EPISODE · Jul 10, 2022 · 4 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 2 | Ventade Nida Episode 2 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 2 రచన : మల్లవరపు సీతారాం కుమార్ (ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక వింత ఆకారం సుమంత్ మీద దాడి చేస్తుంది. చేతికి దొరికిన రాయితో దాన్ని గాయపరుస్తాడతను. ఆ ఆకారం అతన్ని గట్టిగా నెట్టేస్తుంది. ఆ విసురుకు దూరంగా పడిపోతాడు సుమంత్....ఇక చదవండి) ఎముకలన్నీ విరిగినట్లైంది సుమంత్ కి. ఐనా శక్తిని కూడదీసుకుని పైకి లేచాడు. ఆ ఆకారం తిరిగి అతని మీదకు దూకాలని ప్రయత్నించింది. కానీ సుమంత్ ఇందాక రాయితో కొట్టిన దెబ్బకు దాని తలనుండి రక్తం ధారగా కారుతుండడంతో నేలమీద కూలబడి పోయింది. ఇదే సరైన అదను. చుట్టూ చూసాడు సుమంత్. తోట పని కోసం వాడే గునపం కనిపించింది.వేగంగా దాన్ని అందుకొని ఆ ఆకారం గుండెల్లో బలంగా పొడిచాడు. ఆ ఆకారం కాస్సేపు గిలగిలా తన్నుకొని తల వాల్చేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి సుమంత్ కి. అసలు ఆ ఆకారం ఏమిటి? విచిత్రమైన జంతువా? లేక మనిషా? ఇదేమి ఆఫ్రికన్ ఫారెస్ట్ కాదు విచిత్రమైన జంతువులు ఉండటానికి. హై వే పక్కనున్న మామిడి తోట. బహుశా ఎవరైనా మతిస్థిమితం లేని మనిషి అయి ఉంటాడు. ఒకవేళ ఆ ఆకారం ఒక దయ్యమా?... దయ్యమైతే తను కొట్టిన రాతి దెబ్బకి చనిపోతుందా? దయ్యం అంత తేలిగ్గా చనిపోయేట్లయితే ఎవరూ దయ్యాలకు భయపడరు కదా! అసలు చనిపోయాకే కదా దయ్యమయేది! మళ్ళీ ఎలా చనిపోతుంది? ఇంతకీ ఆ ఆకారం చనిపోయిందా లేక స్పృహ తప్పిందా? అతని మదిలో ఎన్నో ఆలోచనలు! Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/VKXbYshG5dQ
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 2 | Ventade Nida Episode 2 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.