EPISODE · Sep 10, 2022 · 10 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 16 | Ventade Nida Episode 16 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 16 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… సీఐ కిషోర్ ని వెనకనుండి అటాక్ చేస్తాడు అగంతకుడు. ఏసిపి ప్రతాప్ విజయవాడ పోలీసుల్ని అప్రమత్తం చేస్తాడు. లారీ కిందికి సుమంత్ ని తోసేయాలని ప్రయత్నించాడు గోవిందు. కుదరక పోవడంతో తనే కారు కిందకి దూకుతాడు. సుమంత్, తన తండ్రికి కాల్ చేసి తన పరిస్థితి వివరిస్తాడు ఇక చదవండి… గోవిందును హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తరువాత హాస్పిటల్ మేనేజర్ సుమంత్ ను ఏం జరిగిందని అడుగుతాడు. "గోవిందు నా వద్దకు వచ్చి డాక్టర్ గోవర్ధన్ నాకు విషం ఇంజెక్ట్ చెయ్యబోతున్నాడని చెప్పాడు. నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు. అప్పుడతని చూపులు మామూలుగా లేవు. ఏదో మత్తులో ఉన్న వాడి చూపుల్లా ఉన్నాయి. నన్ను రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందకు నెట్టెయ్యాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను పడిపోలేదు. మీరు రావడంతో అతను కారు కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు" చెప్పాడు సుమంత్. "నాకు ఒక సందేహం. గోవిందు మిమ్మల్ని లారీ కిందకు నెట్టడానికి తన బలాన్నంతా ఉపయోగించాడు. మేము దూరం నుండే అది గమనించాము. కానీ మీరు ఎంతమాత్రం కదల్లేదు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది" అన్నాడు హాస్పిటల్ మేనేజర్. "నాక్కూడా అదే అర్థం కావడం లేదు. నిజానికి నాకు వంట్లో చాలా నీరసంగా ఉంది. గోవిందు నా చెయ్యి పట్టుకుని నన్ను బయటకు సులభంగా లాక్కొని వెళ్ళాడు. కానీ అతను తోసినప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా దైవానుగ్రహమే. మా మామయ్య శంకర శాస్త్రి నాకోసం పూజలు చేస్తున్నారు. ఆ ప్రభావమే నన్ను కాపాడి ఉండవచ్చు" అన్నాడు సుమంత్. తరువాత అతను రిసెప్షన్ లో ఉన్న ఒక ఫోన్ నుండి తన తండ్రికి కాల్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలియజేశాడు. తరువాత హాస్పిటల్ మేనేజర్ తో "నేను అనుకున్నదే కరెక్ట్. సరిగ్గా గోవిందు నన్ను లారీ కిందకు తోసే సమయానికి మా మామగారు నా ఫోటో పైన విబూది ఉంచారట" అని చెప్పాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/eUWKEYffn0A
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 16 | Ventade Nida Episode 16 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.