EPISODE · Dec 8, 2022 · 13 MIN
వీరి మధ్యన ఎపిసోడ్ 11 | Veeri Madhyana Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 11 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో… రమేష్, కవితలతో బయలు దేరుతుంది సాహసి. దారిలో సామ్రాట్ కారులోకి మారుతుంది. వాళ్ళు అద్దెకు తీసుకున్న ఫ్లాట్ కు చేరుకుంటారు. ఇక వీరి మధ్యన.. పదకొండవ భాగం చదవండి... "కాల్ చేయ్. నేను వస్తాను. ఈ రోజు ఇంట్లోనేగా నేను ఉండేది." చెప్పాడు సామ్రాట్. "అంకుల్ కు కారు అవసరం ఉంటుందిగా." అంది సాహసి. "అక్కడ నా బైక్ ఉందిగా." చెప్పాడు సామ్రాట్. కారు ముందుకు సాఫీగా పోతుంది. "రూట్ చూస్తుండు. నువ్వు నీ స్కూటీ మీద బ్యాంక్ కు వెళ్లి రావడంలో తడబడవు." చెప్పాడు సామ్రాట్. "రూట్ మ్యాప్ పెట్టుకుంటాలే." చెప్పింది సాహసి. "థట్స్ ఫైన్." అన్నాడు సామ్రాట్. "సాయంకాలంకి నా స్కూటీ వచ్చేస్తుంది." అంది సాహసి. సామ్రాట్ ఏమీ అనలేదు. "నువ్వు కారు మీద నీ ఆఫీసుకు తిరిగేస్తావా." అడిగింది సాహసి. "లేదు లేదు. కారు ఐతే ట్రాఫిక్ ఛేదన కష్టం. సకాలంలో ఆఫీసును చేరలేను. ఇంటికి రాలేను. రేపు కారును ఇంటి వద్ద వదిలేసి, నా బైక్ తీసుకుంటాను." చెప్పాడు సామ్రాట్. సాహసి ఏమీ అనలేదు. *** సిక్స్ పియం దాటుతుంది. సాహసి, సామ్రాట్ ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నారు. గంట ముందు మోహనరావు పంపిన సామాన్లును ఫ్లాట్ లోకి చేర్పించుకున్నాడు సామ్రాట్. అప్పటికే సామ్రాట్ చేతతో సాహసి బ్యాంక్ నుండి ఇంటిని చేరి ఉంది. తండ్రికి ఫోన్ చేసి సామాన్లు చేరాయని చెప్పింది. తర్వాత తల్లితో మాట్లాడింది. ఆ సమయంలోనే సాహసి నుండి ఫోన్ తీసుకొని, మోహనరావుతో సామ్రాట్ మాట్లాడేడు. సామాన్లు పంపినందుకు తన ఇబ్బందిని ప్రస్తావించేక, 'థాంక్స్' కూడా తెల్పాడు. సమయం నైన్ పియం దాటింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/YVfBUK8ELvM
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన ఎపిసోడ్ 11 | Veeri Madhyana Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.