వాసంతసమీరం | Vasanthasameeram | Telugu short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 29, 2023 · 8 MIN

వాసంతసమీరం | Vasanthasameeram | Telugu short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాసంతసమీరం రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాయంత్రం వేళ పార్కులో కూర్చుని కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లలని చూస్తోంది వాసంతి. బాంకు ఉద్యోగ బాధ్యతలతో నిత్యం ఒత్తిడికి గురవుతూ వారాంతంలో ఇలా దగ్గరగా ఉన్న పార్కుకు వచ్చి ప్రశాంతంగా కాసేపు గడపడం ఆమెకు అలవాటు. హఠాత్తుగా ఒక బంతి వచ్చి ఆమె దగ్గరగా పడడం, ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ రావడం రెప్పపాటులో జరిగింది. ముద్దులొలికే ఆ పాపకి సుమారు ఐదారు సం…వయస్సు ఉండచ్చేమో. బంతిని ఆ పాప చేతికిచ్చి " నీపేరేంటి పాపా"? అంది వాసంతి. "సమీర " ముద్దుముద్దుగా చెప్పింది ఆపాప. 'ఎంత అందమైన పేరు' అని మనసులో అనుకుంది వాసంతి. ఇంతలో 'సమీరా' అంటూ పిలుస్తూ ఒకతను వచ్చాడు. పాపని ఎత్తుకొని తీసుకుని వెళుతూ వాసంతిని చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది వాసంతికి. వెంటనే గుర్తుపట్టి " మీరు రమేష్ కదా!" అంది. "మీరు వాసంతి కదా!" అన్న అతని మాటలకు నవ్వుతూ "అవును. దా! కూర్చో. ఎలా ఉన్నావు?" అడిగింది వాసంతి. "బానే ఉన్నాను. నీవెలా ఉన్నావు?" అంటూ పాపని ఒళ్లోకూర్చొపెట్టుకుని కూర్చున్నాడు రమేష్. అతని పలకరింపుకు జవాబుగా చిరునవ్వు నవ్వింది వాసంతి. "నా కూతురు సమీర" అని పాపను చూపించి "నమస్కారం పెట్టు" అన్న తండ్రి మాటలకు "నమస్తే ఆంటి" అంది సమీర. ముద్దులొలికే ఆ పాప మాటలకు ముచ్చటేసి పాపను దగ్గరకు తీసుకుంది వాసంతి. ఈ ఊరిలో తను లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు చెపుతూ 'నీ గురించి చెప్పు?' అన్నాడు రమేష్. "నేను బాంకులో ఉద్యోగం చేస్తూ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకున్నాను" అంది వాసంతి. "మీ వారు ఏంచేస్తున్నారు? అన్న అతని మాటలకు అడ్డొస్తూ ' నేను పెళ్లి చేసుకోలేదు' అని దూరంగా ఎటో చూస్తూ గంభీరంగా జవాబిచ్చింది వాసంతి. ఒక్క క్షణం ఆమెని నిశితంగా పరిశీలించిన రమేష్ వెంటనే వాతావరణాన్ని తేలిక పరుస్తూ కాసేపు ఏదో మాటలను చెప్పి సరదాగా ఆమెని నవ్వించాడు. పాపని తీసుకుని వెళుతూ ఒకరోజున వాసంతిని తన ఇంటికి రమ్మని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్లాడు రమేష్. వాళ్లు వెళ్లిన వైపే చూస్తూ తను కూడా లేచి ఇంటికి వెళ్లింది వాసంతి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RHFASuVJmMg

Episode metadata supplied by the publisher feed · Published Jan 29, 2023

Embed this episode

NOW PLAYING

వాసంతసమీరం | Vasanthasameeram | Telugu short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 8:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!