వెంటాడే నీడ ఎపిసోడ్ 7 | Ventade Nida Episode 7 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 10, 2022 · 9 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 7 | Ventade Nida Episode 7 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 7 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే  ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి, తిరిగి తోటలోకి వెళ్లిన విశాల్ కు అక్కడ సుమంత్ కనిపించడు. ఇక చదవండి... సుమంత్ ఉద్దేశం గ్రహించిన ఆ వ్యక్తి 'నా పేరు వెంటాడే నీడ' అని చెబుతాడు. ఆ మాట వినగానే సుమంత్ భయంతో వణికిపోతున్నాడు. అది గ్రహించిన ఆ వ్యక్తి "ఎందుకలా భయపడుతున్నావు? నీతో  పాటు మీ వాళ్ళు ఎవరూ రాలేదు కదా! అందుకనే హాస్పిటల్ వాళ్ళు నన్ను నీకు పర్సనల్  అటెండెంట్  గా ఉండమన్నారు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చేవరకూ నేను నీకు నీడలా వెన్నంటి ఉంటాను. అందుకే నా పేరు అలా చెప్పాను. నా అసలు పేరు గోవిందం. నువ్వు బహుశా ‘వెంటాడే నీడ’ అనే పేరుతో ఏదైనా హారర్ మూవీ చూసి ఉంటావు. లేదా ఆ పేరుతో ఉండే దయ్యాల నవల చదివి ఉంటావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నీకేం భయం లేదు. కాసేపట్లో డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేస్తారు" అని చెప్పాడు గోవిందం. ఇంతలోనే నర్సు డాక్టర్ దగ్గరకు వెళ్లి, పేషేంట్ కదులుతున్న  విషయం చెప్పి, అతన్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్,  సుమంత్ నాడిని  పరీక్షించి చూశాడు. అతని తలను తన చేతుల్తో అటు ఇటు రెండు మార్లు  కదిపాడు. తరువాత సుమంత్ తో "మీకేం భయం లేదు. ప్రాణాపాయం నుండి బయటపడ్డారు" అని చెప్పాడు. డాక్టర్ పేరు అడుగుదామని ప్రయత్నించాడు సుమంత్. కానీ ఇందాకటి లాగే మాట్లాడలేకపోయాడు. అది గమనించిన డాక్టర్, గోవిందం  వైపు తిరిగి "అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు" అన్నాడు. అది చూసిన గోవిందం, "ఇతను మీ పేరు అడగాలని అనుకుంటున్నాడు" అని డాక్టర్ తో చెప్పాడు. "గుడ్! అతని కదలికలను బట్టి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది  కనిపెట్టగలుగుతున్నావు" అని, సుమంత్ వైపు తిరిగి "నా పేరు డాక్టర్ గోవర్ధన్. నా చేతిలో పడ్డావు కాబట్టి నీ ప్రాణాల గురించిన ఆలోచన వదిలేయ్" అన్నాడు డాక్టర్. అతని మాటలకు సుమంత్ ముఖంలో మళ్లీ కదలికలు మొదలయ్యాయి.  అది గమనించిన ఆ డాక్టర్, గోవిందంతో  "ఇతని భాష పట్టేశావు కదా. ఇప్పుడు ఏం అనుకుంటున్నాడో చెప్పు" అన్నాడు. గోవిందం "అతను ఎందుకో  మీ మాటలకు భయపడుతున్నాడు" అని చెప్పాడు. "భయం ఎందుకు? ఇతను ఉన్న చోటినుంచి కదల్లేడు. కనీసం తల కూడా కదిలించలేక పోతున్నాడు. మరి ఇతని ప్రాణాలు నా చేతిలోనే కదా ఉన్నాయి?" అన్నాడు డాక్టర్ గోవర్ధన్. "విన్నావుగా! నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. భారం డాక్టర్ గారి పైనే వేసి ఉంచు. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు" అని చెప్పాడు గోవిందం.. Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/gITVmUFKIs0

Episode metadata supplied by the publisher feed · Published Jul 10, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 7 | Ventade Nida Episode 7 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 9:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!