వెంటాడే నీడ ఎపిసోడ్ 9 | Ventade Nida Episode 9 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 10, 2022 · 10 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 9 | Ventade Nida Episode 9 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 9 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. గత ఎపిసోడ్ లో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి శంకరశాస్త్రి ఇంటికి వస్తాడు. 'ఆయన కోసం ఒక ప్రత్యేకమైన విభూది తెచ్చాను అనీ, దాన్ని ఆయనకు వాసన చూపించి నొసటన రాయ'మనీ చెబుతాడు. ఆ వ్యక్తి తన పేరు 'గోవర్ధన స్వామి'  అని చెబుతాడు. ఇక వినండి... అతను ఇచ్చిన విభూదిని తీసుకొని భర్త ఉన్న గదిలోకి వెడుతుంది పార్వతమ్మ.  ఎప్పుడూ లేని విధంగా నిద్రలో కూడా భర్త ముఖం చికాకుగా ఉండటం గమనించింది. 'పాపం! ఇందాక కలిగిన భ్రమ వల్ల చికాకు పడ్డట్లు ఉన్నారు' అనుకొని సాధువు తనకు ఇచ్చిన విభూది పొట్లం తెరిచింది. ఆ విభూతిని భర్తకు వాసన చూపించి నొసటికి రాస్తే ప్రశాంతంగా నిద్ర పోతారని భావించింది. పొట్లం తెరవగానే ఆ విభూది వాసన ఏదో తేడాగా అనిపించింది ఆమెకి. ఇందాక తనకు వాసన చూపించిన విభూది ఇది కాదని గుర్తించింది. పొట్లాన్ని తన ముక్కు దగ్గర  వుంచుకొని వాసన చూడగానే ఆమెకు స్పృహ తప్పి, 'ఏమండీ!' అని అరుస్తూ కింద పడిపోయింది. నిద్రలో ఉన్న శంకర శాస్త్రికి తనకు ఇందాక కనిపించిన వికృతమైన ఆకారం మళ్లీ  కనిపించింది. ఈసారి ఆ ఆకారం కాషాయ వస్త్రాలు ధరించి తన ఇంటి వైపు వస్తోంది. నిద్రలోనే అసహనంగా అటూ ఇటూ కదిలాడు శంకర శాస్త్రి.  ఇంతలో భార్య పెట్టిన కేకకు అతనికి మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి తన మంచం పక్కన నేల మీద అచేతనంగా పడి ఉంది అతని భార్య పార్వతమ్మ. ఆమె చేతిలో నుంచి జారిపడ్డ పొట్లం లోని  విభూది నేల మీద  చెల్లాచెదురుగా పడి ఉంది. దూరం నుండే  ఆ విభూది నుండి వింత అయిన తియ్యటి వాసన వస్తోంది. క్షణాల్లో విషయం గ్రహించాడు ఆయన. ముక్కు మూసుకుని తన ఉత్తరీయంతో కిందపడ్డ విభూదిని తుడిచి, దూరంగా విసిరేశాడు. తరువాత ఫ్రిజ్ లోంచి  చల్లటి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. కానీ ఆమెలో చలనం లేదు. వేగంగా ఇంట్లోకి వెళ్లి ఒక ఉల్లిపాయను అడ్డంగా కోసి ఆమె ముక్కు వద్ద ఉంచాడు. ఆ ఘాటుకు ఆమెలో స్వల్పంగా కదలిక వచ్చింది. Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/zHfXNPyEgAI

Episode metadata supplied by the publisher feed · Published Jul 10, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 9 | Ventade Nida Episode 9 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 10:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!