EPISODE · Jul 10, 2022 · 9 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 5 | Ventade Nida Episode 5 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 5 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... మామిడి తోట దగ్గర ఆగుతారు శ్యామలరావు దంపతులు. అక్కడ గోవర్ధన్ అనే వ్యక్తి వీళ్లకు కనపడతాడు. ఆ తోట వాచ్ మాన్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడతను. శ్యామలరావు దంపతులు బయటకు వెడతారు. విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్ల కోసం డ్రైవర్ వెంకటేష్ తిరిగి తోటలోకి వెడతాడు. అతన్ని ఒక వ్యక్తి కత్తితో పొడవడానికి తరుముకుంటూ వస్తూ ఉంటాడు. అతడు, చనిపోయాడని చెప్పబడ్డ తోటమాలి షణ్ముగం గా గుర్తిస్తాడు శ్యామల రావు. ఇక చదవండి ... ఇదేమిటి? కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న షణ్ముగం తిరిగి ఎలా వచ్చాడు? భయంతో బిగుసుకు పోయిన గొంతును పెగుల్చుకొని "ఎవరు.. ఎవరు నువ్వు? " అని అడిగాడు శ్యామలరావు. "అదేంటి సార్! నన్ను గుర్తు పట్టలేదా? నేను ఈ తోటమాలి షణ్ముగాన్ని" అన్నాడతను. “గుర్తుకు వచ్చావులే. కానీ నువ్వు మా డ్రైవర్ ను ఎందుకు తరుముతున్నావు? మేము తోటలోకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు లేవు?" అతని వంక భయంగా చూస్తూ అడిగాడు శ్యామలరావు. అతను ఏదో చెప్పబోయేంతలో " ఇప్పుడవన్నీ ఎందుకండీ? ముందు మనం బయలుదేరుదాం" అంది సావిత్రి. "సార్! ఇతను మీ డ్రైవర్ అని నాకు తెలీదు. ఆ చచ్చిన గోవర్ధన్ గాడిని పిలవడంతో కోపం వచ్చింది. వచ్చింది వాడి ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. ఆ గోవర్ధన్ చేసిన పని ఇంకా మర్చిపోలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే చంపేసేవాణ్ని" అన్నాడు షణ్ముగం. "గోవర్ధన్ చనిపోవడం ఏమిటి? మేము ఇప్పుడే అతనితో మాట్లాడాము. నేను ఒక్కడినే కాదు, అందరం చూసాము” అన్నాడు శ్యామల రావు.. అంతే...! షణ్ముగం చేతిలోని కత్తి జారి పడింది. పూర్తి కథ manatelugukathalu.com ( ఎప్పటికీ పూర్తిగా ఉచితం) లో చదవండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/jWtbwvjtczo
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 5 | Ventade Nida Episode 5 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.