వెంటాడే నీడ ఎపిసోడ్ 8 | Ventade Nida Episode 8 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 10, 2022 · 8 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 8 | Ventade Nida Episode 8 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 8 రచన : మల్లవరపు సీతారాం కుమార్ మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే  ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి, తిరిగి తోటలోకి వెళ్లిన విశాల్ కు అక్కడ సుమంత్ కనిపించడు. ఈ హారర్ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది. ఇక వినండి... శ్రేయకు ఇంజక్షన్ చేయబోతున్న వ్యక్తి  తనను తాను డాక్టర్ గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు. ఇంతలో శ్రేయ మంచంపై ఉంచిన వికాస్ ఫోన్ మోగుతుంది.  ఫోను అందుకోబోతున్న శ్రేయను విసురుగా పక్కకు నెట్టి, ఆ వ్యక్తి ఫోన్ తీసుకుంటాడు. అటువైపునుంచి ఒక స్త్రీ కంఠం వినపడటంతో "నేను డాక్టర్ గోవర్ధన్" అని చెబుతూ వికృతంగా నవ్వుతాడు ఆ అగంతకుడు. అతను బలంగా తోయడంతో  కింద పడ్డ శ్రేయ పైకి లేచి, రూమ్ కు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంటుంది. క్రింద పడడం, వెంటనే లేచి వేగంగా పరిగెత్తడం వల్ల ఆమెకు ధారగా బ్లీడింగ్ అవుతోంది. ఆమె వెనుకే పరుగెత్తిన ఆ అగంతకుడు, శ్రేయ తలుపు  వేసుకోవడంతో కోపంతో ఊగిపోతాడు. తలుపు మీద దబదబా బాదుతూ "మర్యాదగా డోర్ తీస్తే ఈ మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లేదంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి నీ అంతు చూస్తాను" అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో ఆ హాస్పిటల్ లో ఉన్న డేంజర్ అలారం మోగింది. ఉలిక్కిపడ్డాడు ఆ వ్యక్తి. 'అంటే తనను  అనుమానించారు అన్నమాట. లాభం లేదు. వెంటనే తప్పించుకోవాలి. వీలు చూసుకుని మరో అటెంప్ట్ చేయవచ్చు' అనుకొని వేగంగా ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. ఆ హాస్పిటల్ లో డాక్టర్లు వెళ్లడం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఉంది. క్షణాల్లో అక్కడికి చేరుకున్నాడు అతను. అప్పుడే లిఫ్ట్ డోర్ తెరుచుకుని డాక్టర్ ఆండాళ్ బయటకు వచ్చింది. అతను ఆమెతో "మేడమ్! రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ లో మీ పేషెంట్ కండిషన్ సీరియస్ గా  ఉంది. వెంటనే వెళ్ళండి" అని చెప్పి తను లిఫ్ట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆ హాస్పిటల్ లో ఎప్పుడూ చూసినట్లు గుర్తు లేకపోవడంతో, పైగా డేంజర్ అలారం మోగడంతో వెనక్కి తిరిగి "మీ పేరు చెప్పండి డాక్టర్" అని అడిగింది డాక్టర్ ఆండాళ్. నా పేరు డాక్టర్ గోవర్ధన్. కొత్తగా హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చాను" అన్నాడు ఆ వ్యక్తి. ఆలోచించేందుకు టైం లేకపోవడంతో రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ వైపు పరుగు తీసింది డాక్టర్ ఆండాళ్. లిఫ్ట్ లోకి  వెళ్లిన ఆ వ్యక్తి క్షణం ఆలోచించాడు. 'కిందికి వెళితే తనను కార్నర్ చేయడం ఖాయం' అనుకొని ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడినుంచి క్షణాల్లో టెర్రస్ పైకి వెళ్ళాడు.. Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/CvRJ3SwAYhU

Episode metadata supplied by the publisher feed · Published Jul 10, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 8 | Ventade Nida Episode 8 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 8:31

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!