EPISODE · Sep 19, 2022 · 23 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 18 | Ventade Nida Episode 18 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 18 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మామిడి తోట దగ్గర పోలీసుల్ని చూసిన అగంతకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో కాలుజారి, కింద పడతాడు. అతని తల, ఒక రాయికి కొట్టుకుని తీవ్రంగా గాయపడతాడు. అతన్ని చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు. చలపతిరావు ఇంటి దగ్గర శంకర శాస్త్రి కోసం మాటువేసి వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని, తీవ్రంగా గాయపరుస్తారు. అతన్ని కూడా చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు. సుమంత్ ఆచూకీ తెలుసుకున్న విశాల్, అతని కోసం విజయవాడ బయలుదేరుతాడు. ఇక చదవండి… హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంకరశాస్త్రి, తన బావమరిది చలపతిరావు తో కలిసి, హాస్పిటల్ లో ఉన్న సుమంత్ ని కలుస్తాడు. కొడుకును చూడగానే చలపతిరావు పట్టరాని ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రిని ఓదార్చిన సుమంత్ శంకరశాస్త్రి పాదాలకు నమస్కరించ బోతాడు. అతన్ని వారించిన శంకరశాస్త్రి “భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే నువ్వు క్షేమంగా బయటపడ్డావు” అన్నాడు. “నేను స్పృహలో లేనప్పుడు ఒక వింత ఆకారం నన్ను వెంటాడుతున్నట్లు అనిపించేది. ఆ ఆకారం నన్ను అగాథంలోకి తోస్తున్న సమయంలో మీరు కాపాడినట్లు అనిపించేది” అని చెప్పాడు సుమంత్. “ నిజమే బాబూ! నిన్ను కాపాడుతున్నందుకు ఏదో దుష్ట శక్తి ఆయన మీద పగబట్టింది. దాడికి ప్రయత్నించింది” అని చెప్పాడు చలపతిరావు. శంకరశాస్త్రి, సుమంత్ తో మాట్లాడుతూ “నీ కోసం మృత్యుంజయ హోమం చేశాను. ఇక నీకు ఏ భయమూ ఉండదు”అన్నాడు. ఇంతలో డాక్టర్ గోవర్ధన్ అక్కడికి వచ్చాడు. ఆయనకు నమస్కరించాడు సుమంత్. చలపతిరావు కూడా ఆయనకు నమస్కరిస్తూ “చక్కటి వైద్యం అందించి మా అబ్బాయి తొందరగా కోలుకునేలా చేశారు” అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు. డాక్టర్ గోవర్ధన్, సుమంత్ తో మాట్లాడుతూ “హైదరాబాద్ నుండి ఏ సి పి ప్రతాప్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాక నేరస్తులను గుర్తుపట్టే కార్యక్రమం ఉంటుంది. ఈలోగా విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు” అన్నాడు. తరువాత చలపతిరావు వైపు తిరిగి “పోలీసులు వచ్చాక ఎంత కాదనుకున్నా సుమంత్ ని ప్రశ్నలతో ముంచెత్తుతారు. కాబట్టి అంత వరకైనా అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి” అని చెప్పాడు. శంకర శాస్త్రి డాక్టర్ తో "ఒక్క నిముషం. ఈ మంత్రించిన ఆంజనేయ స్వామి తాయత్తు సుమంత్ చేతికి కట్టేసి వెడతాను" అన్నాడు. ఒక్కసారిగా డాక్టర్ గోవర్ధన్ ముఖం వికృతంగా మారింది. "ఇదిగో పెద్దాయనా! చెబుతుంటే అర్థం కాదా? పేషేంట్ ని ఇబ్బంది పెట్టొద్దు. ముందు అందరూ బయటకు వెళ్ళండి" అన్నాడు కఠినంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/1xc3nTd8xpE
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 18 | Ventade Nida Episode 18 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.