EPISODE · Mar 8, 2023 · 9 MIN
వార ఫలాల వింత గోల | Vara Falala Vintha Gola | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వార ఫలాల వింత గోల రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ, కాఫీ ఇటు దక్షిణపు దిక్కులో పెట్టాను, తీసుకోండి" అంది సుజాత. "ఎందుకే ఈమూల పెట్టమని రాశారా.. ఈవారం నీ వార రాశి ఫలంలో?" అన్నాడు సుబ్బారావు చిరాగ్గా. "అవునండీ, ఈ వారం ఉత్తరపు దిక్కున వస్తువులు పెట్టటం కాని నన్ను ఆవైపు తిరగటం కాని చేయవద్దన్నారు నా మేష రాశిలో." "నీ మొహం మండా, నాకు నా సింహ రాశిలో దక్షిణ దిక్కున పెట్టిన కాఫీ తాగవద్దన్నారని ఉందే! ఉత్తరపు దిక్కున పెట్టు" అన్నాడు సుబ్బారావు. "కానీ నేను ఆ పని చేయలేను" అని సుజాత, "చేయాల్సిందే" అని సుబ్బారావు.. వాదనలలో ఉండగా గేమ్ ఆడుకుంటూ ఉన్న వాళ్ల అబ్బాయి సాయి వచ్చి "మళ్ళీ మొదలెట్టారేమి? ఖర్మరా బాబు" అనుకొంటూ వచ్చి కాఫీ కప్ ను ఉత్తరదిక్కులో పెట్టి వెళ్ళాడు, తన గేమ్ కు వీళ్ళు అంతరాయం కలిగిస్తున్నారని. "ఏమండీ! మార్కెట్ కు వెళ్తున్నారా? వెళ్తే ఓన్లీ పసుపుపచ్చ పూలు, పసుపుపచ్చ కూరగాయలు తెండి" అంది సుజాత. "నాకు ఈ వారం ఎటూ తిరగ వద్దన్నారే! అందుకని ఈ వారం ఎక్కడకీ వెళ్లక ఇంట్లోనే ఉంటా." అన్నాడు సుబ్బారావు. "అయ్యో! కూరలు ఎలాగండీ" అంది సుజాత. "నీ పుత్ర రత్నం ఉన్నాడుగా.. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ కొంగు పట్టుకు తిరుగుతాడుగా వాడ్ని పంపు" అన్నాడు సుబ్బారావు విసుగ్గా. 'అబ్బా! మళ్ళీ వాదనలు మొదలెట్టారు ఈ మమ్మీ, డాడి.. ఎప్పుడూ ఈ రాశి, ఆ రాశి అని ఒకటే గోల! చస్తున్నా వీళ్ళతో..' అనుకుంటూ సాయి బయటికి వచ్చి "ఏది డాడి, స్కూటర్ కీస్ ఇవ్వు.. కూరలు తెస్తాను" అన్నాడు. "అక్కడ ఉంది తీసుకో, కాని నన్ను ఆకుపచ్చ కూరలు తినమన్నారు. నాకు అవి తీసుకురా" అన్నాడు సుబ్బారావు. "నన్ను పసుపు పచ్చ కూరలు తినమన్నారురా.. అవి తీసుకురా నాకు" అంది సుజాత. "పసుపురంగులో ఎండుగడ్డి ఉంటుంది, అది తీసుకురా మీ అమ్మకు, బలం కూడా..." అన్నాడు వెటకారంగా సుబ్బారావు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/a9rkoXWZt3A
Embed this episode
NOW PLAYING
వార ఫలాల వింత గోల | Vara Falala Vintha Gola | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.