EPISODE · Jul 15, 2022 · 11 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 11 | Ventade Nida Episode 11 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 11 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో మామిడి తోట దగ్గర ఉన్న శ్యామలరావు దంపతుల దగ్గరకు పోలీసులు వస్తారు. మాటల్లో హైదరాబాద్ లో ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భార్య పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెబుతారు. తమ అల్లుడు వికాస్ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కావడంతో వాళ్ళు ఆందోళన పడతారు. శంకర శాస్త్రి కూతురు దీక్ష పైన కూడా మత్తు మందు ప్రయోగించాలని చూస్తాడు, తనను గోవర్ధన స్వామిగా చెప్పుకునే ఓ వ్యక్తి. ఆ మత్తు కలిపిన విభూతి వాసన చూసిన ఆమె స్నేహితురాలు నీలిమ స్పృహ తప్పుతుంది. ఇక చదవండి... తన మొబైల్ కనిపించకపోవడంతో, స్నేహితుడి మొబైల్ నుండి తన అన్న వికాస్ కు కాల్ చేస్తాడు విశాల్. అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేయగానే "అన్నయ్యా! నేను విశాల్ ను. నా మొబైల్ పోవడంతో స్నేహితుడి మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను. వదినను హాస్పిటల్లో అడ్మిట్ చేశారా.. తనకు ఎలా ఉంది? రాత్రి కొన్ని కారణాలవల్ల నేను రాలేకపోయాను" అంటూ ఇంకా ఏదో మాట్లాడ బోతుండగా అవతలి వైపు నుండి వికృతమైన నవ్వు వినపడింది. "ఎవరు.. ఎవరు మాట్లాడేది? మా అన్నయ్య ఫోన్ నీ దగ్గరకు ఎలా వచ్చింది.." ఆదుర్దాగా అడిగాడు విశాల్. తన వికటాట్టహాసాన్ని కొనసాగిస్తూ, "నా పేరు డాక్టర్ గోవర్ధన్! మీ వదిన డెలివరీ నేనే చేయాలనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. అయినా మించిపోయింది లేదు. ఒకవేళ డెలివరీ బాగా జరిగి, మీ వదిన ఐసీయూ నుండి బయట పడితే తొందర్లోనే మరో అటెంప్ట్ చేస్తాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరో క్షణం లోనే అతనే కాల్ చేసి "వెంటనే టీవీ ఆన్ చేసి చూడు. మీ వదిన గురించి న్యూస్ స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది" అన్నాడు... Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/XmeW2NHO4eY
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 11 | Ventade Nida Episode 11 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.