EPISODE · Jul 10, 2022 · 15 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 4 | Ventade Nida Episode 4 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 4 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో .... తన మీదకు దూకిన వింత ఆకారాన్ని గునపంతో పొడుస్తాడు సుమంత్. సహాయం కోసం తన స్నేహితుడు విశాల్ కు కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ఆశ్చర్యంగా కింద పడివున్న ఆ ఆకారం దగ్గర నుండి రింగ్ అవుతుంది.. దగ్గరకు వెళ్లిన అతని మీదకు ఆ ఆకారం దూకుతుంది. అతను కళ్ళు తెరిచేటప్పటికి పక్కన విశాల్ ఉంటాడు. జరిగినదంతా కల అని చెబుతాడు.ఇద్దరూ బైక్ లో బయలుదేరుతారు.ముందుకు పడుతున్న నీడలో తన వెనక వున్నది ఆ వికృతాకారమని గమనిస్తాడు సుమంత్. అదుపు తప్పి క్రింద పడిపోతాడు. ఇక చదవండి... మధ్యాహ్నం భోజనం చేస్తూ "అమ్మాయి శ్రేయ డెలివరీ డేట్ చెప్పారన్నావు. వచ్చేవారమే కదూ!" భార్య సావిత్రితో అన్నాడు డాక్టర్ శ్యామలరావు. "అవునండీ! మొదటి డెలివరీ ఇక్కడే విజయవాడలోనే, మన హాస్పిటల్ లోనే చేసాము. హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఈసారి తమ దగ్గరే హైదరాబాద్ లో చేస్తామన్నారు వియ్యంకులు. అన్నారని మరీ దూరపు చుట్టాల్లా డెలివరీ రోజుకు వెళితే బాగుండదు. అలాగని ముందుగా వెళదామంటే మనకు హాస్పిటల్లో తీరిక దొరకదు. " అంది సావిత్రి. ఆమె కూడా ఒక డాక్టర్. "ఒక పని చేద్దాం. నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్ళు. మన హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. డెలివరీ డేట్ కు అక్కడికి వస్తాను. " అన్నాడు శ్యామలరావు. సరేనంది సావిత్రి. "సిటీ లో మంచి పేరున్న గైనకాలజిస్ట్ వి నువ్వు. మన హాస్పిటల్ కి వచ్చే పేషేంట్ లలో తొంభై శాతం నీకోసమే వస్తారు. కాబట్టి నేను వెళ్లడమే కరెక్ట్. కానీ నువ్వు వెళితే అక్కడ కాస్త సాయంగా ఉంటుంది. నేనువెళ్లీ పెద్ద ఉపయోగం ఉండదు, పని పెంచడం తప్ప " మళ్ళీ తనే అన్నాడు శ్యామలరావు. పూర్తి కథ manatelugukathalu.com ( ఎప్పటికీ పూర్తిగా ఉచితం) లో చదవండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/my-fHDO4NW4
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 4 | Ventade Nida Episode 4 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.