EPISODE · Jul 23, 2022 · 12 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 12 | Ventade Nida Episode 12 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 12 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో తన అన్న వికాస్ నంబర్ కు కాల్ చేస్తాడు విశాల్. అటువైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, టివి లో స్క్రోలింగ్ చూడమనీ చెబుతాడు. టివిలో విశాల్ వదిన శ్రేయ మీద హాస్పటల్ లో హత్యాప్రయత్నం జరిగినట్లు చూపిస్తూ ఉంటారు. హాస్పిటల్ కు కాల్ చేసి, వికాస్ తో మాట్లాడుతాడు విశాల్. తరువాత వికాస్, ఇంట్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేస్తాడు. బాబును తీసుకొని వెళ్ళడానికి ఎవరో గోవర్థన్ అనే వ్యక్తి వచ్చినట్లు కొడుక్కి చెబుతాడు అతని తండ్రి విజయానంద. ఇక చదవండి... తండ్రితో మాట్లాడాక, లెక్చరర్ నరసింహారావు గారికి ఫోన్ ఇచ్చింది దీక్ష. శంకర శాస్త్రి ఆయనతో మాట్లాడుతూ "ఆ అమ్మాయికి ప్రమాదం ఏమీ ఉండదు. కాస్సేపటికి స్పృహ వస్తుంది. ఇక మా అమ్మాయిని అక్కడే నలుగురిలో ఉంచుకో. ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వొద్దు. మేము కారులో ఊరికి బయలుదేరుతున్నాం. దీక్షను అక్కడే పికప్ చేసుకుంటాను" అన్నాడు. "ఇంత అర్జెంట్ గా ప్రయాణమా..సర్లే.. ఎక్కడికని అడగకూడదు కదూ! ఇంతకీ మీ బావమరిది గారి అబ్బాయి.. అదే.. ఆ సుమంత్ ఆచూకీ ఏమైనా దొరికిందా?" "ఇంకా తెలీలేదు నరసింహా! ఆ అబ్బాయి కోసం మృత్యుంజయ హోమం చేయించాలని అనుకున్నప్పటి నుంచీ ఏవో కష్టాలు వస్తున్నాయి. రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్లి, అక్కడే హోమం జరిపించాలని నిశ్చయించాను. నన్ను అక్కడికి వెళ్లనివ్వకుండా ఎవరో ప్రయత్నిస్తున్నారు. అది మనిషో లేక దుష్ట శక్తో తెలీడం లేదు" అన్నాడు శంకర శాస్త్రి.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/DBImVd5bhC8
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 12 | Ventade Nida Episode 12 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.