EPISODE · Jul 10, 2022 · 9 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 6 | Ventade Nida Episode 6 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 6 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఐదవ భాగంలో ... ఇంజక్షన్ తేవడానికి మెడికల్ షాప్ కి వెళ్తాడు వికాస్. ఆ సమయంలోనే అతని భార్య శ్రేయ ఉన్న గదిలోకి ఒక వ్యక్తి వెళతాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, ఇంజక్షన్ చెయ్యడానికి వచ్చాననీ చెబుతాడు. ఇక్కడ మామిడి తోట దగ్గర చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధనమా తెలుసుకోవడానికి తన అల్లుడు వికాస్ కు ఫోన్ చేస్తుంది సావిత్రి. అటు వైపు ఫోన్ తీసిన వ్యక్తి తన పేరు గోవర్ధన్ అని చెబుతాడు. ఇక చదవండి.... భోజనం పూర్తి చేసి పెరట్లోకి వెళ్లి, చెయ్యి కడుక్కొని వచ్చాడు శంకరశాస్త్రి. పెరటి గుమ్మం వద్ద నిలబడి, అతను లోపలికి రాగానే చేయి తుడుచుకోవడానికి టవల్ అందించింది అతని భార్య పార్వతమ్మ. చేయి తుడుచుకొని ఆ టవల్ తిరిగి ఆమెకు అందించాడు శంకరశాస్త్రి. తరువాత హాల్ లోకి వచ్చి ఈజీ చైర్ లో కూర్చున్నాడు. కాసేపటికి పార్వతమ్మ వచ్చి అతని కుర్చీ పక్కనే చేతులు నలుపుకుంటూ నిలుచుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడే ఆమె అలా వచ్చి నిలుచుంటుంది అని అతనికి తెలుసు. "ఏమిటోయ్! కొత్త పెళ్ళికూతురులా అలా సిగ్గు పడుతున్నావు?" అని అడిగాడు ఆమెను. " ఏమీ లేదండీ!" అంది పార్వతమ్మ. "30 ఏళ్ళు నీతో కాపురం చేసిన వాడిని, నీ గురించి ఆ మాత్రం తెలీదా! నేను కోప్పడే విషయం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చేస్తావు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి. "మరేం లేదండీ. నిన్న మా అన్నయ్య, వాళ్ళ అబ్బాయి సుమంత్ ని తీసుకొని మన ఇంటికి వచ్చాడు కదా! ఆ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు. మన అమ్మాయి దీక్షను చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను" నీళ్ళు నములుతూ చెప్పింది పార్వతమ్మ. " వాళ్ళు వచ్చింది పెళ్లి చూపులకు కాదు గదా! అబ్బాయి జాతకం నా చేత చూపించుకోవడానికి వచ్చామని మీ అన్నయ్య చలపతిరావు నాతో చెప్పాడు" అన్నాడు శంకరశాస్త్రి. Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/88HTKyroioA
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 6 | Ventade Nida Episode 6 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.