క నున్న, సూటు వేసుకున్న బట్టతలాయనతో అంతవరకూ సైప్రసు వ్యవహారమూ అదీ మాట్లాడిన వాడల్లా ఢామ్మని విషయం మార్చేసి “చీ ! వెధవ దిస్సులూ, వెధవ జనమూ.... కారు గనుక ఉంటే ఈ చండాలమంతా లేదు. అనుకున్న చోటికి, అనుకున్న వేళకు వెళ్ళి పోవచ్చు." అన్నాడు వేణు.సూ. వే. దిట్టతలాయన ఒకసారి తలమీది చర్మాన్ని రుమా లుతో తుడుచుకుని “ప్చ్ ” అన్నారు. “అంటే ఏవిఁటని మీ ఉద్దేశం" అని కళ్ళతో అన్నాడు-ఖాళీగా వెళ్ళిపోతున్న టాక్సీని పిలవడానికి డబ్బుల్లేని వేణుగోపాలం.ఆ టాక్సీని గమనించని సూ. వే. బ . త. చెప్పసాగారు - “అబ్బే, కారులున్నా లాభం లేదండీ ! నాకు చూడండి. ఒకటికి రెండు కార్లున్నాయి. కాని ఏం లాభం..... ఒకటేమో  మాఆవిడ తీసుకువెళ్తుంది. ఇహ రెండోది నాది. దానిని మా అబ్బాయి తీసుకు వెళ్ళి లారీకి గుద్దించాడు. అంచేత ఇదిగో ఇక్కడ 'క్యూ'లో ఏడుస్తున్నాను .... గనుక కారుల విషయంలో మీ నమ్మకం ఉత్త భ్రమ మాత్రమే అని చెప్పగలను .... కారు ఉంటే హాయిగా, జోరుగా, ఉషారుగా వెళ్లి పోవచ్చనికదూ అన్నారు... అది చాలా పెద్ద అచ్చు పొరబాటు. కారు అంటూ ఉంటే మీ ఒక్కరికే ఉండదుగా అడ్డమైన వాళ్ళందరికీ ఉంటాయి కార్లు. ఆ తర్వాత మరి కార్లు నడవ డానికి రోడ్లు. కావాలి--- రోడ్లు ఆ రోడ్లమీద అడ్డదిడ్డంగా సవాలక్ష కార్లు. ట్రక్కలు, దిస్సులు, సైకిళ్ళు, మనుష్యులు వీటన్నిటిని మించి ఎర్ర దీపాలు ఉంటాయి. చూశారు. అందుకని కారున్నాసరే ఈ తొక్కిడి, ఈ జనమూ ఇంకో విధంగా అనుభవించక తప్పదు." అని చాలా వివరంగానే చెప్పారాయన.అవును. ఇది నిజంలాగే ఉంది అనుకుని తల వూచాడు వేణు. కాని లోలోపల ఎక్కడో ఏదో బంకమట్టి ముద్దలా ఉన్న ట్లనిపించింది.ఇంతలో ఒక వింత విషయం జరిగింది. ఒక ఖాళీ బస్సు వచ్చింది. ఆ 'క్యూ' ని మింగసాగింది. హాల్లో పంకా తిరుగుతూంది. కిటికీ ప్రక్కగా కూర్చున్న వేణుగోపాలానికి పంకాతో అవ సరం లేదు. కాని దాని గాలి అతడి టేబిలు మీదికి రాక మానదు ! ఆ  కాగితాలని రెచ్చగొట్టక మానదు. ఇంచక్కా కిటికీ లోంచి గాలి వస్తూంటే పంకా ఎందుకు వేసుకోవాలో తెలీదు  వేణుగోపా లానికి. ఆ మాటే మునుపోసారి  చెబితే ఆ గుర్నాధమూ, వేలుమణీ పోట్లాట కొచ్చారు. “చెమటతో తడిసి చస్తున్నాం మేము. ఇది ఆఫీసు పంకా. దీన్ని ఆపమనడానికి నువ్వెవరు - పంకా అక్కర్లేక పోతే వెళ్ళి వరండాలో కూచో." అన్నారు. ఏమిటో అవతలి వారు ఒక మనిషని గమనించరు కదా !గడియారం టంగుమని పలికింది. పదకొండున్నరయింది. ప్యూన్ రజాక్ ని బ్యాంకికి పంపి అరగంటయింది. వాడింకో గంటలో వస్తాడేమో తన డబ్బుతో“వేణుగోపాల్ గారూ !”స్టెనో  గొంతు విని అదిరి పడి లేచాడు ఆ పేరు గలవాడు. స్టెనో పిలవడమంటే పెద్ద దొర గారు పిలుస్తున్నారన్నమాట.వెళ్ళి పెద్ద దొర గదిలో నిల్చున్నాడు వేణుగోపాలం. విశాలమైన మంచంలాంటి టేబిల్ కొకమూలగా, గోడనంటి పెట్టుకుని, భయ భక్తులతో నిల్చుని ఉన్నాడు. దంతం రంగు టెలిఫోను, గాజుపలక మీద పార్కర్  పెన్నులు రెండు, రంగు పెన్సిలు, చిన్న తెల్లకాగితాల పుస్తకం, ముచ్చటయిన పేపర్ వెయిట్ లు నాలుగు, రెండు ట్రేలు, ఆష్ ట్రే - గల ఆ టేబిలు ఉపరితలం ఇంకేదో లోకానికి అద్దం పట్టినట్లుంది .. తాను లోపలికి రావడం గమనించకుండానే గ్రహించిన దొరగారు తన వైపు చూడకుండా, ఎదుట ఉన్న ఫైలుని, చూస్తూ పైపు  పీలుస్తూ మధ్యమధ్య కళ్ళు మూస్తూ, మళ్ళీ తెరుస్తూ. పొగ విడుస్తూ ఉంటే - వారి దృష్టిలో తనొక మనిషా. లేక ఆ గదిలో ఉన్న వస్తువులలో ఒకటా అన్న సంశయం వచ్చింది వేణు...

NOW PLAYING

వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'

0:00 23:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 23 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on May 3, 2021.

What is this episode about?

హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి,...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!