EPISODE · Nov 30, 2022 · 13 MIN
వీరి మధ్యన ఎపిసోడ్ 10 | Veeri Madhyana Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 10 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' పదవ భాగం గత ఎపిసోడ్ లో… సాహసి, తన ట్రాన్స్ఫర్ గురించి మేనేజర్ చంద్రికతో మాట్లాడుతుంది. ఆమె హెడ్డాఫీస్ వాళ్ళతో మాట్లాడి, సాహసిని సికింద్రాబాద్ బ్రాంచ్ లో వెంటనే చేరమంటుంది. ఇక వీరి మధ్యన.. పదవ భాగం చదవండి... అప్పుడే, "అదేంటో చెప్పండి బావగారు." అన్నాడు మోహనరావు, భార్య వంక, కూతురు వంక చూస్తూ. "అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ తీసుకున్న ప్లాట్ లో ఉంటారట. మనం పెట్టే ముహూర్తం వరకు ఎట్టి ఇబ్బంది పరిచే పనులు చేపట్టరట. ఆషాఢం తర్వాత, మన పెద్దలు కలిసి వచ్చి, జరపవలసినవి జరపండి అంటున్నాడు." చెప్పడం ఆపాడు గోపాలస్వామి. "అలానా." అనగలిగాడు మోహనరావు. "పైగా మీ అమ్మాయి, మా అబ్బాయ్ ఎప్పుడో ఇలానే ఆలోచించుకున్నారట. మనం సహకరించమని చెప్పలేదట." అన్నాడు గోపాలస్వామి. "అలానా." మళ్లీ అన్నాడు మోహనరావు. "మనం సమ్మతించగలిగితే, ఈ సమస్య తీరుతుందని మా అబ్బాయ్ అంటున్నాడు. మీరు ఏమంటారు." అడిగాడు గోపాలస్వామి. మోహనరావు భార్యను చూస్తున్నాడు. తల్లిదండ్రులను సాహసి చూస్తుంది. "అప్పటికీ చెప్పాను. నలుగురూ ఏమనుకుంటారో అని కూడా అన్నాను. అందుకు మా అబ్బాయ్, మన నలుగురం పెద్దలం, అంటే మేమిద్దరం, మీరిద్దరు ఏమనుకుంటామో చెప్పమని నన్ను సూటిగా ప్రశ్నించేశాడు. మా ఇద్దరం కాదనలేక పోతున్నాం. మరి మీరు ఏమంటారో చెప్పగలరు." చెప్పాడు గోపాలస్వామి. ఆ మాటలు విన్న శైలజ, భర్తని చూస్తూ, 'సరే' అన్నట్టు తలూపింది. "సరే బావగారు. మేమూ కాదనలేం." అనేశాడు మోహనరావు. "పిల్లల మాట విందాం బావగారు. వాళ్లని నమ్ముదాం." అన్నాడు గోపాలస్వామి. "తప్పక." అనేశాడు మోహనరావు కూతురునే చూస్తూ. తర్వాత, ఆ ఫోన్ ల సంభాషణ కట్ ఐంది. "హమ్మయ్య." అన్నాడు మోహనరావు. శైలజ ఏమీ అనలేదు. సాహసి డిన్నర్ ని కొనసాగిస్తుంది చక్కగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pCNy9LzQdts
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన ఎపిసోడ్ 10 | Veeri Madhyana Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.